జనవరి 2023 

జోష్ సేవా నియమాలు

జోష్ కు సుస్వాగతం, హీలియోస్ బిజినెస్ పార్క్, 11వ అంతస్తు, వింగ్ ఈ, హీలియోస్ బిజినెస్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్, కడుబీసనహల్లి, బెంగళూరు- 560103, కర్ణాటక, భారతదేశంలో తమ రిజిష్టర్డ్ కార్యాలయం గల వెర్సే ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ("వెర్సే" "మన" "మేము" " మాకు "లేదా "జోష్") ద్వారా అందించబడినది. సేవలను కేటాయించడానికి మరియు ప్రోత్సహించడానికి జోష్ మా బ్రాండ్.  భవిష్యత్తులో మొబైల్ అప్లికేషన్ లేదా డెస్క్ టాప్ వెర్షన్ ను లేదా ఏదైనా మాధ్యమంలో లేదా విధానంలో లభిస్తున్న ఏదైనా వెర్షన్ ("సర్వీసెస్" లేదా "ప్లాట్ ఫాం "తో కలిపి) ఉపయోగించడానికి మరియు డౌన్ లోడింగ్ , ఇన్ స్టాలింగ్ చేయడానికి ముందు ఈ నియమాలు మరియు షరతులను మీరు జాగ్రత్తగా చదవాలి మరియు అర్థం చేసుకోవాలి. ఈ నియమాలు మరియు షరతుల లక్ష్యానికి గాను, వెర్సేకి చేసే ఏదైనా సూచనలో అనుబంధ సంస్థలు, మాతృ కంపెనీ, దాని వ్యాపార సంస్థలు మరియు సోదరి సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సేవా నియమాలు, గోప్యతా విధానం , కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలు మరియు ఇతర వర్తించే అన్ని చట్టాలు మరియు నిబంధనలు, ("చట్టబద్ధమైన నియమాలు" లేదా "నియమాలు" కలిపి) మీరు రిజిస్టర్ చేయబడిన యూజర్ లేదా సందర్శకులా అనే విషయంతో సంబంధం లేకుండా ప్లాట్ ఫాంను యాక్సస్ చేయడం మరియు ఉపయోగించడాన్ని నియంత్రిస్తాయి. (అనగా మీరు మొబైల్ లేదా కంప్యూటర్ వంటి ఇతర డివైజ్ లు ద్వారా, లేదా వేరొక విధంగా ప్లాట్ ఫాంను పరిమితి లేకుండా , రిజిస్టర్ అవకుండానే బ్రౌజ్ చేయవచ్చని అర్థం).

మీరు చదువుతున్న ఈ ఒప్పందం ("నియమాలు") యొక్క నియమాలు సమాచారం సాంకేతికత చట్టం 2000 నియమాలకు అనుగుణంగా ప్రచురించబడి సమాచారం సాంకేతికత (రీజనబుల్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ మరియు ప్రొసీజర్స్ మరియు సెన్సిటివ్ పర్శనల్ డేటా లేదా ఇన్ఫర్మేషన్) నియమాలు, 2011 మరియు సమాచారం సాంకేతికత (ఇంటర్మీడియేటరి గైడ్ లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021తో సహా తత్సంబంధిత నియమాలతో పాటు చదవబడుతుంది మరియు ఏవైనా సవరణలు సంబంధాన్ని నియంత్రిస్తే మీకు మరియు మాకు మధ్య ఒప్పందంగా ఉంటాయి మరియు మీరు ప్లాట్ ఫాం మరియు మా సంబంధిత వెబ్ సైట్స్, సర్వీసెస్, అప్లికేషన్స్, ఉత్పత్తులు మరియు కంటెంట్ (ఉమ్మడిగా, "సర్వీసెస్") ను మీరు యాక్సెస్ చేసి, ఉపయోగించవచ్చని నిబంధనలో చెప్పబడ్డాయి.

మీరు కంటెంట్ ను చూడటానికి ప్లాట్ ఫాంను యాక్సెస్ చేయడం లేదా డౌన్ లోడింగ్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు ఈ నియమాలకు కట్టుబడి ఉన్నారు.

1. సాధారణం

  1. జోష్ అనేది మీరు కంటెంట్ ను చూడటానికి, తయారు చేయడానికి మరియు అందచేయడానికి అనుమతించే ఒక విలక్షణమైన మొబైల్ మరియు డెస్క్ టాప్ అప్లికేషన్ లేదా సాఫ్ట్ వేర్ టెక్నాలజీ. (“కంటెంట్”)
  2. ఈ ఒప్పందం లక్ష్యానికి గాను వెర్సే కి చేసే ఏదైనా సూచనలో దీని అనుబంధ సంస్థలు, మాతృ సంస్థ, సోదరి సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా భాగంగా ఉన్నాయి.
  3. "మీరు", "మీ యొక్క", "యూజర్" మరియు "యూజర్స్" సందర్భం ప్రకారం చదవాలి మరియు మిమ్మల్ని సూచిస్తాయి.
  4. ఈ సేవా నియమాలు, గోప్యతా విధానం , కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలు మరియు ఇతర వర్తించే అన్ని చట్టాలు మరియు నిబంధనలు, మీరు రిజిస్టర్ చేయబడిన యూజర్ లేదా సందర్శకులా అనే విషయంతో సంబంధం లేకుండా ప్లాట్ ఫాంను యాక్సస్ చేయడం మరియు ఉపయోగించడాన్ని నియంత్రిస్తాయి. (అనగా మీరు మొబైల్ లేదా కంప్యూటర్ వంటి ఇతర డివైజ్ లు ద్వారా , లేదా వేరొక విధంగా ప్లాట్ ఫాంను పరిమితి లేకుండా, రిజిస్టర్ కాకుండానే బ్రౌజ్ చేయవచ్చని అర్థం).
  5. వెర్సే దీని ద్వారా కంప్యూటర్, మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, పోర్టబుల్ ఇంటర్నెట్ డివైజ్ లు లేదా భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఏవైనా ఇతర టెక్నాలజీ /మోడ్స్ /మీడియాలలో ప్లాట్ ఫాంను యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించడానికి ప్రత్యేకం కాని, బదిలీ చేయబడలేని మరియు పరిమితమైన లైసెన్స్ ను మీకు ఇచ్చింది.
  6. ప్లాట్ ఫాంను యాక్సెస్ చేయడం మరియు /లేదా ఉపయోగించడం ద్వారా మరియు /లేదా ప్లాట్ ఫాం పై ("అకౌంట్") యూజర్ ప్రొఫైల్ అకౌంట్ ను తయారు చేయడం ద్వారా, ఈ చట్టబద్ధమైన నియమాలు యొక్క ఈ నియమాలను మీరు చదివారని, ఆమోదించారని, అమలు చేసారని మరియు కట్టుబడి ఉన్నారని భావించబడుతుంది.

2. నిర్వచనాలు

  1. "గోప్యతా సమాచారం" అనగా ప్రక్రియలు, పద్ధతులు, వ్యవస్థలు, వ్యాపార సమాచారం, సాంకేతికత సమాచారం మరియు సేల్స్ సమాచారం, క్లైంట్ సమాచారం సహా అయితే దానికి మాత్రమే పరిమితం కాని సమాచారం అని అర్థం. దీనిని వెర్సే గోప్యతగా భావిస్తుంది, మరియు యూజర్ కు ఏ విధంగానైనా తెలిసినా కూడా గోప్యతా సమాచారంగా భావిస్తుంది.
  2. "మేథో సంపత్తి" అనగా ఏదైనా కనుగొనడం, తయారు చేయడం, పని, అల్ గోరిథమ్, సోర్స్ కోడ్, ఆబ్జెక్ట్ కోడ్ లేదా ఇతర కోడ్, డిజైన్, గోప్యతా సమాచారం, ఉత్పత్తి మరియు మొదలైన సేకరించబడినవి, లేదా సేకరించబడే ప్రక్రియలో ఉన్నవి లేదా పేటెంట్ గా సేకరించబడగల సామర్థ్యాన్ని కలిగినవి, కాపీరైట్, ట్రేడ్ మార్క్, వ్యాపార రహస్యం, లేదా మేథో సంపత్తికి సంబంధించిన ఏదైనా ఇతర రకాన్ని సూచిస్తుంది.
  3. "కంటెంట్" అనగా వీడియోలు, చిత్రాలు, వ్యాఖ్యానాలు మరియు ప్రకటనలు సహా అయితే వీటికి పరిమితం కాని ప్రదర్శించబడిన ఏవైనా మరియు అన్నీ మెటీరియల్/పనులు.

3. నియమాలు ఆమోదించడం ">3.1 నియమాలు ఆమోదించడం

  1. సర్వీస్ కోసం రిజిస్టర్ చేయడం ద్వారా మరియు /లేదా ఏ విధంగానైనా ఉపయోగించడం ద్వారా, ప్లాట్ ఫాంను డౌన్ లోడింగ్ , ఇన్ స్టాలింగ్, సందర్శించడానికి లేదా బ్రౌజింగ్ చేయడం సహా కానీ వీటికి మాత్రమే పరిమితం కాకుండా, ఇక్కడ ఉన్న వర్సే ద్వారా ప్లాట్ ఫాం పై ఎప్పటికప్పుడు ప్రచురించబడే అన్ని నియమాలు, షరతులను మరియు అన్ని ఇతర నిర్వహణ నియమాలు, పాలసీలు మరియు ప్రక్రియలను మీరు అంగీకరించారు, దీనిలో ప్రతిది సూచించడం ద్వారా చేర్చబడుతుంది మరియు ఈ క్రింది క్లాజ్ 22 "నియమాల సవరణ"  క్రింద ఉన్న నియమాలకు అనుగుణంగా మీకు తెలియచేయకుండానే ఎప్పటికప్పుడు వర్సే ప్రతి ఒక్కటి నవీకరిస్తుంది.
  2. సంస్థ, కంపెనీ లేదా ప్రభుత్వ విభాగం విషయంలో, మీరు మీ కంపెనీ లేదా సంస్థకు చట్టబద్ధంగా కట్టుబడి ఉండటానికి మీకు అధికారం ఉందని మీరు ప్రాతినిధ్యంవహించి మరియు హామీ ఇస్తున్నారు మరియు మీ కంపెనీ లేదా సంస్థ ఈ నియమాలు యొక్క బాధ్యతలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. 'మీకు' లేదా 'మీ యొక్క'కు ఇక్కడ ఉన్న అన్ని మరియు ఏవైనా సూచనలలో మీ కంపెనీ లేదా సంస్థ కూడా కలిపి ఉన్నాయి.
  3. ఈ ఒప్పందం ప్లాట్ ఫాం పై కంటెంట్, సమాచారం, ఇతర మెటీరియల్స్ లేదా సర్వీసెస్ ను అందించే యూజర్స్ మరియు ప్లాట్ ఫాం యొక్క యూజర్స్ అందరికీ, ప్లాట్ ఫాం, యొక్క వ్యక్తిగత యూజర్స్, ప్లాట్ ఫాంను యాక్సెస్ చేసే వేదికలు, ప్లాట్ ఫాం పై పేజీ కలిగిన యూజర్స్ సహా, అయితే వారికి మాత్రమే పరిమితం కాకుండా వర్తిస్తుంది.
  4. అదనంగా, ప్లాట్ ఫాం ద్వారా అందించబడిన కొన్ని సర్వీసెస్ వర్సే ఎప్పటికప్పుడు నిర్దేశించిన విధంగా అదనపు నియమాలు, షరతులకు లోబడి ఉండవచ్చు; అలాంటి సర్వీస్ లను మీరు ఉపయోగించడం ఈ సూచన ద్వారా ఈ ఒప్పందంలోకి చేర్చబడిన ఆ అదనపు నియమాలు మరు షరతులకు లోబడి ఉంటుంది.

3.2 అర్హత

  1. ప్లాట్ ఫాంను ఉపయోగించడం మరియు యాక్సెస్ చేయడం అనేది ఒప్పందానికి చట్టబద్ధంగా కట్టుబడిన వ్యక్తులు అందరికీ మరియు భారతీయ ఒప్పందం చట్టం, 1872 క్రింద అనర్హత కలిగి లేని లేదా అసమర్థంగా ప్రకటించబడని అందరికీ అందుబాటులో ఉంటుంది. మీరు మైనర్ అయితే, అనగా., 18 ఏళ్ల లోపు వ్యక్తి అయితే, మీరు ప్లాట్ ఫాం యూజర్ గా నమోదు చేయరాదు మరియు ప్లాట్ ఫాంను యాక్సెస్ చేయరాదు లేదా ఉపయోగించరాదు. ఒక మైనర్ గా మీరు ప్లాట్ ఫాంను ఉపయోగించి లేదా యాక్సెస్ చేయాలని కోరుకుంటే, అలాంటి యాక్సెస్ లేదా వాడకం మీ చట్టబద్ధమైన సంరక్షకులు లేదా తల్లితండ్రులు ద్వారా చేయబడుతుంది.
  2. మీరు 18 ఏళ్ల లోపు వ్యక్తి అని వర్సే గుర్తించినా లేదా వర్సే దృష్టికి వచ్చినా అలాంటి వాడకాన్ని రద్దు చేయడానికి మరియు /లేదా ప్లాట్ ఫాంను యాక్సెస్ చేయడాన్ని తిరస్కరించడానికి వర్సేకు హక్కు ఉంది.
  3. మా నియమాలు లేదా పాలసీలు లేదా స్టాండర్డ్స్ ఉల్లంఘన కోసం మీ అకౌంట్ ఇంతకు ముందు ఆపుచేయబడలేదు; మరియు
  4. మీరు ఈ నియమాలు మరియు వర్తించే అన్ని దేశీయ మరియు అంతర్జాతీయ చట్టాలు మరియు నిబంధలను మీరు అనుసరిస్తారు.

4. మీ అకౌంట్, యూజర్ సమాచారం మరియు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ యూజర్ ఛార్జీలు

4.1 మీ అకౌంట్ ">మీ అకౌంట్ ద్వారా జరుగుతున్న కార్యకలాపానికి మీరు మాత్రమే బాధ్యులని మీరు అంగీకరించారు. దయచేసి మీ అకౌంట్ పాస్ వర్డ్ ను గోప్యంగా ఉంచండి మరియు కేవలం వ్యక్తిగత లక్ష్యాలు కోసం మాత్రమే అలాంటి అకౌంట్ ను ఉపయోగించాలి.

ఈ నియమాలలో ఉన్న ఏ నిబంధనలతోనైనా మీరు అనుసరించడంలో విఫలమైతే లేదా మీ అకౌంట్ లో సంభవించే కార్యకలాపాలు, మా నిర్ణయాధికారం మేరకు, సర్వీసెస్ కు హాని కలగచేయవచ్చని లేదా కలగచేస్తాయని లేదా బలహీనపరుస్తాయని లేదా ఏ మూడవ పక్షం యొక్క హక్కులను ఉల్లంఘిస్తాయని లేదా అతిక్రమిస్తాయని లేదా వర్తించే చట్టాలు లేదా నిబంధలను ఉల్లంఘిస్తాయని మేము భావించినట్లయితే ఏ సమయంలోనైనా మీ యూజర్ అకౌంట్ ను ఆరంభమవకుండా చేయడానికి, మరియు మీరు అందచేసిన లేదా అప్ లోడ్ చేసిన ఏ కంటెంట్ నైనా తొలగించడానికి లేదా ఆరంభమవకుండా చేయడానికి మాకు హక్కు ఉంది. అలాంటి అప్పీలుతో మీ నమ్మకమైన, స్పష్టమైన మరియు చెల్లుబాటయ్యే కారణంతో grievance.officer@myjosh.in పై మమ్మల్ని సంప్రదించండి.

4.2 పెయిడ్ సబ్ స్క్రిప్షన్ : ఈ మరియు ఇతర సరైన నియమాలు మరియు షరతులు యొక్క యూజర్ ఆమోదం ఆధారంగా మేము కొన్ని ఆప్షనల్ సబ్ స్క్రిప్షన్ సేవలను అందించవచ్చు. యూజర్ ఆమోదం మేరకు, యూజర్ ద్వారా ఎంపిక చేయబడిన నిర్దేశిత ఆప్షనల్ సర్వీస్ ఆధారంగా మేము సబ్ స్క్రిప్రషన్ మరియు /లేదా సభ్యత్వ ఫీజును ఛార్జీ చేసే హక్కు కలిగి ఉన్నాము. మీరు సబ్ స్క్రిప్షన్ ను కొనుగోలు చేసినప్పుడు, మీరు మాకు సంపూర్ణమైన మరియు ఖచ్చితమైన చెల్లింపును మరియు పేమెంట్ గేట్ వే ప్రొవైడర్ /పేమెంట్ సిస్టం ప్రాసెసర్ ద్వారా కావలసిన ఇతర సమాచారం మాకు కేటాయించాలి. చెల్లింపు వివరాలు సమర్పించడం ద్వారా, ఆ చెల్లింపులు వివరాలను ఉపయోగించడం ద్వారా సబ్ స్క్రిప్షన్ ను కొనుగోలు చేయడానికి మీరు అర్హత కలిగి ఉన్నారని మీరు వాగ్ధానం చేసారు. మేము చెల్లింపు గురించి ధృవీకరణను అందుకోకపోతే లేదా ఏదైనా ధృవీకరణను రద్దు చేసినట్లయితే, ప్లాట్ ఫాం పై మీ సబ్ స్క్రిప్షన్-ఆధారిత సర్వీస్ కు మీ యాక్సెస్ ను వెంటనే రద్దు చేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు. సబ్ స్క్రిప్షన్ -ఆధారిత సర్వీసెస్ కోసం మరియు జోష్ జెమ్స్ రివార్డ్స్ ప్రోగ్రాం కోసం యూజర్స్ నుండి చెల్లింపు అందుకోవడానికి మేము మూడవ పక్షానికి చెందిన చెల్లింపు గేట్ వే మరియు పేమెంట్ సిస్టం ప్రొవైడర్స్ సర్వీసెస్ ను ను ఉపయోగిస్తాము.

5. జోష్ జెమ్స్ మరియు రివార్డ్స్

ప్రోగ్రాంను పొందడానికి జోష్ రివార్డ్ ప్రోగ్రాం (ద "ప్రోగ్రాం") ను జోష్ ("ప్లాట్ ఫాం") తన యూజర్స్ కోసం కేటాయిస్తుంది. ఈ నియమాలు యొక్క క్లాజ్ 3లో పేర్కొనబడిన విధంగా ప్లాట్ ఫాంతో అనుగుణంగా రిజిస్టర్ చేయబడి మరియు అర్హులైన సర్వీసెస్ యొక్క యూజర్స్ కోసం ఇది అందుబాటులో ఉంటుంది. 18 సంవత్సరాల లోపు యూజర్స్ కు  ఈ ప్రోగ్రాంను ఉపయోగించడానికి తప్పనిసరిగా తల్లితండ్రులు లేదా తమ చట్టబద్ధమైన సంరక్షకుల అనుమతి కావాలి.

జోష్ ప్లాట్ ఫాంను క్రమం తప్పకుండా మరియు నిరంతరంగా ఉపయోగించడానికి జోష్ తన యూజర్స్ కు వివిధ రూపాలలో లాయల్టీ పాయింట్స్ ను అందిస్తుంది. జోష్ ప్లాట్ ఫాం పై వివిధ చర్యలు /కార్యకలాపాలు నిర్వహించడానికి ఈ లాయల్టీ పాయింట్స్ కేటాయించబడతాయి. ఆమె/అతని ప్రొఫైల్ ను అనగా, కంటెంట్, స్నేహితులను సూచించడం మరియు జోష్ నిర్దేశించిన విధంగా ప్లాట్ ఫాం పై సమయం గడపటం వంటివి పూర్తి చేసిన ప్రతి యూజర్ లాయల్టీ పాయింట్స్ ("జోష్ జెమ్స్") సంపాదించవచ్చు. ప్లాట్ ఫాం పై నిర్వహించిన ప్రతి పనికి యూజర్స్ కు జోష్ జెమ్స్ జారీ చేయబడతాయి. జోష్ జెమ్స్ విలువ అనేది ప్రోగ్రాం యొక్క పాలసీలు ప్రకారం జోష్ జెమ్స్ విలువ మారుతున్న అంశాలు మరియు అనుకూలంగా సర్దుబాటు చేయదగిన అంశాలు పై ఆధారపడింది. జోష్ జెమ్ సరి క్రమం తప్పకుండా ప్లాట్ ఫాంను ఉపయోగించే వారి కోసం బహుకరించబడతాయి మరియు జోష్ జెమ్స్ ను కేవలం జోష్ ప్లాట్ ఫాం పై మాత్రమే కొనుగోలు చేయవచ్చు మరియు వర్తించే చట్టాలు ప్రకారం మూడవ పక్షం చెల్లింపుదారు ద్వారా ప్రాసెస్ చేయబడతాయి.

ఈ జోష్ జెమ్స్ రకాలలో ఏవైనా లేదా ఒక దానిని సేకరించే విధానాన్ని జోష్ తన స్వంత నిర్ణయాధికారం మేరకు యూజర్ కార్యకలాపాలకు సమానంగా అందుకున్న అలాంటి పాయింట్స్ సంఖ్య సహా మార్పు చేయడానికి హక్కును కలిగి ఉంది. ఆఫర్ అవసరాలను నెరవేర్చని లేదా ఆఫర్ ను దుర్వినియోగం చేయడం లేదా మోసం లేదా అనుమానస్పద లావాదేవీ /కార్యకలాపం లేదా ఏదైనా చట్టబద్ధమైన ఆవశ్యకత ద్వారా లేదా వర్తించే నియమాలు మరియు నిబంధనలు సహా అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా ఏదైనా ఇతర కారణం కోసం ఏ యూజర్ నైనా పాయింట్లు అందుకోకుండా అనర్హులను చేసే హక్కు జోష్ కు ఉంది. ఏ సమయంలోనైనా తన స్వంత నిర్ణయాధికారం మేరకు పాయింట్లు యొక్క కొత్త రూపాన్ని జారీ చేయడానికి లేదా మార్చడానికి లేదా కొనసాగించకుండా ఆపు చేయడానికి జోష్ కు హక్కు ఉంది. జోష్ జెమ్స్ కోసం ముగింపు సమయాన్ని జోష్ తన సొంత నిర్ణయాధికారం మేరకు నిర్దేశించవచ్చు.

జోష్ జెమ్స్

జోష్ జెమ్స్ ను ఎవరు సంపాదించవచ్చు మరియు కొనవచ్చు?

  • 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల మా సర్వీసెస్ యూజర్స్ అథీకృత చెల్లింపు విధానాలు ఉపయోగించి మరియు మా ద్వారా అథీకృతం చేయబడిన మరియు అందుబాటులో ఉన్న పేమెంట్ ప్రొవైడర్స్ ద్వారా మా నుండి వర్ట్యువల్ "జోష్ జెమ్స్" ("జెమ్స్") ను కొనవచ్చు.

ప్రోగ్రాంను ఎవరు పొందగలరు?

  • యూజర్స్, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు ప్రోగ్రాంను ఉపయోగించగలరు.
  • యూజర్స్ కు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే జోష్ జెమ్స్ మాత్రమే సంపాదించగలరు మరియు జెమ్స్ ను ఇతర యూజర్స్ కు బహుమతిగా ఇవ్వగలరు, జెమ్స్ ను ఆర్థికపరమైన విలువతో బహుమతిగా అందుకోగలరు, జెమ్స్ సంపాదించగలరు మరియు జెమ్స్ ఉపసంహరించగలరు.

మేము ఎప్పటికప్పుడు మా ప్లాట్ ఫాం పై మీకు ఈ క్రింది ఉత్పత్తులు మరియు ప్రోత్సాహకాలను లభింపచేయగలము.

జెమ్స్ సంపాదించడం మరియు కొనుగోలు చేయడం

  • జోష్ జెమ్స్ ధర కొనుగోలు చేసే చోట ప్రదర్శించబడుతుంది. జోష్ జెమ్స్ కోసం చేసే అన్ని చెల్లింపులు మరియు ఛార్జీలు పేమెంట్ అగ్రిగేషన్ సర్వీస్ ప్రొవైడర్ తో లభించే సంబంధిత చెల్లింపు పద్ధతులు మరియు ఆప్షన్స్ ద్వారా కొనుగోలు చేసే చోట నిర్దేశించిన విధంగా భారతదేశపు రూపాయలలో జోష్ జెమ్స్ లభిస్తాయి.
  • మీరు కొనుగోలు చేసిన ఏదైనా జోష్ జెమ్స్ చెల్లింపు కోసం మీరు బాధ్యులు. మీరు కొనుగోలు చేయడం పూర్తయిన తరువాత, మీ యూజర్ అకౌంట్ లో జోష్ జెమ్స్ క్రెడిట్ చేయబడతాయి మరియు వాపసు చేయవలసిందిగా చేసే అభ్యర్థన ఆమోదించబడదు.
  • మీరు మీ కొనుగోలుకు మార్పులు చేయాలని కోరుకుంటే, దయచేసి మమ్మల్ని ఈ క్రింది ఈమెయిల్ చిరునామాలో సంప్రదించండి. ఈ మార్పు సాధ్యమో కాదో మేము మీకు తెలియచేస్తాం. మార్పులు ధరలను మరియు మీ కొనుగోలు యొక్క ఇతర అంశాలు పై ప్రభావం చూపించవచ్చు. అయితే, మీరు జెమ్స్ కొనుగోలు చేస్తే, కొనుగోలు పూర్తియిన వెంటనే మేము మీకు జెమ్స్ ను సరఫరా చేస్తామని మీరు అంగీకరించారు మరియు గుర్తించారు , కాబట్టి, కొనుగోలు చేయడానికి ఒప్పందం నుండి ఉపసంహరించబడటానికి లేదా రద్దు చేసే మీ హక్కును ఈ సందర్భంలో కోల్పోతారు.

మీరు జెమ్స్ ను ఏ విధంగా ఉపయోగిస్తారు

  • వోచర్స్ /డిస్కౌంట్ కూపన్స్ కొనడానికి జెమ్స్ ను ఉపయోగించవచ్చు. జెమ్స్ నగదు, లేదా చట్టబద్ధమైన టెండర్, లేదా కరెన్సీ, ప్రాంతం, లేదా ఏదైనా రాజకీయ సంస్థకు, లేదా ఏదైనా ఇతర క్రెడిట్ రూపం కోసం ఎక్స్ ఛేంజ్ చేయరాదు.
  • జెమ్స్ ను కేవలం మా ప్లాట్ ఫాం పై మాత్రమే మరియు మా సర్వీసెస్ లో భాగంగా మాత్రమే ఉపయోగించాలి, మరియు మేము కేటాయించినవి మినహా ఇతర ప్రమోషన్స్, కూపన్స్, డిస్కౌంట్స్ లేదా ప్రత్యేకమైన ఆఫర్స్ తో కలిపి ఉపయోగించరాదు లేదా కలపబడలేవు.
  • రాతపూర్వకంగా మా ద్వారా స్పష్టంగా అనుమతించితే మినహా సర్వీసెస్ లేదా మూడవ పక్షం యొక్క ఏ ఇతర యూజర్ కు జెమ్స్ కేటాయించబడలేవు లేదా బదిలీ చేయబడవు. మా ద్వారా కాకుండా వేరొకరి ద్వారా జెమ్స్ విక్రయం, కేటాయింపు, బార్టర్ లేదా ఇతర విధాలుగా ఇవ్వడం, స్పష్టంగా నిషేధించబడింది.
  • సేకరించబడిన జెమ్స్ ఆస్తిగా రూపొందవు మరియు బదిలీ చేయబడలేవు: (ఏ) మరణించినప్పుడు; (బి) ఇంటి సంబంధాల విషయంలో భాగంగా; లేదా (సీ) వేరొక విధంగా చట్టం యొక్క చర్య ద్వారా.
  • మా నుండి స్పష్టంగా రాతపూర్వకమైన సమ్మతి లేకుండా ఏ జెమ్స్ నైనా కేటాయించితే, విక్రయించితే లేదా వేరొక విధంగా బదిలీ చేస్తే అవి చెల్లవు. ఈ నిబంధనను ఉల్లంఘించిన సర్వీసెస్ యొక్క ఏ యూజర్ అకౌంట్ నైనా మేము రద్దు చేస్తాము, ఆమె లేదా అతని అకౌంట్ నుండి జెమ్స్ జప్తు చేసుకుంటాము , మరియు /లేదా హానులు మరియు వ్యాజ్యం మరియు లావాదేవీ ఖర్చులు కోసం బాధ్యతకు గురి చేస్తాము.
  • ఏ కారణంగానైనా యూజర్ అకౌంట్ ను రద్దు చేసినప్పుడు యూజర్ యొక్క అన్ని జెమ్స్ ఆటోమేటిక్ గా ముగిసిపోతాయి.
  • మీరు ఈ పాలసీని ఉల్లంఘించారని , మీరు ఏదైనా వర్తించే చట్టం లేదా నిబంధనను లేదా చట్టబద్ధమైన, భద్రతా లేదా సాంకేతిక కారణాలు ఉల్లంఘించారని మేము తగిన విధంగా నమ్మినప్పుడు మరియు మాకు అలాంటి హక్కును ఉపయోగించడంలో మీ గురించి మాకు ఎలాంటి బాధ్యత లేనప్పుడు మాకు తగిన చెల్లుబాటయ్యే కారణం ఉన్న జెమ్స్ ను నిర్వహించడానికి, నియంత్రించడానికి, క్రమబద్ధం చేయడానికి, సవరించడానికి మరియు /లేదా నిర్మూలించడానికి మాకు హక్కు ఉందని మీరు అంగీకరించారు. మేము మా సర్వీసెస్ నుండి జెమ్స్ ను పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయిస్తే, మేము మీకు తగిన విధంగా నోటీసు జారీ చేయడం ద్వారా ఆ విధంగా చేస్తాము.
  • లభిస్తున్న కంటెంట్ కు సంబంధించి, వేరొక యూజర్ ("కంటెంట్ ప్రొవైడర్") అప్ లోడ్ చేసిన లేదా స్ట్రీమ్ చేసిన యూజర్ కంటెంట్ యొక్క ఒక అంశాన్ని మీరు రేట్ చేయడానికి లేదా మీరు ప్రశంసించడానికి మీరు జెమ్స్ ను ఉపయోగించచ్చు.
  • ఈ పనితీరు సర్వీసెస్ పై లభించినప్పుడు, సంబంధిత యూజర్ కంటెంట్ క్రింద "గివ్ జెమ్స్" బటన్ పై క్లిక్ చేసి మీరు జెమ్స్ ను యూజర్ కంటెంట్ కు ఇవ్వవచ్చు.
  • మీరు యూజర్ కంటెంట్ యొక్క ఒక అంశానికి మీరు జెమ్స్ ను ఇచ్చినప్పుడు, ఈ జెమ్స్ మీ అకౌంట్ నుండి తొలగించబడతాయి మరియు కంటెంట్ ప్రొవైడర్ అకౌంట్ లో కంటెండ్ ప్రొవైడర్ జెమ్స్ లోకి మార్చబడతాయి.
  • మీరు జెమ్స్ ను వేరొక యూజర్ కు ఇచ్చినప్పుడు మీరు బహిరంగంగా ఆ విధంగా చేస్తారు. అందువలన సర్వీసెస్ యొక్క (జెమ్స్ అందుకున్న వ్యక్తి సహా) ఇతర యూజర్స్ మీ పేరు, యూజర్ ఐడీ మరియు మీరు ఇచ్చిన జెమ్స్ వివరాలను చూడగలరని దయచేసి గమనించండి.
  • యూజర్ కొనుగోలు చేసిన జోష్ జెమ్స్ పై వాపసు ఇవ్వబడదు లేదా మీ నుండి  ఛార్జీ చేసినది తిరిగి ఇవ్వడానికి అనుమతించబడదు.

కూపన్స్

కూపన్స్ ఎవరు కొనుగోలు చేయగలరు?

  • 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల మా సర్వీసెస్ యూజర్స్ మా అథీకృత వెండర్స్ నుండి డిస్కౌంట్ కూపన్స్ కోసం జెమ్స్ ను ఎక్స్ ఛేంజ్ చేయడం ద్వారా కూపన్స్ ("కూపన్స్") కొనుగోలు చేయవచ్చు.

కూపన్స్ కొనుగోలు చేయడం

  • ప్రచురించబడిన ధరలలో మీ యొక్క వర్తించబడే చట్టాలు క్రింద అవసరమైన పన్నులు సహా ప్రచురించబడిన ధరలు. ఏవైనా కూపన్స్ సరుకులు మరియు సేవా పన్ను ("జీఎస్టీ") కు లోబడి ఉంటే మరియు మీరు వెండర్ కు వర్తించబడే జీఎస్టీ చెల్లించకపోతే, సంబంధిత పన్ను సంస్థకు మీరు అలాంటి జీఎస్టీ మరియు ఏవైనా సంబంధిత జరిమానాలు లేదా వడ్డీ చెల్లింపు కోసం బాధ్యతవహిస్తారు.
  • ఏ సాధారణమైన మరియు ప్రత్యేకమైన సందర్భంలోనైనా మా స్వంత నిర్ణయాధికారం మేరకు తగిన విధంగా ఉందని భావించినప్పుడు అలాంటి ఎక్స్ ఛేంజ్ రేట్ ను నిర్వహించడానికి, నియంత్రించడానికి, సవరించడానికి మరియు /లేదా నిర్మూలించడానికి మాకు పూర్తి అధికారం ఉందని, మరియు అలాంటి మా హక్కును అమలు చేసే ఆధారంగా మాకు మీ గురించి ఎలాంటి బాధ్యత లేదని మీరు అంగీకరించారు.
  • మీ కూపన్స్ కొనుగోళ్లకు సంబంధించి మార్పులు చేయాలని మీరు కోరుకుంటే, కూపన్స్ కోడ్స్ ఇచ్చే కంపెనీ పాలసీ వర్తిస్తుంది.
  • ఈ నియమాల్లో వేరొక విధంగా ఏర్పాటు చేస్తే మినహా, కూపన్స్ యొక్క అన్ని విక్రయాలు అంతిమం, మరియు కొనుగోలు చేసిన ఏవైనా కూపన్స్ కోసం మేము రిఫండ్స్ అందచేయము. మీర కూపన్స్ కోసం జెమ్స్ ను ఎక్స్ ఛేంజ్ చేసినప్పుడు, అలాంటి జెమ్స్ మీ యూజర్ అకౌంట్ నుండి తీసివేయబడతాయి మరియు కూపన్స్ తో క్రెడిట్ చేయబడతాయి.
  • కూపన్స్ నగదు కోసం లేజా జెమ్స్ కోసం మార్చబడవు లేదా ఎక్స్ ఛేంజ్ చేయబడవు, లేదా రిఫండ్ చేయబడవు లేదా ఏ కారణంగానా మాచే తిరిగి చెల్లించబడవు.
  • ఏ యూజర్ యైనా కూపన్స్ అందుకున్నప్పుడు లేదా ఎక్స్ ఛేంజ్ చేసినప్పుడు అవి ఆస్థిగా రూపొందవు మరియు బదిలీ చేయబడవు: (ఏ) మరణించినప్పుడు; (బి) ఇంటి సంబంధాల విషయంలో భాగంగా; లేదా (సీ) లేకపోతే చట్టం యొక్క ఆపరేషన్ ద్వారా.
  • యూజర్ అందుకున్న లేదా ఎక్స్ ఛేంజ్ చేసిన కూపన్స్ అనధికారమని లేదా వేరొకవిధంగా హాని చెందాయని మేము మా స్వంత నిర్ణయాధికారం ప్రకారం నిర్ణయిస్తే, ఇంతకు ముందు ఎక్స్ ఛేంజ్ చేయబడిన కూపన్స్ కాపీలను మార్చవచ్చు.
  • యూజర్ ఈ నియమాలను ఉల్లంఘించినట్లుగా లేదా ప్రోగ్రాంను దుర్వినియోగిస్తున్నట్లుగా భావించినట్లయితే అకౌంట్ ను మేము రద్దు చేయడానికి లేదా సరైన చర్య తీసుకోవడానికి మాకు హక్కు ఉంది.

జెమ్స్ ఉపసంహరణ

  • ఏ సమయంలోనైనా, కంటెంట్ ప్రొవైడర్/యూజర్ ఆమె /అతను తమ అకౌంట్ ను తనిఖీ చేయడం ద్వారా వాస్తవిక సమయంలో ఆమె/అతను ఎన్ని జెమ్స్ సేకరించారో చూడవచ్చు.
  • తమ యూజర్ అకౌంట్ లో సంబంధిత ఆప్షన్స్ ను ఎంచుకోవడం ద్వారా కంటెంట్ ప్రొవైడర్/యూజర్ ఆర్థికపరమైన నష్టపరిహారం కోసం ( ఇండియన్ నేషనల్ రుపీలో) ఎక్స్ ఛేంజ్ లో జెమ్స్ విత్ డ్రా ఎంచుకోవచ్చు. వర్తించే ఆర్థికపరమైన నష్టపరిహారం అనేది యూజర్ సేకరించిన జెమ్స్ సంఖ్య సహా వివిధ అంశాలు ఆధారంగా మాచే లెక్కించబడతాయి.
  • జెమ్స్ విత్ డ్రాల్ అనేది ఈ క్రింది నియమాలకు లోబడి ఉంది మరియు అలాంటి విత్ డ్రాల్ చేసే సమయంలో మీకు కేటాయించిన విత్ డ్రాల్ ఆదేశాలలో కేటాయించబడిన ఏదైనా అదనపు సమాచారంలో విత్ డ్రాల్ మొత్తాలు పై వర్తించే రోజూవారీ పరిమితులు కూడా కలిపి ఉన్నాయి: విత్ డ్రాల్ రేట్ అనేది విత్ డ్రాల్ పాయింట్ వద్ద ప్రదర్శించబడుతుంది .
  • మీరు ఈ నియమాలను ఉల్లంఘించారని , మీరు ఏదైనా వర్తించే చట్టం లేదా నిబంధనను లేదా చట్టబద్ధమైన, భద్రతా లేదా సాంకేతిక కారణాలు ఉల్లంఘించారని మేము తగిన విధంగా నమ్మినప్పుడు మరియు మాకు అలాంటి హక్కును ఉపయోగించడంలో మీ గురించి మాకు ఎలాంటి బాధ్యత లేదని మాకు తగిన చెల్లుబాటయ్యే కారణం ఉన్న అలాంటి విత్ డ్రాల్ ఫీచర్ ను నిర్వహించడానికి, నియంత్రించడానికి, క్రమబద్ధం చేయడానికి, సవరించడానికి మరియు /లేదా నిర్మూలించడానికి మాకు హక్కు ఉందని మీరు అంగీకరించారు.
  • వర్తించే క్యాష్ చెల్లింపు మీ నామినేట్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ కు /యూపీఐ ఐడీ లేదా ఇతర మూడవ పక్షం చెల్లింపు ఛానెల్ అకౌంట్ కు నేరుగా చేయబడుతుంది (వర్తించేటట్లయితే).
  • మీ మొదటి మరియు చివరి పేరు మీ బ్యాంక్ ఖాతాతో ఖచ్చితంగా సరిపోవాలి మరియు అది ధృవీకరించబడవలసిన అవసరం ఉంది. మీరు మీ ఖాతా సమాచారం సరిగ్గా అందచేయడాన్ని నిర్థారించడం మీ బాధ్యత. మీరు అందచేసిన మీ బ్యాంక్ అకౌంట్/యూపీఐ ఐడీ సమాచారం వివరాలు తప్పుగా ఉండటం వలన కలిగిన ఏవైనా నష్టాలకు మీరే బాధ్యతవహించాలి. మీ అకౌంట్ లో కనిపించిన మొదటి మరియు చివరి పేర్లకు వేరుగా కనిపించిన ఈమెయిల్ అడ్రస్ తో నిర్దేశించిన బ్యాంక్ అకౌంట్/యూపీఐ ఐడీకి మరియు ధృవీకరించబడని అకౌంట్ కు చెల్లింపు పంపించబడదు; మేము మా స్వంత నిర్ణయాధికారం మేరకు , మీ గుర్తింపును ధృవీకరించడానికి సమాచారం కేటాయించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థించవచ్చు ( మీ మొదటి మరియు చివరి పేరు మరియు మీ రాష్ట్రం ఐడీ నంబర్ సహా).
  • చెల్లింపు చేయడానికి ముందు నో యువర్ కస్టమర్ గా మీ యొక్క గుర్తింపు, వయస్సు ( మీ రాష్ట్రం ఐడీ కార్డ్ ఫోటోకాపీ, లేదా మేము కోరిన విధంగా ఇతర ప్రూఫ్ అభ్యర్థించడం ద్వారా) మరియు అర్హత ప్రమాణాలను గురించి డాక్యుమెంట్స్ ను మా సంతృప్తి మేరకు ధృవీకరించే హక్కు మాకు ఉంది.
  • సకాలంలో అన్ని విత్ డ్రాల్ అభ్యర్థనలను నెరవేర్చే లక్ష్యాన్ని మేము కలిగి ఉన్నప్పటికీ, నిర్దేశిత సమయం ( విత్ డ్రాల్ సమయంలో ఏర్పాటు చేసిన అంచనా వేయబడిన సమయాలు సహా) లోగా నెరవేరడానికి మేము హామీ ఇవ్వము మరియు అలాంటి సమయంలో విత్ డ్రాల్ అభ్యర్థనను నెరవేర్చడంలో విఫలమైనప్పుడు మీకు లేదా ఏ మూడవ పక్షానికి మేము బాధ్యతవహించము.
  • ఈ చెల్లింపులు పై వర్తించే చట్టాలు ద్వారా విధించబడిన ఏవైనా పన్నులకు మీరు లోబడి ఉంటే, సంబంధిత పన్ను సంస్థకు అలాంటి పన్నులు చెల్లించడానికి ( ఏవైనా సంబంధిత జరిమానాలు లేదా వడ్డీ) మీరు బాధ్యతవహిస్తారు. వర్తించే చట్టం ద్వారా మేము ఆ విధంగా చేయవలసిన అవసరముందని మేము నిర్ణయిస్తే అలాంటి చెల్లింపు చేయడానికి ముందు ఏవైనా వర్తించ చట్టాలను మేము మినహాయించే హక్కును కలిగి ఉన్నాము. పన్నులకు సంబంధించి మీ నుండి ధృవీకరణలను అభ్యర్థించడానికి మరియు మీకు చెల్లించిన మరియు /లేదా మీకు చెల్లింపులు నుండి నిలిపి వేయబడిన మొత్తాలను పన్ను అధికారులకు నివేదించే హక్కు కూడా మాకు ఉంది.
  • మీరు ఈ నియమాలను ఉల్లంఘించితే మీ అకౌంట్ నుండి జెమ్స్ తీసివేసే హక్కు మాకు ఉంది.
  • మేము ఏ సమయంలోనైనా జెమ్స్ ప్రోత్సాహకాన్ని రద్దు చేయవచ్చు. మేము జెమ్స్ ప్రోత్సాహకాన్ని రద్దు చేస్తే, మీ బ్యాంక్ ఖాతా /యూపీఐ ఐడీకి మీ జెమ్స్ విలువను మీరు బదిలీ చేసే సామర్థ్యాన్ని కలిగించడానికి మీకు ముందుగా తెలియచేయడానికి మేము తగిన ప్రయత్నాలు చేస్తాము. మాకు తగిన కారణం ఉన్న చోట (అనగా మీరు ఈ నియమాలను ఉల్లంఘించారని, వర్తించే చట్టం లేదా నిబంధనను ఉల్లంఘించారని లేదా చట్టబద్ధమైన , భధ్రత లేదా సాంకేతిక కారణాలను ఉల్లంఘించారని మేము సహేతుకంగా నమ్మినప్పుడు), మేము తెలియచేయకుండానే జెమ్స్ ఆపరేషన్ ప్రోత్సాహకాన్ని రద్దు చేయవచ్చు. ఏ సందర్భంలోనైనా, ఈ నియమాలలో ఏర్పాటు చేసిన వ్యవస్థను ఉపయోగిస్తూ క్యాష్ గా మార్చబడని ప్రోత్సాహకం యొక్క రద్దు తేదీకి ముందు సేకరించబడిన జెమ్స్ సంబంధంలో మీకు ఆర్థిక నష్టపరిహారానికి గాను హక్కు లేదా అర్హత లేదు.

6. జోష్ పై క్రియేటర్ కు బహుమానం

జోష్ పై మీరు క్రియేటర్ నుండి కంటెంట్ ను ఆనందిస్తుంటే, వారి ప్రొఫైల్ కు మీరు ఆర్థికపరమైన బహుమానం పంపించవచ్చు. క్రియేటర్ బహుమానం 100% అందుకుంటారు (మా పేమెంట్ ప్రొవైడర్, ఫీజు వర్చించవచ్చు). జోష్ మీ బహుమానం మొత్తం స్వీకరించదు.

6.1 జోష్ పై ఎవరు బహుమానాలు ఇవ్వవచ్చు

జోష్ పై బహుమానం ఇవ్వడానికి:

  • మీరు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
  • బహుమానాలు మీరు ఉండే ప్రదేశంలో లభించాలి (ఈ ఫీచర్ ప్రతి చోట ప్రస్తుతం లభించడం లేదు).
  • వ్యాపార ఖాతాలు పాల్గొనడానికి అనర్హమైనవి.

బహుమానాల నిబంధనలు

ఎంత మరియు మీరు ఎంత తరచుగా బహుమానం ఇవ్వవచ్చు అంశం పై కొన్ని పరిమితులు ఉన్నాయి.

  • మీరు ప్రతి రోజూ, కొంత మొత్తాన్ని మాత్రమే బహుమానంగా ఇవ్వవచ్చు, మరియు మీరు బహుమానంగా ఇవ్వడానికి ఒక గరిష్ట మొత్తం ఉంది. ఇది వర్తించ చట్టాలకు అనుగుణంగా వర్తిస్తుంది.

మా బహుమానాల సేవా నియమాలలో బహుమానాలు పై మరిన్ని నిబంధనలు గురించి మరింత తెలుసుకోండి.

జోష్ పై బహుమానం ఏ విధంగా ఇవ్వాలి

1.మీ జోష్ యాప్ లో, మీరు బహుమానం ఇవ్వాలని కోరుకున్న క్రియేటర్ ప్రొఫైల్ కు వెళ్లండి.

2. వారి ప్రొఫైల్ లో, టిప్స్ పై ట్యాప్ చేయండి. వారి ప్రొఫైల్ లో మీరు బహుమానాలు చూడకపోతే, ఈ సమయంలో వారు బహుమానాలు అందుకోలేరు.

3. సెండ్ ఏ టిప్ పై ట్యాప్ చేయండి. మీరు నిర్దేశిత బహుమానం మొత్తం ఎంచుకోవచ్చు, లేదా అనుకూలమైన బహుమానం మొత్తం చేర్చవచ్చు, తరువాత నెక్ట్స్ పై ట్యాప్ చేయండి. ( భాగస్వామి ఫీజు వర్తించవచ్చు అని దృష్టిలో పెట్టుకోండి.)

4. మీ చెల్లింపు పద్ధతి ఎంచుకోండి మరియు కన్ఫర్మ్ పేమెంట్ పై ట్యాప్ చేయండి.

మీరు ఇంతకు ముందు చెల్లింపు పద్ధతిని ఏర్పాటు చేయకపోతే, మీ జోష్ ఖాతాకు మీరు చెల్లింపు కార్డ్ ను చేర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతారు.

6.2 జోష్ పై బహుమానం స్వీకరించడం

జోష్ పై క్రియేటర్ గా, మీ ప్రేక్షకులు మీ జోష్ ప్రొఫైల్ ద్వారా నేరుగా మీకు బహుమానాలు పంపించగలరు. మీకు చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి మేము మూడవ పక్షానికి చెందిన పేమెంట్ ప్రొవైడర్ తో భాగస్వామం చెందాము.

గమనిక : మీరు బహుమానం మొత్తం 100% ఉంచుకోవచ్చు (పేమెంట్ భాగస్వామి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన తరువాత).

6.2.1 జోష్ పై ఎవరు బహుమానం స్వీకరించవచ్చు

జోష్ పై బహుమానాలు స్వీకరించడానికి అర్హులవడానికి, మీకు ఈ క్రింది ఆవశ్యకతలు ఉన్నట్లయితే మీరు దరఖాస్తు చేయవచ్చు :

  • మీరు 18 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
  • మీ అకౌంట్ మంచి స్థానంలో ఉండాలి మరియు కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలు మరియు సేవా నియమాలకు అనుగుణంగా ఉండాలి.
  • మీకు వ్యక్తిగత అకౌంట్ ఉండాలి. వ్యాపార ఖాతాలు ఉన్న వారు పాల్గొనడానికి అర్హులు కారు. గమనిక: మీరు దరఖాస్తు చేసినప్పుడు మీరు అర్హులు కారని గుర్తిస్తే, మీరు ముఫ్పై (30) రోజులు తరువాత పునః దరఖాస్తు చేయవచ్చు. మీ అకౌంట్ అర్హత ప్రమాణాన్ని ఉల్లంఘిస్తే, మీరు బహుమానాలు అందుకోవడం నుండి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించబడతారు.

6.2.2 జోష్ పై బహుమానాలు అందుకోవడానికి ఏ విదంగా దరఖాస్తు చేయాలి

బహుమానాలు అందుకోవడానికి దరఖాస్తు చేయడానికి:

1. జోష్ యాప్ లో, అడుగు భాగంలో ప్రొఫైల్ ట్యాప్ చేయండి.

2. ఎగువ భాగంలో మెనూ బటన్ ట్యాప్ చేయండి.

3.క్రియేటర్ టూల్స్ ట్యాప్ చేయండి, తరువాత బహుమానాలు ట్యాప్ చేయండి.

4.అప్లై పై ట్యాప్ చేయండి.

5. ఆన్-స్క్రీన్ ఆదేశాలు అనుసరించండి. మీరు అకౌంట్ ఏర్పాటు చేయకపోతే, మీరు వారి చెల్లింపు భాగస్వామి చెక్అవుట్ పేజీకి తీసుకువెళ్లబడతారు. గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు:

  • మీరు అందుకున్న వెంటనే మీ డాష్ బోర్డ్ పై మీ బహుమానాలు మీరు చూడగలుగుతారు కానీ మీ డాష్ బోర్డ్ లో కనిపించడానికి ఇరవై నాలుగు గంటలు (24) సమయం తీసుకుంటుంది.
  • మీ బహుమానాలను చెల్లింపు భాగస్వామి ప్రాసెస్ చేసిన తరువాత, అవి వారం ప్రాతిపదికన మీ బ్యాంక్ ఖాతాలోకి ఆటోమేటిక్ గా డిపాజిట్ చేయబడతాయి. చెల్లింపు భాగస్వామి ద్వారా మీరు మీ బ్యాంక్ ఖాతాను అప్ డేట్ చేయవచ్చు.

7. మా యాజమాన్యం మరియు హక్కులు

7.1 ప్లాట్ ఫాంలో అన్ని హక్కులు, ప్రయోజనాలు మరియు శీర్షికలను వెర్సే నిలిపి ఉంచుతుంది మరియు ఈ ఒప్పందం కేవలం మీరు ప్లాట్ ఫాంను వినియోగించడానికి మాత్రమే లైసెన్స్ ఇస్తుంది మరియు ఈ ఒప్పందం యొక్క నియమాలు, షరతులకు లోబడి ఉంటారని మీరు అంగీకరిస్తున్నారు, బాధ్యతవహిస్తున్నారు మరియు నిర్ధారిస్తున్నారు. ఈ ఒప్పందం ఏదైనా యాజమాన్యం ఆస్తిని వెర్సే మీకు బదిలీ చేయబడటానికి పరిగణించబడదని మరియు ఆస్తిలోని అన్ని హక్కులు, శీర్షికలు మరియు ప్రయోజనాలు వెర్సేతో కొనసాగుతాయని మీరు నిర్ధారిస్తున్నారు.

7.2. మీరు వ్యక్తిగతంగా ఆనందించడానికి, స్వీయ వ్యక్తీకరణకు మరియు బహిరంగంగా వెల్లడించే అవకాశానికి వెర్సే మీకు ప్లాట్ ఫాం లైసెన్స్ ను ఉచితంగా కేటాయించింది. ప్లాట్ ఫాం లైసెన్స్ ను మీకు మంజూరు చేసినందుకు, వెర్సే ఆదాయాలు ఉత్పన్నం చేయవచ్చని, స్నేహం పెంచవచ్చని మీరు అంగీకరించారు మరియు గుర్తించారు లేదా లేకుంటే మీరు ప్లాట్ ఫాం వినియోగించడం నుండి మరియు దానికి సంబంధించి ఏదైనా యూజర్ కంటెంట్ ను మీరు అప్ లోడ్ చేయడం ద్వారా తన విలువ పెంచవచ్చని, ఉదాహరణ ద్వారా, సహా, అయితే దానికి మాత్రమే పరిమితం కాకుండా, ఏదైనా ఇతర మీడియా మరియు వినియోగం డేటా పై ప్రకటన, స్పాన్సర్ షిప్స్, ప్రోత్సాహాలు, కంటెంట్ మార్కెటింగ్ మరియు ప్లాట్ ఫాం ప్రోత్సాహక భాగస్వామాలు సహా మార్కెటింగ్ విక్రయం ద్వారా మరియు ఏదైనా అలాంటి ఆదాయం, స్నేహం లేదా ఏదైనా విలువలో తెలియచేసే హక్కు మీకు లేదు. మీరు ప్లాట్ ఫాం పై అప్ లోడ్ చేసిన ఏదైనా యూజర్ కంటెంట్ నుండి, లేదా వర్సే ద్వారా మరియు /లేదా ఇక్కడ వర్ణించిన విధంగా ఇతర యూజర్స్ ద్వారా వాడకం నుండి ఆదాయం లేదా ఏదైనా ఇతర పరిగణను స్వీకరించే హక్కు మీకు లేదని కూడా గుర్తించారు, మరియు మీరు (i) ప్లాట్ ఫాంలో మీరు లేదా ఎవరైనా ఇతర యూజర్ అప్ లోడ్ చేసిన ఏదైనా యూజర్ కంటెంట్ లేదా (ii) మీరు ప్లాట్ ఫాం ద్వారా మూడవ పక్షం సేవలో అప్ లోడ్ చేయబడిన యూజర్ కంటెంట్ నుండైనా ఆదాయం సంపాదించడానికి లేదా పరిగణనలోకి తీసుకోవడానికి ఎలాంటి హక్కులు ఉపయోగించకుండా మీరు నిషేధించబడ్డారు (ఉదా. మీరు ఆదాయం సంపాదించడం కోసం ప్లాట్ ఫాం ద్వారా సృష్టించిన మరియు ఇతర చిన్న వీడియో అప్లికేషన్స్ లోకి అప్ లోడ్ చేయబడిన ఏదైనా యూజీసీని క్లెయిమ్ చేయలేరు.)

8. మీ లైసెన్స్ మరియు ప్లాట్ ఫాం /సేవలు వినియోగం

8.1. నియమాలకు లోబడి ప్లాట్ ఫాంను వ్యక్తిగత మరియు వాణిజ్యేతర వాడకంగా చేయడానికి వెర్సే మీకు కేవలం పరిమితమైన, బదిలీ చేయబడలేని, ప్రత్యేకం కాని, వాపసు తీసుకోబడలేని లైసెన్స్ ను మాత్రమే మంజూరు చేస్తుంది.

8.2.ప్లాట్ ఫాం ద్వారా వెర్సే అందించే సేవలకు యూజర్ ముందుగా రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంది. సేవలను పొందడానికి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా మీరు అకౌంట్ ను సృష్టించవలసిన అవసరం ఉంది. అలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా, వర్తించే రిజిస్ట్రేషన్ పత్రం ప్రేరేపించిన విధంగా అలాంటి వివరాలకు సంబంధించిన సరైన, పూర్తి మరియు ఖచ్చితమైన సమాచారాన్ని మీరు మాకు కేటాయించాలి. మీరు విలక్షణమైన పాస్ వర్డ్ మరియు యూజర్ నేమ్ కూడా ఎంచుకోవలసిన అవసరం ఉంది, పేర్కొనబడిన సేవలు పొందాలని మీరు కోరుకున్న ప్రతిసారీ మీరు నమోదు చేయాలి. నెట్ వర్క్ లో బహుళ యూజర్స్ ద్వారా సింగిల్ అకౌంట్ మరియు పాస్ వర్డ్ ద్వారా ప్లాట్ ఫాంను యాక్సెస్ చేయడానికి మీకు అర్హత లేదు మరియు మీరు సమన్వయం చేయలేరు. ప్రాక్సీ సర్వర్స్ లో ప్లాట్ ఫాం యొక్క ఏదైనా భాగం క్యాష్డ్ అవడానికి మేము అనుమతి ఇవ్వమని మీరు అంగీకరించారు మరియు అర్థం చేసుకున్నారు. మీ పాస్ వర్డ్ మరియు అకౌంట్ గోప్యతను నిర్వహించడానికి మీరే పూర్తిగా బాధ్యులు. మీ అకౌంట్ ద్వారా జరిగిన కార్యకలాపానికి మీరు మాత్రమే బాధ్యులని (మాకు మరియు ఇతరులకు)మీరు అంగీకరించారు. అకౌంట్ ను సృష్టించేటప్పుడు, మీరు మీ గురించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి మరియు వ్యక్తిగత లక్ష్యాలు కోసం కేవలం ఒక అకౌంట్ సృష్టించాలి.

8.3 మీరు మీ అకౌంట్ సమాచారం మరియు పాస్ వర్డ్ ను ఇతరులకు చెప్పరాదు లేదా ఎవరిదైనా అకౌంట్ ఉపయోగించరాదు. మీ అకౌంట్ ద్వారా జరిగే అన్ని మరియు ఏవైనా కార్యకలాపాలు మీరే బాధ్యులు. మీ అకౌంట్ ను ఎవరైనా అనధికారంగా ఉపయోగిస్తే లేదా ఏదైనా ఇతర భద్రత ఉల్లంఘించబడితే మాకు వెంటనే తెలియచేయడానికి మీరు అంగీకరించారు. అలాంటి ఘటన జరిగినప్పుడు, మీరు మీ అకౌంట్ తిరిగి పొందడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాం; అయితే, మీ అకౌంట్ పునరుద్ధరించబడుతుందని లేదా అక్కడ ఉన్న కంటెంట్ స్వాధీనం చేసుకోబడుతుందని మేము హామీ ఇవ్వలేము. మీ పాస్ వర్డ్ లేదా అకౌంట్ ను అనధికారంగా ఉపయోగించడం వలన కలిగిన ఏదైనా నష్టానికి మేము బాధ్యతవహించము. అయితే, మీ అకౌంట్ లేదా పాస్ వర్డ్ ను ఎవరైనా ఉపయోగించడం వలన కంపెనీ లేదా వేరొక పక్షం నష్టాలను భరిస్తే మీరే అందుకు బాధ్యతవహించాలి.

8.4. ఫేస్ బుక్ ద్వారా రిజిస్ట్రేషన్: మీ ఫేస్ బుక్ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ("ఫేస్ బుక్ కనక్ట్")ను ఉపయోగించి మీరు సేవలు కోసం రిజిస్టర్ చేయవచ్చు. అయితే, మీరు 18 ఏళ్ల లోపు వ్యక్తి అయితే, మీరు ఫేస్ బుక్ కనక్ట్ ను ఉపయోగించి సేవలకు లాగ్ ఇన్ కావచ్చు మరియు మీ చట్టబద్ధమైన సంరక్షకుడు లేదా మీ తల్లితండ్రి పర్యవేక్షణలో మాత్రమే సేవలను వినియోగించాలి. ఫేస్ బుక్ కనక్ట్ ను వినియోగించడం వలన మీ వ్యక్తిగత సమాచారం, ప్రొఫైల్, లైక్స్ మరియు ఇతర సంబంధిత సమాచారం ఆధారంగా సేవలను ఉపయోగిస్తూ మీ అనుభవాన్ని పెంచడానికి మరియు వ్యక్తిగతం చేయడానికి మాకు అనుమతి ఇస్తుంది. మీరు ఈ ఫీచర్ ను ఉపయోగించేటప్పుడు, సేవలు పై మీ కార్యకలాపం గురించి సమాచారానికి మీరు స్పష్టంగా సమ్మతి తెలియచేసారు. మీ అకౌంట్ /గోప్యతా సెట్టింగ్స్ ను మార్చడం ద్వారా ఫేస్ బుక్ కనక్ట్ ను ద్వారా సమాచారం తెలియచేయబడటం మీరు నియంత్రించవచ్చు. ఈ ఫీచర్ ఉపయోగించడం మరియు మీ ఫేస్ బుక్ అకౌంట్ నిబంధనలకు సంబంధించి ఏవైనా అనుసరణలకు మీరు మాత్రమే బాధ్యులు. ఫేస్ బుక్ ద్వారా రిజిస్టరింగ్ చేయడం ద్వారా, ఇక్కడ చెప్పిన నియమాలకు మరియు ప్లాట్ ఫాం యొక్క సక్రమమైన ప్రదేశంలో పోస్ట్ చేయబడే ఏవైనా ఇతర నిర్దేశిత నియమాలకు అదనంగా మీరు అంగీకరించారు. ప్రతి రిజిస్ట్రేషన్ కేవలం  ఒక వ్యక్తిగత యూజర్ కోసం మాత్రమే.

8.5.సర్వీసెస్ పొందడానికి మరియు ఉపయోగించడానికి ఈ నియమాలు మరియు వర్తించే చట్టాలు మరియు నిబంధనలు లోబడి ఉన్నాయి. మీరు ఇలా చేయలేరు:

  • ఈ నియమాలను అంగీకరించడానికి మీరు పూర్తిగా సామర్థ్యాన్ని కలిగి లేకపోతే మరియు చట్టబద్ధంగా సమర్థవంతులు కాకపోతే మీరు సర్వీసెస్ యాక్సెస్ చేయలేరు లేదా ఉపయోగించలేరు;
  • మీరు మా సర్వీసెస్ ను లేదా ఉపయోగించే సమయంలో ఏదైనా చట్టవిరుద్ధమైన, తప్పుదోవకు దారితీసే, వివక్ష కలిగి ఉంటే లేదా ఏదైనా మోసపూరితమైన కార్యకలాపాన్ని నిర్వహించకూడదు.
  • మీరు సర్వీసెస్ లేదా ఏవైనా ఫైల్స్, టేబుల్స్ లేదా డాక్యుమెంటేషన్ (అక్కడ ఉన్న ఏదైనా భాగం) సహా అక్కడ చేర్చబడిన ఏదైనా కంటెంట్ యొక్క అనధికార కాపీలను సవరించడం, అనుసరించడం, అనువదించడం , రివర్స్ ఇంజనీర్ చేయడం, విడదీయడం, డీకంపైల్ చేయడం లేదా సర్వీసెస్ నుండి ఏవైనా పనులను తయారు చేయరాదు లేదా ఏదైనా సోర్స్ కోడ్, అల్ గోరిథమ్స్ , పద్ధతులు లేదా సర్వీసెస్ లేదా ఏవైనా ఉత్పన్నమైన పనులు ద్వారా చేర్చబడిన టెక్నికులను నిర్ణయించరాదు లేదా నిర్ణయించడానికి ప్రయత్నించరాదు;
  • ఏవైనా సర్వీసెస్ లేదా ఏవైనా వాటి ఉత్పన్నమైన పనులను పూర్తిగా లేదా సగం భాగం పంపిణీ చేయరాదు, లైసెన్స్ కు ఇవ్వరాదు, బదిలీ చేయరాదు , లేదా విక్రయించరాదు;
  • ఫీజు లేదా ఛార్జీ కోసం మీరు సర్వీసెస్ ను మార్కెట్ చేయరాదు, అద్దెకు ఇవ్వరాదు లేదా లీజుకు ఇవ్వరాదు, లేదా ప్రకటన కోసం లేదా ఏదైనా వాణిజ్యపరమైన అభ్యర్థన కోసం సర్వీసెస్ ను ఉపయోగించరాదు;

  • మా నుండి రాతపూర్వకంగా స్పష్టమైన సమ్మతి లేకుండా ఏదైనా వాణిజ్యపరమైన ప్రకటనను సమన్వయం చేయడానికి లేదా తెలియచేయడం లేదా అభ్యర్థన లేదా స్పామింగ్ సహా ఏదైనా వాణిజ్యపరమైన లేదా అనధికార లక్ష్యం కోసం సర్వీసెస్ ను ఉపయోగించలేరు;
  • మీరు సర్వీసెస్ యొక్క సక్రమమైన పనితో జోక్యం లేదా జోక్యం చేసుకోవడాన్ని ప్రయత్నించడం, మా వెబ్ సైట్ కు లేదా సర్వీసెస్ తో కనక్ట్ చేయబడిన ఏవైనా నెట్ వర్క్స్ కు అంతరాయం కలిగించడం లేదా సర్వీసెస్ ను పొందడాన్ని నివారించడానికి లేదా ఆంక్ష విధించడానికి మేము ఉపయోగించే ఏవైనా చర్యలను ఉల్లంఘించడం చేయరాదు;
  • సర్వీసెస్ లేదా దానికి సంబంధించిన ఏదైనా భాగాన్ని ఏదైనా ఇతర కార్యక్రమంలోకి లేదా ఉత్పత్తిలోకి చేర్చలేరు. అలాంటి సందర్భంలో, మా స్వంత నిర్ణయాధికారం మేరకు మేము సర్వీస్‌ను తిరస్కరించి, అకౌంట్స్ ను రద్దు చేసి లేదా సర్వీసెస్ కు యాక్సెస్ ను పరిమితం చేసే హక్కును కలిగి ఉంటాము;
  • సర్వీసెస్ నుండి సమాచారం సేకరించడానికి స్వయంచాలిత స్క్రిప్ట్స్ ఉపయోగించలేరు లేదా లేకుంటా సర్వీసెస్ తో పరస్పర చర్యల జరపలేరు;
  • ఏదైనా సంస్థ లేదా వ్యక్తిగా నటించలేరు, లేదా తప్పుగా చెప్పలేరు లేదా లేకుంటే మీరు అప్ లోడ్ చేసిన, పోస్ట్ చేసిన, ప్రసారం చేసిన, పంపిణీ చేసిన లేదా లేకుంటే సర్వీసెస్ నుండి అందుబాటులోకి వచ్చేలా చేయడంసహా ఏ వ్యక్తితోనైనా లేదా సంస్థతోనైనా మిమ్మల్ని లేదా మీ సంబంధం గురించి తప్పుడు ప్రాతినిధ్యం ఇవ్వలేరు .
  • వేరొకరిని బెదిరించలేరు లేదా వేధించలేరు, లేదా లైంగికపరమైన మెటీరియల్ , హింసను ప్రోత్సహించలేరులేదా జాతి, లింగం, మతం, జాతీయత, అంగవైకల్యం, లైంగిక దృక్పథం లేదా వయస్సు ఆధారంగా వివక్ష చూపించలేరు;
  • ఇతర యూజర్స్ తో ట్రేడింగ్ సమీక్షలులేదా నకిలీ సమీక్షలు రాయడం లేదా అభ్యర్థించడం వంటి సర్వీసెస్ లక్ష్యాలను అణగదొక్కడం లేదా ప్రయోజనాలకు వివాదం కలిగించే విధానంలో మీరు సర్వీసెస్ ను ఉపయోగించలేరు;
  • అప్ లోడ్ చేయడానికి, ప్రసారం, పంపిణీ చేయడానికి, భద్రపరచడానికి సర్వీసెస్ ను ఉపయోగించలేరు లేదా లేకుంటే ఏదో విధంగా లభించేలా చేయలేరు:
  • వైరస్ లు, ట్రోజన్స్, వర్మ్స్, లాజిక్ బాంబ్స్ లేదా మోసపూరితమైన లేదా సాంకేతికపరంగా హానికరమైన ఇతర మెటీరియల్ ఉన్న ఫైల్స్ ను ఉపయోగించలేరు;
  • అభ్యర్థించని లేదా అనధికార ప్రకటన, అభ్యర్థనలు, ప్రోత్సాహక మెటీరియల్స్, "జంక్ మెయిల్స్", "స్పామ్", "చెయిన్ లేఖలు", " పిరమిడ్ స్కీంస్", లేదా ఏదైనా ఇతర నిషేధిత అభ్యర్థన రూపాన్ని మీరు ఉపయోగించలేరు.
  • చిరునామాలు, ఫోన్ నంబర్స్, ఈమెయిల అడ్రస్ లు, వ్యక్తిగత గుర్తింపు పత్రంలో నంబర్ మరియు ఫీచర్ (ఉదా., జాతీయ బీమా నంబర్స్, పాస్ పోర్ట్ నంబర్స్) లేదా క్రెడిట్ కార్డ్ నంబర్స్ సహా మూడవ పక్షానికి చెందిన ఏదైనా వ్యక్తిగత సమాచారం ఉపయోగించలేరు;
  • ఏదైనా కాపీరైట్, ట్రేడ్ మార్క్ ను ఉల్లంఘించే ఏదైనా మెటీరియల్ లేదా ఉల్లంఘించిన మెటీరియల్ లేదా ఇతర మేథో సంపత్తి లేదా ఏ ఇతర వ్యక్తి యొక్క గోప్యతా హక్కులను ఉపయోగించలేరు;
  • ఏ వ్యక్తి యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే మెటీరియల్, అశ్లీలమైన, నేరపూరితమైన, నీలి చిత్రాలు, ద్వేషం లేదా దూషణకు సంబంధించిన మెటీరియల్ ఉపయోగించలేరు;
  • క్రిమినల్ నేరం, ప్రమాదకరమైన కార్యకలాపాలు లేదా స్వీయ-హాని కోసం ఆదేశాలు ఇవ్వడం లేదా ప్రోత్సహించడం, ఏర్పాటు చేసే ఏ మెటీరియల్ ను కూడా ఉపయోగించలేరు;
  • ప్రజలను రెచ్చగొట్టి లేదా వ్యతిరేకించడానికి ప్రత్యేకించి బెదిరించడం మరియు హేళన చేయడం కోసం ఉద్దేశ్యపూర్వకంగా రూపొందించబడిన మెటీరియల్ , లేదా హాని కలిగించడానికి, బాధపెట్టడానికి, భయపెట్టడానికి, విపత్తు కలిగించడానికి, సిగ్గుపడేలా చేయడానికి లేదా ప్రజలకు నిరాశ కలిగించడానికి ఉద్దేశించబడిన మెటీరియల్ ఉపయోగించలేరు;
  • శారీరక హింస బెదిరింపులు సహా ఏ రకమైన బెదిరింపునైనా కలిగిన మెటీరియల్ ను ఉపయోగించలేరు;
  • ఎవరిదైనా జాతి, మతం, వయస్సు, లింగం, అంగవైకల్యం లేదా లైంగికత్వం పై వివక్ష సహా వివక్ష కలిగిన లేదా జాత్యాహంకారం కలిగిన మెటీరియల్ ను ఉపయోగించలేరు;
  • అందించడానికి మీకు సక్రమంగా లైసెన్స్ చేయబడని లేదా లేకుంటే అర్హత లేని ఏవైనా జవాబులు, ప్రతిస్పందనలు, వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు, విశ్లేషణ లేదా సిఫారసులు ఉపయోగించలేరు; లేదా

8.6 జోష్ ద్వారా కంటెంట్ తొలగింపు /యూజర్ ప్రొఫైల్ పై నిషేధం విధించబడటం:

పైన చెప్పిన వాటికి అదనంగా, సర్వీసెస్ ను మీరు ఎల్లవేళలా ఉపయోగించడానికి మరియు పొందడానికి, మా కమ్యూనిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి.

ముందుగా తెలియచేయకుండానే, ఏ సమయంలోనైనా, ఏ కారణంగానైనా లేదా ఏ కారణం లేకుండా కూడా మా స్వంత నిర్ణయాధికారం మేరకు కంటెంట్ ను పొందనీయకుండా చేయడానికి లేదా యాక్సెస్ ను తొలగించడానికి మాకు హక్కు ఉంది. కంటెంట్ ను యాక్సెస్ చేయడం తొలగించడం లేదా పొందనీయకపోవడానికి గల కొన్ని కారణాలలో ఇవి ఉన్నాయి: కంటెంట్ అభ్యంతరకరంగా ఉండటం, ఈ నియమాలను ఉల్లంఘించేదిగా ఉండటం లేదా లేకుంటే సర్వీసెస్ కు లేదా మా యూజర్స్ కు హానికరంగా ఉండటం. వ్యక్తిగతంగా సంబంధించిన ప్రోడక్ట్ ఫీచర్స్ యైన అనుకూలమైన అన్వేషణా ఫలితాలు, అనుకూలమైన ప్రకటన మరియు స్పామ్ మరియు మాల్ వేర్ గుర్తించడం వంటివి మీకు కేటాయించడానికి మా ఆటోమేటెడ్ సిస్టమ్స్ మీ కంటెంట్ ను విశ్లేషిస్తాయి. కంటెంట్ పంపించబడినప్పుడు, అందుకున్నప్పుడు మరియు భద్రపరచబడినప్పుడు ఈ విశ్లేషణ సంభవిస్తుంది.

మా ప్లాట్ ఫాంను మీరు వినియోగించడాన్ని నియమాలు మరియు కమ్యూనిటీ మార్గదర్శకసూత్రాలు నియంత్రిస్తాయి. మా యూజర్స్ లో ఎవరైనా నియమాలు మరియు కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలను ఉల్లంఘించిన మీ కంటెంట్ గురించి నివేదిస్తే , అలాంటి కంటెంట్ ను మా ప్లాట్ ఫాం నుండి మేము తొలగించవచ్చు. నియమాలు మరియు కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలకు సంబంధించిన చేసిన బహుళ నివేదికలు సందర్భంలో మాతో మీ అకౌంట్ ను మేము బలవంతంగా రద్దు చేయవలసి ఉంది మరియు మాతో రిజిస్టర్ చేయకుండా బ్లాక్ చేయవలసి ఉంది. మీరు అలాంటి ఏదైనా తొలగింపు కోసం అప్పీలు చేసినట్లయితే, మీరు మాకు grievance.officer@myjosh.in పై రాయవచ్చు.

8.7 మీ డివైజెస్ పై మీరు ఇన్ స్టాల్ చేసిన తరువాత కూడా ప్లాట్ ఫాం కోసం మీకు లైసెన్స్ ఇవ్వబడింది కానీ విక్రయించబడలేదు. వర్సే ఈ లైసెన్స్ ఒప్పందాన్ని లేదా దానికి సంబంధించిన ఏదైనా భాగాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా కేటాయించవచ్చు. ఈ లైసెన్స్ ద్వారా ఏదైనా మూడవ పక్షానికి మీరు మీ హక్కులను కేటాయించలేరు, బదిలీ చేయలేరు లేదా ఉప-లైసెన్స్ గా ఇవ్వడానికి అనుమతించబడరు.

9. కంటెంట్ : మా కంటెంట్ ">9.1 సర్వీసెస్ యొక్క యూజర్స్ అప్ లోడ్ , పోస్ట్ లేదా ప్రసారం (అనగా స్ట్రీమ్ ద్వారా) చేయడానికి అనుమతించబడవచ్చు లేదా లేకుంటే సర్వీసెస్ ద్వారా, ఏదైనా టెక్ట్స్, ఫోటోగ్రాఫ్స్, యూజర్ వీడియోలు, సౌండ్ రికార్డింగ్స్ సహా , అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా మరియు మీ వ్యక్తిగత మ్యూజిక్ లైబ్రరీ నుండి స్థానికంగా భద్రపరచబడిన సౌండ్ రికార్డింగ్స్ ను చేర్చే వీడియోస్ మరియు పరిసర శబ్దాలు (ఉమ్మడిగా "యూజర్ కంటెంట్") సహా అక్కడ పొందుపరచబడిన మ్యూజికల్ వర్క్స్ కంటెంట్ అందుబాటులో ఉండవచ్చు. సర్వీసెస్ యొక్క యూజర్స్ ఒక యూజర్ కంటే ఎక్కువ యూజర్స్ తయారు చేసిన కలిపే మరియు విడదీసే యూజర్ కంటెంట్, ఇతర యూజర్స్ తో సహకార యూజర్ కంటెంట్ సహా, అదనపు యూజర్ కంటెంట్ ను ఉత్పన్నం చేయడానికి వేరొక యూజర్ ఉత్పన్నం చేసిన యూజర్ కంటెంట్ అంతా లేదా ఏదైనా భాగాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ యూజర్ కంటెంట్ పై సర్వీసెస్ ద్వారా కేటాయించబడిన సంగీతం, గ్రాఫిక్స్, స్టికర్స్ మరియు ఇతర అంశాలను సర్వీసెస్ యొక్క యూజర్స్ బదిలీ చేయవచ్చు మరియు సర్వీసెస్ ద్వారా యూజర్ కంటెంట్ ను ప్రసారం చేయవచ్చు. సర్వీసెస్ పై ఇతర యూజర్స్ వ్యక్తీకరించిన అభిప్రాయాలు మా విలువలు లేదా అభిప్రాయాలకు ప్రాతినిధ్యంవహించవు.

9.2 మీరు పోస్ట్ చేసిన, అప్ లోడ్ చేసిన, ప్రసారం చేసిన, అందచేసిన యూజర్ కంటెంట్ కోసం లేదా లేకుంటే సర్వీసెస్ సంబంధంలో లేదా ద్వారా అందచేసినందుకు మీరు యజమాని మరియు మీరే బాధ్యులని మీరు అర్థం చేసుకున్నారు. మమ్మల్ని లేదా ఎవరికైనా హాని కలిగించే ఏదైనా చర్య తీసుకోవడానికి, సర్వీసెస్ తో జోక్యం చేసుకోవడానికి, లేదా ఏదైనా వర్తించే చట్టాన్ని ఉల్లంఘించే విధానంలో మీరు సర్వీసెస్ ను ఉపయోగించరని  మీరు అంగీకరించారు. మాకు సమర్పించిన యూజర్ కంటెంట్ ఏ పేటెంట్, ట్రేడ్ మార్క్, వ్యాపార రహస్యం, కాపీరైట్ ను ఉల్లంఘించదని మీరు హామీ ఇచ్చారు, లేదా ఇతర మేథో సంపత్తి లేదా యాజమాన్య లేదా ఏదైనా మూడవ పక్షం లేదా వ్యక్తి యొక్క గోప్యతా హక్కును ఉల్లంఘించదని మరియు ఏదైనా అశ్లీలమైన లేదా నేరపూరితమైన మెటీరియల్ లేదని హామీ ఇచ్చారు. సర్వీసెస్ వినియోగించడానికి మరియు సర్వీసెస్ ను మీరు యాక్సెస్ చేసే షరతుగా, ఏవైనా మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించడానికి సర్వీసెస్ ను వినియోగించనని మీరు అంగీకరించారు. ఏ సమయంలోనైనా, నోటీసు ద్వారా లేదా నోటీసు లేకుండా, మా స్వంత నిర్ణయాధికారం మేరకు, ఏవైనా కాపీరైట్స్ లేదా ఇతర మేథో సంపత్తి హక్కులను ఉల్లంఘించిన యూజర్ లేదా ఉల్లంఘించారని ఆరోపించబడిన యూజర్ అకౌంట్స్ ను రద్దు చేయడానికి మరియు /లేదా యాక్సెస్ ను ఆపుచేయడానికి మాకు హక్కు ఉంది. మూడవ పక్షానికి చెందిన మేథో సంపత్తిని వినియోగించడానికి, మేథో సంపత్తి యజమాని నుండి మీరు నేరుగా అనుమతి పొందవలసిన అవసరం ఉంది.

9.3 ఏ యూజర్ కంటెట్ నైనా గోప్యత లేని మరియు యాజమాన్యం కానిదిగా భావించబడుతుంది. గోప్యతగా లేదా యాజమాన్యంగా మీరు భావించిన ఏదైనా యూజర్ కంటెంట్ ను సర్వీసెస్ పైన లేదా ద్వారా ను మీరు పోస్ట్ చేయరాదు లేదా మాకు ప్రసారం చేయరాదు. సర్వీసెస్ ద్వారా మీరు యూజర్ కంటెంట్ ను సమర్పించినప్పుడు, మీరు ఆ యూజర్ కంటెంట్ ను సొంతం చేసుకున్నారని మీరు అంగీకరించారు మరియు ప్రాతినిధ్యంవహించారు, లేదా మీరు కంటెంట్ లోని ఏదైనా భాగాన్ని సర్వీసెస్ కు సమర్పించడానికి, సర్వీసెస్ నుండి ఇతర మూడవ పక్షం ప్లాట్ ఫాంలకు ప్రసారం చేయడానికి మరియు /లేదా ఏదైనా మూడవ పక్షం కంటెంట్ ను స్వీకరించడానికి దాని యజమాని నుండి  కావలసిన అన్ని అనుమతుల క్లియరెన్స్ లను అందుకున్నారు లేదా అధికారం కలిగి ఉన్నారు.

9.4 సౌండ్ రికార్డింగ్ కు మరియు సౌండ్ రికార్డింగ్ లో మీరు కేవలం హక్కులు మాత్రమే కలిగి ఉంటే, దాగున్న అలాంటి సౌండ్ రికార్డింగ్స్ లో పొందుపరచబడిన మ్యూజికల్ వర్క్స్ కి లేకపోతే, సర్వీసెస్ కు సమర్పించే కంటెంట్ లో ఏదైనా భాగం యొక్క యజమాని ద్వారా అథీకృతం చేయబడిన లేదా నుండి క్లియరెన్స్, అన్ని అనుమతులు మీకు ఉన్నప్పుడు మినహా మీరు అలాంటి సౌండ్ రికార్డింగ్స్ ను పోస్ట్ చేయరాదు.

సర్వీస్ నుండి లేదా ద్వారా లభించే పొందుపరచబడిన మ్యూజికల్వర్క్స్ మరియు సౌండ్ రికార్డింగ్స్ కు సంబంధించి ఎటువంటి హక్కులు లైసెన్స్ చేయబడవు.

9.5 యూజర్ తయారు చేసిన కంటెంట్ యొక్క వాస్తవికత, సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు మేము మద్దతు, సహాయం , ప్రాతినిధ్యం లేదా హామీ ఇవ్వము లదా దానికి సంబంధించిన ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయము. సర్వీసెస్ ను ఉపయోగించడం ద్వారా, నేరపూరితమైన, హానికరమైన, ఖచ్చితంగా లేని లేదా లేకుంటే సక్రమంగా లేని కంటెంట్ కు లేదా కొన్ని సందర్భాలలో, తప్పుగా గుర్తించబడిన పోస్టింగ్స్ కు లేదా లేకుంటే మోసపూరితమైన వాటికి మీరు బహిర్గతం కావచ్చని మీరు అర్థం చేసుకున్నారు. అలాంటి కంటెంట్ ను తయారు చేసిన వ్యక్తే కంటెంట్ అంతటికీ బాధ్యతవహించాలి.

9.6 మీరు క్రిమినల్ నేరంగా రూపొందించబడే పౌర బాధ్యతను కలిగించే లేదా ఏదైనా చట్టాన్ని లేదా నిబంధనలను ఉల్లంఘించే లేదా ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా అనధికార ప్రయోజనం కోసం ప్లాట్ ఫాంను ఉపయోగించుకునే ఎలాంటి ప్రవర్తనను ప్రోత్సహించకూడదు, ప్రేరేపించకూడదు , పాల్గొనకూడదు లేదా అభ్యర్థించకూడదు.

9.7 మీ యూజర్ కంటెంట్ దేనినైనా ఆధారంగా మిమ్మల్ని గుర్తించడానికి మీ యూజర్ నేమ్, చిత్రం, స్వరం మరియు ఇష్టతను ఉపయోగించడానికి మాకు మీరు రాయల్టీ-రహితమైన లైసెన్స్ కు అనుమతి ఇచ్చారు.

9.8 నియమాలు, షరతులను ఆమోదించడం ద్వారా, మీరు మాకు కంటెంట్ ను అందించడానికి లేదా ఇతరులు అందించిన కంటెంట్ ను చూడటానికి అంగీకరించారు , మీరు మీ సొంత నిర్ణయాధికారం మరియు నష్టం మేరకు ఈ కంటెంట్ యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణతతో సహా ఆ విధంగా చేస్తున్నారు. మా నియమాలను ఉల్లంఘించే కంటెంట్ ను నిషేధించడానికి లేదా చర్య తీసుకోవడానికి వర్సే అన్ని హక్కులను కలిగి ఉంది.

9.9 ముందుగా తెలియచేయకుండానే, ఏ సమయంలోనైనా , ఏ కారణంగానైనా లేదా ఏ కారణం లేకుండా కూడా మా స్వంత నిర్ణయాధికారం మేరకు కంటెంట్ ను పొందనీయకుండా చేయడానికి లేదా యాక్సెస్ ను తొలగించడానికి మాకు హక్కు ఉంది. కంటెంట్ ను యాక్సెస్ చేయడం తొలగించడం లేదా పొందనీయకపోవడానికి గల కొన్ని కారణాలలో ఇవి ఉన్నాయి: కంటెంట్ అభ్యంతరకరంగా ఉండటం, ఈ నియమాలను లేదా మా కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలను ఉల్లంఘించేదిగా ఉండటం లేదా లేకుంటే సర్వీసెస్ కు లేదా మా యూజర్స్ కు హానికరంగా ఉండటం. వ్యక్తిగతంగా సంబంధించిన ప్రోడక్ట్ ఫీచర్స్ యైన అనుకూలమైన అన్వేషణా ఫలితాలు, అనుకూలమైన ప్రకటన మరియు స్పామ్ మరియు మాల్ వేర్ గుర్తించడం వంటివి మీకు కేటాయించడానికి మా ఆటోమేటెడ్ సిస్టమ్స్ మీ కంటెంట్ ను విశ్లేషిస్తాయి. కంటెంట్ పంపించబడినప్పుడు, అందుకున్నప్పుడు మరియు భద్రపరచబడినప్పుడు ఈ విశ్లేషణ సంభవిస్తుంది.

9.10 జోష్ లైవ్ ఫీచర్:

  1. ప్లాట్ ఫాం యూజర్స్ కోసం లైవ్ స్ట్రీమ్ ఆడియో మరియు /లేదా ఆడియో-విజువల్ కంటెంట్ ను ప్లాట్ ఫాం ద్వారా "వాస్తవిక సమయం" ఆధారంగా ("జోష్ లైవ్ కంటెంట్" లేదా "లైవ్ కంటెంట్") కేటాయిస్తుంది. కొన్ని సందర్భాలలో, "వాస్తవిక-సమయంలో" ప్లాట్ ఫాం ద్వారా మాత్రమే లైవ్ కంటెంట్ లభిస్తుంది, దీనిలో వాస్తవంగా లైవ్ స్ట్రీమ్ జరుగుతుంటుంది లేదా ప్లాట్ ఫాం పై లభించవచ్చు లేదా ఈ లైవ్ సెషన్ ను అనుసరించి ఇతర యూజర్స్ కు పరిమిత సమయం వరకు అందుబాటులో ఉండవచ్చు. వేరొక సందర్భాలలో, "వాస్తవిక-సమయంలో" ప్లాట్ ఫాం ద్వారా మాత్రమే లైవ్ కంటెంట్ లభిస్తుంది, దీనిలో వాస్తవంగా లైవ్ స్ట్రీమ్ జరుగుతుంటుంది, ఆరంభపు "వాస్తవిక-సమయం" లైవ్ స్ట్రీమ్ ( భద్రపరచబడిన మరియు రికార్డ్ చేయబడిన అలాంటి లైవ్ కంటెంట్ యొక్క వెర్షన్ గా) ను అనుసరించి లైవ్ కంటెంట్ ను తయారు చేసిన వర్తించే యూజర్ ప్లాట్ ఫాం నుండి దానిని తొలగించేంత వరకు అందుబాటులో ఉంటుంది. ప్లాట్ ఫాం పై "లైవ్-స్ట్రీమ్"/ కంటెంట్ అప్ లోడ్ చేసిన యూజర్స్ ఈ నియమాలు ప్రకారం అలాంటి కంటెంట్ కేటాయించడానికి మరియు పెర్ఫార్మెన్స్ కు సంబంధించి ఇతర యూజర్స్ తో ఏవైనా వివాదాలను పరిష్కరించడానికి మరియు /లేదా అలాంటి కంటెంట్ నాణ్యతకు మీరే పూర్తిగా బాధ్యతవహించాలి. సందేహాన్ని నివారించడానికి, ఇక్కడ పదజాలం నిర్వచించబడిన విధంగా లైవ్ కంటెంట్ "యూజర్ కంటెంట్" మరియు "యూజీసీ" గా భావించబడుతుంది . స్ట్రీమ్ చేసిన, అప్ లోడ్ చేసిన ప్రతి యూజర్ మరియు లేకుంటే ప్లాట్ ఫాం పై యూజర్స్ కు లైవ్ కంటెంట్ లభ్యమయ్యేలా చేసిన యూజర్ అలాంటి కంటెంట్ అనుమతించబడిన యూజర్ కంటెంట్ లైసెన్స్ కు , ఇక్కడ వర్తించే యూజర్ కంటెంట్ అన్ని ఇతర నియమాలు మరియు షరతులకు ( కమ్యూనిటీ మార్గదర్శకసూత్రాలు, మరియు అన్ని ఇతర ప్రాతినిధ్యాలు మరియు వారంటీలు సహా, అయితే దీనికి మాత్రమే లోబడకుండా) లోబడి ఉంటుందని అంగీకరించారు. చివరిగా, లైవ్ కంటెంట్ కు అదనపు ఫీచర్స్ మరియు విధులు (ఉదా అందచేయడం, వ్యాఖ్యానం చేయడం, పరస్పర చర్య ఫీచర్స్ మొదలైనవి ) ఉండవచ్చని మీరు గుర్తించారు మరియు అంగీకరించారు. ప్లాట్ ఫాం పై అప్ లోడ్ చేయబడిన ఇతర రకాల యూజర్ కంటెంట్ కోసం లభించే లైవ్ కంటెంట్ యొక్క కొన్ని విధులు మరియు ఫీచర్స్ ను కంపెనీ పరిమితం చేయవచ్చు.
  2. వర్తించే చట్టాలు, నియమాలు మరియు నిబంధలను అనుసరించడానికి మీరు అంగీకరించారు. లైవ్ కంటెంట్, ఆర్కైవ్డ్ కంటెంట్ ఏదైనా ఉంటే, వర్తించే విధంగా, మీరు ఈ నియమాలను ఆమోదించడంలో అనుసరణగా యూజర్ తయారు చేసిన కంటెంట్ గా రూపొందుతుంది. అన్ని ఆమోదాలు, పరిమితులు, లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ లేదా నోటిఫికేషన్ ఆవశ్యకతలు సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా మీరు అన్ని చట్టబద్ధమైన ఆవశ్యకతలకు సంతృప్తికరంగా ప్రాతినిధ్యంవహిస్తున్నారు మరియు హామీ ఇస్తున్నారు, మరియు లైవ్ కంటెంట్ ఉన్నంత వరకు అలాంటి లైసెన్స్ లు ( వర్తించేటట్లయితే ఏవైనా బ్రాడ్ కాస్ట్ లైసెన్స్ లు సహా), రిజిస్ట్రేషన్స్, సమ్మతులు, నోటిఫికేషన్స్ లేదా ఆమోదాలను నిర్వహిస్తారు.
  3. ఈ నియమాలు మీ యొక్క వాడకాన్ని నియంత్రిస్తాయి : (i) జోష్ కెమేరా ఫీచర్ లేదా యాప్ , మరియు ఏదైనా ఇతర సాధనాలు మరియు సాఫ్ట్ వేర్ ఈ ఒప్పందానికి లోబడి ఉన్న ఫైల్ లో గుర్తించబడినవి (ఉమ్మడిగా, "జోష్ కెమేరా సాఫ్ట్ వేర్"); మరియు (ii) జోష్ కెమేరా సాఫ్ట్ వేర్ కు సంబంధించిన కొన్ని డాక్యుమెంటేషన్స్, వీడియో ట్యుటోరియల్స్ మరియు ప్లాట్ ఫాం పై యూజర్ కు లభించే ఇతర సమాచారం, యాప్స్ సహా, లేదా నియమం యొక్క ఏదైనా ఇతర మార్గాలు ద్వారా (ఉమ్మడిగా "డాక్యుమెంటేషన్") లేదా లేకుంటే రాతపూర్వకంగా వర్సే నిర్దేశించిన విధంగా. వర్సే జోష్ కెమేరా సాఫ్ట్ వేర్ మరియు డాక్యుమెంటేషన్ ను (ఉమ్మడిగా, "జోష్ కెమేరా") డౌన్ లోడ్ ద్వారా లేదా వర్సే తన స్వంత నిర్ణయాధికారం మేరకు అందచేస్తుంది. మీరు డౌన్ లోడ్ చేసుకున్న, ఇన్ స్టాల్ చేసిన, యాక్సెస్ చేసిన,లేదా జోష్ కెమేరాను ఉపయోగిస్తున్న తేదీ నాటికి ఈ నియమాలు అమలులో ఉంటాయి ("అమలవుతున్న తేదీ").

10. మేథో సంపత్తి హక్కులు మరియు లైసెన్స్

10.1. కాపీ రైట్, ట్రేడ్ మార్క్, పేటెంట్ మరియు వ్యాపార రహస్యం మరియు మేథో సంపత్తిని వినియోగించడానికి సంబంధించి మీరు ప్లాట్ ఫాంను వినియోగించడం అనేది అన్ని వేళలా చట్టాలకు లోబడి ఉంటుంది , వాటి ద్వారా నియంత్రించబడుతుంది. కాపీ రైట్, ట్రేడ్ మార్క్, పేటెంట్ మరియు వ్యాపార రహస్యం యాజమాన్యం మరియు మేథో సంపత్తికి సంబంధించిన చట్టాలకు మీరు కట్టుబడి ఉండాలి మరయు మీ డివైజ్ ద్వారా మీరు ప్లాట్ ఫాంను వినియోగించడానికి కారణమైన ఏవైనా చట్టాల ఉల్లంఘనకు మరియు ఏవైనా మేథో సంపత్తి హక్కులు యొక్క ఏవైనా అతిక్రమణకు మీరే పూర్తి బాధ్యతవహించాలి. సర్వీసెస్ ను వినియోగించడానికి మరియు పొందడానికి ఒక షరతుగా, సర్వీసెస్ ను ఏవైనా మేథో సంపత్తి హక్కులను అతిక్రమించడానికి వినియోగించనని మీరు అంగీకరించారు. ఏ సమయంలోనైనా, నోటీసు ద్వారా లేదా నోటీసు లేకుండా, మా స్వంత నిర్ణయాధికారం మేరకు, ఏవైనా కాపీరైట్స్ లేదా ఇతర మేథో సంపత్తి హక్కులను ఉల్లంఘించిన యూజర్ లేదా ఉల్లంఘించారని ఆరోపించబడిన యూజర్ అకౌంట్స్ ను రద్దు చేయడానికి మరియు /లేదా యాక్సెస్ ను ఆపుచేయడానికి మాకు హక్కు ఉంది. మూడవ పక్షానికి చెందిన మేథో సంపత్తిని వినియోగించడానికి, మేథో సంపత్తి యజమాని నుండి మీరు నేరుగా అనుమతి పొందవలసిన అవసరం ఉంది.

10.2 మా ఐపీ: ప్లాట్ ఫాం యొక్క అన్ని ట్రేడ్ మార్క్స్, బ్రాండ్స్ మరియు సర్వీస్ చిహ్నాలు వెర్సే యొక్క ఆస్థి లేదా వెర్సేకు లైసెన్స్ గా ఇవ్వబడ్డాయి. ప్లాట్ ఫాంకి సంబంధించి వెర్సే అన్ని డేటా బేస్ లు మరియు కాపీరైట్స్ ను కలిగి ఉంది. ఈ వెబ్ సైట్ పై చేర్చబడిన కంటెంట్, వెర్సే నివేదికలు, టెక్ట్స్, గ్రాఫిక్స్, లోగోలు, ఐకాన్స్, మరియు చిత్రాలు సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా వెర్సే యొక్క మరియు అలాంటి ఆస్తిని వినియోగించడానికి వెర్సేకు హక్కు మరియు లైసెన్స్ ఇచ్చిన ఇతర సంబంధిత యజమానులు యొక్క ప్రత్యేకమైన ఆస్తి మరియు భారతదేశపు కాపీరైట్ చట్టాలు ద్వారా ఇవి కాపాడబడుతున్నాయి. అన్ని ట్రేడ్ మార్క్స్, సర్వీస్ చిహ్నాలు మరియు వ్యాపార పేర్లు పై వెర్సేకు మరియు అలాంటి చిహ్నాలను వినియోగించడానికి లైసెన్స్ మరియు హక్కును వెర్సేకు అనుమతి ఇచ్చిన ఇతర సంబంధిత యజమానులు యాజమాన్యం కలిగి ఉన్నారు. ప్లాట్ ఫాం మరియు ప్లాట్ ఫాం సంబంధంలో ఉపయోగించబడుతున్న సాఫ్ట్ వేర్ లేదా ఏదైనా అంతర్లీనంగా ఉన్న టెక్నాలజీలో వేర్సే యొక్క లేదా దాని వ్యాపార సంస్థలు, అనుబంధ సంస్థలు లేదా ఏదైనా మూడవ పక్షానికి చెందిన హక్కులు ఉండవచ్చు.  మీ డివైజెస్ పై మీరు ఇన్ స్టాల్ చేసిన తరువాత కూడా ప్లాట్ ఫాం కోసం మీకు లైసెన్స్ ఇవ్వబడింది కానీ విక్రయించబడలేదు. వర్సే ఈ లైసెన్స్ ఒప్పందాన్ని లేదా దానికి సంబంధించిన ఏదైనా భాగాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా కేటాయించవచ్చు. ఈ లైసెన్స్ ద్వారా ఏదైనా మూడవ పక్షానికి మీరు మీ హక్కులను కేటాయించలేరు, బదిలీ చేయలేరు లేదా ఉప-లైసెన్స్ గా ఇవ్వడానికి అనుమతించబడరు.

10.3 ప్రత్యేకంగా పేర్కొనబడని వెర్సే , వారి సంబంధిత యజమానులు కలిగి ఉన్న ఏదైనా మేథో సంపత్తి పై మీరు ఏవైనా ఉల్లంఘనలు, తప్పుడు ప్రాతినిధ్యం, అతిక్రమణలు చేసినట్లయితే మీపై సరైన చర్యలు తీసుకునే హక్కు ఉంది. మేథో సంపత్తి యొక్క యజమాని/ప్రత్యేకమైన లైసెన్స్ కలిగిన వారి నుండి ముందుగా రాతపూర్వకంగా సమ్మతి తీసుకోకుండా కాపీరైట్ వర్క్స్, ట్రేడ్ మార్క్స్, లేదా ఇతర యాజమాన్య సమాచారాన్ని మీరు డౌన్ లోడ్ చేయరాదు లేదా ఇతరులు డౌన్ లోడ్ చేయడానికి అనుమతించరాదు. అతిక్రమణ చేసిన సందర్భంలో వర్సే తన స్వంత నిర్ణయాధికారం మేరకు లేదా చట్టం కోరిన విధంగా దీనిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది.

10.4 మీరు అప్ లోడ్ చేసే, పోస్ట్ చేసే లేదా ప్రసారం చేసే ( స్ట్రీమ్ ద్వారా) లేదా లేకుంటే ఏదైనా టెక్ట్స్, ఫోటోగ్రాఫ్స్, వీడియోస్, సౌండ్ రికార్డింగ్స్ సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా సర్వీసెస్ ద్వారా కంటెంట్ లభించేలా చేసే మీ కంటెంట్ ను కలిగి ఉండటాన్ని మీరు కొనసాగిస్తారు మరియు కంటెంట్ కోసం మాకు లైసెన్స్ జారీ చేస్తారు. మీరు లేదా మీ యూజర్ కంటెంట్ యజమాని మాకు పంపించిన యూజర్ కంటెంట్ లో ఇప్పటికీ కాపీరైట్ కలిగి ఉంటారు కానీ సర్వీసెస్ ద్వారా యూజర్ కంటెంట్ ను సమర్పించడం ద్వారా, మీ యూజర్ కంటెంట్ ను ఏ రూపంలోనైనా మరియు ఏదైనా ప్లాట్ ఫాం పై చూడటానికి, యాక్సెస్ చేయడానికి, వినియోగించడానికి, డౌన్ లోడ్ చేయడానికి, అనుసరించడానికి, ప్రచురించడానికి మరియు /లేదా ప్రసారం చేయడానికి సర్వీసెస్ యొక్క ఇతర యూజర్స్ మరియు మూడవ పక్షాలు ఉపయోగించడానికి, అనుసరించడానికి, ప్రచురించడానికి మరియు /లేదా ప్రసారం చేయడానికి, మరియు /లేదా పంపిణీ చేయడానికి మరియు అధికారం ఇవ్వడానికి  మీరు మాకు బేషరతు, తిరిగి మార్చలేనటువంటి, ప్రత్యేకం కాని, రాయల్టీరహితమైన, పూర్తిగా బదిలీ చేయదగిన, నిరంతరమైన ప్రపంచవ్యాప్త లైసెన్స్ ను మీరు మాకు ఇస్తున్నారు.

10.5 కంటెంట్ ను యాక్సెస్ చేయడానికి, వ్యక్తిగతంగా ఉపయోగించడానికి మరియు కాపీలు చేయడానికి, పునరుత్పత్తి చేయడానికి, అనుసరించడానికి మరియు ఉత్పన్నమైన పనులు చేయడానికి, ప్రజలకు తెలియచేయడానికి, ప్రసారం చేయడానికి ప్లాట్ ఫాం పై మీ కంటెంట్ ను అందుబాటులో ఉంచడానికి మరియు మీరు అందించే కంటెంట్ ను అందుబాటులో ఉంచడానికి అపరిమితమైన లైసెన్స్ ను మీరు ఇక్కడ వర్సేకు ప్రపంచవ్యాప్త, రాయల్టీ-రహితమైన, శాశ్వతమైన, ప్రత్యేకం కాని, మార్చలేని, బదిలీ చేయలేని, కేటాయించదగిన, ఉప లైసెన్స్ గా ఇవ్వదగిన, హక్కు మరియు లైసెన్స్ ఇస్తున్నారు. ప్లాట్ ఫాం పై లేదా ఇతర ప్లాట్ ఫాం , అప్లికేషన్స్, సామాజిక మాధ్యమం పేజీలు లేదా ఏదైనా ఇతర డివైజ్ లేదా తన నియంత్రణలోని డిస్ ప్లే/కమ్యూనికేషన్ మార్గాలు పై వర్సే ఈ హక్కులను ఉపయోగించగలదని మీరు అర్థం చేసుకున్నారు మరియు అంగీకరించారు. సోషల్ మీడియా ఛానల్స్ మరియు ఇతర మూడవ పక్షం సైట్స్ మరియు సర్వీసెస్ సహా అయితే వీటికే పరిమితం కాకుండా ఉదాహరణకు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్ , మీడియా ఛానల్స్ వంటి ఏదైనా మూడవ పక్షానికి చెందిన ప్లాట్ ఫాం మొదలైన వాటి పై మీ కంటెంట్ మరియు ఇతర మెటీరియల్స్ ను వివిధ మూడవ పక్షం ప్లాట్ ఫాంస్ పై అందించడానికి మరియు ప్రసారం చేయడానికి మీ కంటెంట్ ను మేము ఏదైనా మూడవ పక్షం ప్లాట్ ఫాంలోనైనా ఉపయోగించవచ్చని ఇక్కడ స్పష్టంగా అనుమతించబడని విధంగా , మాకు మీ నుండి స్పష్టమైన అనుమతి లేదా సమ్మతి అవసరం లేదని మీరు అంగీకరిస్తున్నారు మరియు ఆమోదించారు. పైన చెప్పిన లక్ష్యాలు కోసం ఏదైనా మూడవ పక్షంతో మీకు సంబంధాన్ని కలగచేయడానికి కూడా మేము బాధ్యతవహించము. ఈ ఒప్పందం మరియు ఈ ప్లాట్ ఫాం పాలసీలు ప్రకారం మరియు అన్ని వర్తించే చట్టాలు మరియు నిబంధలు ప్రకారం ఈ హక్కులను వర్సేకు మంజూరు చేయడానికి మీకు అధికారం ఉందని మీరు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. మీరు పోస్ట్ చేసిన కంటెంట్ లోని అన్ని మేథో సంపత్తి హక్కులు మీకు ఉంటాయని లేదా ప్లాట్ ఫాం పై అలాంటి కంటెంట్ ను ప్రజలకు పోస్ట్ చేయడానికి, ప్రదర్శించడానికి, పునరుత్పత్తి చేయడానికి, కాపీలు చేయడానికి, ప్రసారం చేయడానికి, తెలియచేయడానికి మీ వద్ద చెల్లుబాటయ్యే లైసెన్స్ ఉందని మీరు అంగీకరిస్తున్నారు, నిర్ధారిస్తున్నారు మరియు గుర్తిస్తున్నారు.

10.6 కంటెంట్ పంపిణీ : వాణిజ్యపరమైన మరియు వాణిజ్యేతర లక్ష్యాలు కోసం ప్లాట్ ఫాం పై మరియు ప్లాట్ ఫాం పై కాకుండా ( మూడవ పక్షం ప్లాట్ ఫాంస్ /మీడియా ద్వారా) మీ కంటెంట్ అందచేయబడేలా మరియు మీచే అందుబాటులో ఉంచబడిన కంటెంట్ ను కాపీలు చేయడానికి, ప్రజలకు తెలియచేయడానికి, ప్రసారం చేయడానికి ప్రత్యేకమైన, ప్రపంచవ్యాప్తంగా, రాయల్టీ-రహితమైన, శాశ్వతమైన , అపరిమితమైన మరియు నిబంధనలు లేని లైసెన్స్ వర్సేకు ఉందని మీరు అర్థం చేసుకున్నారు, అంగీకరిస్తున్నారు. వర్సేకు మంజూరు చేయబడిన లైసెన్సింగ్ హక్కులు మేథో సంపత్తి హక్కులకు (కాపీరైట్, ట్రేడ్ మార్క్, డిజైన్స్ మరియు పేటెంట్ సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా) విస్తరిస్తుందని , ప్లాట్ ఫాం పై మీరు తయారు చేసిన కంటెంట్ తో కొనసాగుతుందని మీరు అర్థం చేసుకున్నారు, అంగీకరించారు.

10.7 మీ కంటెంట్ మీదిగా నిలిచి ఉంటుంది, అనగా మీ కంటెంట్ లో మీకున్న ఏవైనా మేథో సంపత్తి హక్కులను మీరు కలిగి ఉంటారని అర్థం.

10.8 తన స్వంత నిర్ణయాధికారం మేరకు యూజర్ కంటెంట్ ను తమ వ్యాపార ప్రతినిధులు, అనుబంధ సంస్థలు, మూడవ పక్షాలకు మరియు ఏదైనా ఇతర సంస్థ (లకు) అవసరమని భావించినప్పుడు వర్సే యూజర్ కంటెంట్ ను పంపిణీ చేసే హక్కును కలిగి ఉందని మీరు అర్థం చేసుకున్నారు మరియు అంగీకరించారు.

10.9 ప్లాట్ ఫాం పై కంటెంట్ ను పోస్ట్ చేయడం ద్వారా, మీరు కంటెంట్ అంతటికీ మరియు దానిలో అంతర్లీనంగా ఉన్న అంశాలకు మీరు యజమాని అని మీరు నిర్ధారిస్తున్నారు, లేదా ప్లాట్ ఫాం ద్వారా కంటెంట్ అందచేయబడేలా చేయడానికి యజమాని మీకు అధికారం ఇచ్చారు.

11. గోప్యత

11.1 డౌన్ లోడింగ్, ఇన్ స్టాలింగ్, యాక్సెసింగ్ లేదా ప్లాట్ ఫాంను ఉపయోగించడం వలన , లేదా ఏదైనా ఇతర విధానంలో మీరు స్వాధీనంలోకి వచ్చిన ప్లాట్ ఫాం లేదా వర్సే గురించి ఏ మూడవ పక్షానికైనా మీరు ఏదైనా గోప్యతా సమాచారం వెల్లడించరాదని మీరు అంగీకరిస్తున్నారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి అలాంటి గోప్యతా సమాచారాన్ని మీరు ఏ సందర్భంలోనైనా వెల్లడిస్తే, వర్సే తన స్వంత నిర్ణయాధికారం మేరకు మీకు తెలియచేయకుండానే మీ అకౌంట్ (లు) తొలగించడం ద్వారా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడానికి లేదా తగిన విధంగా మరియు చట్టబద్ధంగా ఉందని పరిగణించబడిన ఏదైనా ఇతర చట్టబద్ధమైన చర్య తీసుకోవడానికి హక్కు కలిగి ఉందని మీరు అంగీకరిస్తున్నారు.

11.2ఏదైనా మూడవ పక్షానికి గోప్యతా సమాచారం అందచేయబడిందని మీరు తెలుసుకున్న సందర్భంలో, దీనికి సంబంధించి మీరు వెంటనే వర్సేకు సమాచారం తెలియచేయాలి.

12. యూజర్ బాధ్యతలు/నియమాలు మరియు నిబంధనలు

ప్లాట్ ఫాం, ప్లాట్ ఫాం కంటెంట్ మరియు వేరొక యూజర్ కు చెందిన ఏదైనా యూజర్ కంటెంట్ ఉపయోగించబడలేదు, సవరించబడలేదు, పునరుత్పత్తి చేయబడలేదు, డూప్లికేట్ చేయబడలేదు, కాపీ చేయబడలేదు, ప్రచురించబడలేదు, పంపిణీ చేయబడలేదు, డౌన్ లోడ్ , విక్రయం, పునః విక్రయం, పరివర్తనం, పునఃరూపకల్పన, పునః ఆకృతి, పునః ప్రసారం చేయబడలేదు , లేదా లేకుంటే సాధనాలు, ఉత్పత్తులు, సేవలు, విధులు మరియు /లేదా ప్లాట ఫాం పై యూజర్స్ కు అందుబాటులో ఉంచిన ఫీచర్స్ ద్వారా సమన్వయం చేయబడిన లక్ష్యానికి మినహా తక్కిన వాటి కోసం, లేదా ప్రతి సందర్భంలోను వర్సే నుండి , వర్తించే యూజర్ నుండి , మరియు /లేదా వర్తించే మూడవ పక్షానికి చెందిన యజమాని నుండి ముందుగా రాతపూర్వకమైన సమ్మతి లేకుండా మీచే దోపిడీ చేయబడలేదు.

12.1 ఉపయోగించడానికి ఒక షరతుగా, ఈ ఒప్పందం నిషేధించిన ఏదైనా లక్ష్యం కోసం మీరు ప్లాట్ ఫాంను ఉపయోగించరని మీరు వాగ్దానం చేసారు. ప్లాట్ ఫాం సంబంధంలో మీ కార్యకలాపానికి మీరే బాధ్యులు.

12.2 మీరు తయారు చేసిన కంటెంట్ ను యాక్సెస్ చేయడానికి మరియు కంటెంట్ ను అందచేయడానికి లేదా ప్లాట్ ఫాం పై పోస్ట్ చేయడానికి అధికారం కలిగిన కంటెంట్ కోసం ప్లాట్ ఫాంను ఉపయోగించడానికి మాత్రమే మీరు అనుమతించబడ్డారని మీరు అంగీకరించారు, బాధ్యతవహిస్తున్నారు మరియు నిర్ధారిస్తున్నారు.

12.3 ప్లాట్ ఫాంను వినియోగించడం, యాక్సెస్ చేయడం మరియు సదుపాయాలు పొందడం అనేవి వెర్సే యొక్క గోప్యతా విధానం మరియు కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలు, సేవా నియమాలు ద్వారా నియంత్రంచబడతాయని మీరు ఇందుమూలముగా గుర్తించారు మరియు అంగీకరించారు మరియు పేర్కొనబడిన డాక్యుమెంట్స్ కు అనుగుణంగా మీరు వ్యవహరిస్తారు.

12.4 మీరు వర్తించే చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉంటారు మరియు మీరు వ్యాపారానికి, ప్రకటన, మార్కెటింగ్, గోప్యత లేదా మీ పరిశ్రమకు వర్తించే ఇతర స్వీయ-నియంత్రణ కోడ్ (లు) ప్రాతినిధ్యంవహిస్తే.

12.5 ఈ క్రింది విధమైన కంటెంట్ ను మీరు హోస్ట్ చేయలేరు, ప్రదర్శించలేరు, అప్ లోడ్ చేయలేరు, సవరించలేరు, ప్రచురించలేరు, ప్రసారం చేయలేరు, భద్రపరచలేరు, అప్ డేట్ చేయలేరు లేదా అందచేయలేరు:

  1. వేరొక వ్యక్తికి చెందినది మరియు యూజర్ కు ఎలాంటి హక్కు లేనిది;
  2. పరువు నష్టం కలిగించేది, అశ్లీలమైనది, అసభ్యకరమైనది, కంప్యూటర్ ను ఎక్కువగా ఉపయోగించే వ్యక్తి, శారీరకమైన గోప్యతతో సహా వేరొకరి ఏకాంతతో చొరబడేది, అవమానకరమైన లేదా లింగం, ఆధారంగా వేధించేది, అపవాదు, జాతిపరంగా లేదా వర్ణం గురించి అభ్యంతరం చెప్పేది, పేకాట లేదా హవాలాను ప్రోత్సహించడం లేదా సంబంధించిన లేదా లేకుంటే అమలులో ఉన్న చట్టాలకు వ్యతిరేకమైనది లేదా అస్థిరమైనది;
  3. పిల్లలకు హానికరమైనది;
  4. ఏదైనా పేటెంట్, ట్రేడ్ మార్క్, కాపీరైట్ లేదా ఇతర యాజమాన్య హక్కులను ఉల్లంఘించేది;
  5. తాత్కాలికంగా అమలులో ఉన్న ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించేది;
  6. సందేశం మూలం గురించి చిరునామాదారుడ్ని మోసం చేసేది లేదా తప్పుదోవ పట్టించేది లేదా స్పష్టంగా అబద్ధమైన ఏదైనా సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా మరియు తెలిసీ తెలియచేసేది లేదా తప్పుదోవ పట్టించే స్వభావం గలది కానీ వాస్తవమని తగిన విధంగా భావించబడేది;
  7. వేరొక వ్యక్తి వలే నటించడం;
  8. భారతదేశం ఐక్యత, సమైక్యత, రక్షణ, భద్రత లేదా సౌభ్రాతృత్వం, విదేశాలతో స్నేహపూర్వకమైన సంబంధాలు, లేదా ప్రజల శాంతికి భయం కలిగించేది, లేదా ఏదైనా విచారణయోగ్యమైన నేరాన్ని ఆరంభించడాన్ని ప్రేరేపించేది లేదా ఏదైనా నేరాన్ని దర్యాప్తు చేయడాన్ని నివారించేది లేదా ఇతర దేశాన్ని అవమానం చేసేది;
  9. సాఫ్ట్ వేర్ వైరస్ లేదా ఏదైనా ఇతర కంప్యూటర్ కోడ్ , ఫైల్ ఉన్నది లేదా ఏదైనా కంప్యూటర్ మూలాధారాన్ని అంతరాయం చేయడానికి, నాశనం చేయడానికిలేదా పనితీరును పరిమితం చేయడానికి రూపొందించబడిన ప్రోగ్రాం;
  10. స్పష్టంగా అబద్ధమైనది మరియు నిజం కానిది, ఆర్థిక లాభం పొందడానికి లేదా ఏ వ్యక్తికైనా గాయం చేయడానికి ఎవరైనా ఒక వ్యక్తి, సంస్థ లేదా ఏజెన్సీని తప్పుదారి పట్టించడానికిలేదా వేధించే ఉద్దేశ్యంతో ఏదైనా రూపంలో ప్రచురించబడిన లేదా రాసినది;
  11. ఏదో విధంగా, వెర్సే వ్యాపార ప్రయోజనాలను వ్యతిరేకంగా ప్రభావం కలిగించే సంభావ్యత గలది;
  12. ప్లాట్ ఫాంకు ఏదో విధంగా హాని కలిగించేది లేదా ప్రాధాన్యతను తగ్గించేది లేదా ప్లాట్‌ ఫాం పనితీరుకు, లభ్యత లేదా అందుబాటులో ఉండటానికి లోపం కలిగించేది;
  13. ప్రకటన, వ్యాపారం ప్రోత్సాహాలు లేదా అభ్యర్థనలను వర్ణించేది లేదా యూజర్స్ ను అభ్యర్థించేది లేదా ఏదైనా ఇతర అభ్యర్థన రకం;
  14. పాస్ వర్డ్, అకౌంట్, సున్నితమైన వ్యక్తిగత సమాచారం లేదా ఏ ఇతర యూజర్ నుండైనా ఏ ఇతర వ్యక్తిగత సమాచారం పొందడానికి ఉద్దేశ్యించబడినది లేదా అభ్యర్థన రూపొందించబడింది లేదా ఏదైనా సమాచారం పోస్ట్ చేస్తుంది లేదా ప్రసారం చేస్తుంది ;
  15. ప్లాట్ ఫాం, దాని సర్వర్స్ లేదా ఏదైనా కనక్టెడ్ నెట్ వర్క్స్ తో జోక్యం చేసుకోవడానికి లేదా హ్యాక్ చేయడానికి
  16. అనధికారమైన లేదా అభ్యర్థించని ప్రకటన, ప్రోత్సాహ మెటీరియల్స్, లేదా సమాచారపరమైన ప్రకటనలు సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా స్పామ్ పోస్ట్ చేస్తుంది లేదా ప్రసారం చేస్తుంది మరియు; మరియు
  17. వార్తలు/కరంట్ అఫైర్స్ కంటెంట్ ప్రదర్శిస్తుంది.

12.6 ఈ క్రింది నిషేధిత కార్యకలాపాలలో మీరు నిమగ్నం అవకూడదు-

  1. ఏ సమయంలో కూడా మీరు ప్లాట్ ఫాం ద్వారా పొందిన కంటెంట్ ను అనధికారంగా డౌన్ లోడ్ చేయరాదు/సేవ్ చేయరాదు, లేదా కంటెంట్ లేదా ప్లాట్ ఫాం యొక్క ఏదైనా భాగాన్ని అనధికారంగా యాక్సెస్ చేయడానికి లేదా కాపీ చేయడాన్ని నివారించడానికి వెర్సే ద్వారా ఏర్పాటు చేయబడిన ఏవైనా సాంకేతిక చర్యలను తప్పించుకోవడం చేయరాదు.
  2. ప్లాట్ ఫాం ఏ భాగాన్ని మీరు మార్చకూడదు లేదా సవరించకూడదు మరియు /లేదా ఏ అనధికార లక్ష్యం కోసం ప్లాట్ ఫాంను ఉపయోగించరాదు.
  3. ప్లాట్ ఫాంలో భాగంగా ఉన్న వెబ్ పేజీ యొక్క ఏ భాగాన్ని మీరు పునఃరూపొందించకూడదు లేదా నిర్మించరాదు.
  4. సున్నితమైన వ్యక్తిగత డేటా, వ్యక్తిగత సమాచారం లేదా స్పైడరింగ్ లేదా ఏ స్క్రాపింగ్ రూపంతో సహా, అయితే ఇందుకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర యూజర్స్ గురించి ఏదైనా ఇతర సమాచారం మీరు సేకరించరాదు లేదా సేకరించడానికి ప్రయత్నించరాదు లేదా తీయరాదు.
  5. మీరు ఉద్దేశ్యపూర్వకంగా నిజంగా లేదా ఊహాత్మకంగా వేరొక వ్యక్తి వలే నటించరాదు లేదా లేకుంటే వ్యక్తి లేదా సంస్థతో మీ సంబంధాన్ని తప్పు ప్రాతినిధ్యం చేయరాదు, ఉదాహరణకు, వేరొక వ్యక్తి లేదా కంపెనీ పేరుతో అకౌంట్ ను రిజిస్టర్ చేయడం లేదా సందేశాలు పంపించడం లేదా వేరొక వ్యక్తి పేరు ఉపయోగించి వ్యాఖ్యానాలు చేయడం లేదా ఇతర యూజర్స్ ను అనుకరించడం లేదా లేకుంటే మీ గుర్తింపును నకిలీ చేయడం చేయరాదు.
  6. ప్లాట్ ఫాంకు మరియు /లేదా వెర్సే అకౌంట్ యాక్సెస్ ను మీరు కిరాయికి ఇవ్వరాదు, విక్రయించరాదు లేదా బదిలీ చేయరాదు లేదా లీజుకు ఇవ్వరాదు లేదా విక్రయించడానికి లేదా బదిలీని ఆఫర్ చేయరాదు లేదా మీ పేరు మరియు పాస్ వర్డ్, లేదా ప్లాట్ ఫాం పై ఏ కంటెంట్ నైనా ఉపయోగించడానికి మూడవ పక్షానికి అనుమతి ఇవ్వరాదు.
  7. మీరు ప్లాట్ ఫాంను లేదా దాని ఏ కంటెంట్ నైనా పునః విక్రయించరాదు లేదా వాణిజ్యపరంగా వినియోగించరాదు లేదా డౌన్ లోడ్ చేయరాదు లేదా మీ యొక్క లేదా ఏ మూడవ పక్షం యొక్క ప్రయోజనం కోసమైనా అకౌంట్ సమాచారం కాపీ చేయరాదు. ప్లాట్ ఫాం కేవలం వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే మరియు పునరుత్పత్తి చేయబడలేదు, డూప్లికేట్ చేయబడలేదు, కాపీ చేయబడలేదు, విక్రయించబడలేదు, పునః విక్రయించబడలేదు, సందర్శించబడలేదు, లేదా లేకపోతే ఏ వాణిజ్య లక్ష్యం కోసమైనా దోపిడీకి గురి చేయబడలేదు.
  8. మీ అకౌంట్ ను వినియోగించడానికి మీరు ఏ మూడవ పక్షానికి అధికారం ఇవ్వరాదు.
  9. క్రిమినల్ నేరంగా రూపొందించబడే, పౌర బాధ్యతను కలిగించే లేదా లేకపోతే ఏ చట్టాన్నైనా లేదా నిబంధనైనా అతిక్రమించే ప్రవర్తనకు మీరు కట్టుబడరాదు లేదా నిమగ్నం అవకూడదు, లేదా ప్రోత్సహించకూడదు, ప్రేరేపించకూడదు , అభ్యర్థించకూడదు లేదా ప్రోత్సహిచరాదు; లేదా అనధికార లేదా చట్టవిరుద్ధమైన లక్ష్యం కోసం ప్లాట్ ఫాంను ప్రోత్సహించరాదు; ప్లాట్ ఫాంను వినియోగించి మీరు అప్ లోడ్ చేసిన, భద్రపరిచిన, అందచేసిన లేదా ప్రసారం చేసిన హైపర్ లింక్స్ సహా మీ ప్రవర్తనకు మరియు కంటెంట్ మరియు సమాచారానికి వర్తించే అన్ని స్థానిక చట్టాలను అనుసరించడానికి మీరు అంగీకరించారు.
  10. ట్రేడ్ మార్క్, కాపీరైట్ లేదా ఇతర యాజమాన్యం లేదా దీనిలో ఉన్న లీగల్ నోటీసులను లేదా ప్లాట్ ఫాం పై కనిపించేవి లేదా ప్లాట్ ఫాం పై కనిపించే ఏదైనా కంటెంట్ ను మీరు మార్చరాదు లేదా తొలగించరాదు, మార్చడానికి లేదా తొలగించడానికి ప్రయత్నించరాదు. వర్సే లేదా మా అనుబంధ సంస్థలు లేదా ఇతర యూజర్స్ యొక్క ఏ ట్రేడ్ మార్క్ , లోగో లేదా ఇతర యాజమాన్య సమాచారం (చిత్రాలు, కంటెంట్, మ్యూజిక్, టెక్ట్స్, పేజ్ లేఅవుట్, లేదా రూపం సహా) మీరు ఫ్రేమ్ చేయలేరు లేదా జత చేయడానికి ఫ్రేమింగ్ టెక్నిక్స్ వినియోగించలేరు. వెర్సే నుండి స్పష్టంగా రాతపూర్వకమైన సమ్మతి లేకుండా వెర్సే పేరు లేదా ట్రేడ్ మార్క్స్ ను వినియోగించి ఏ మెటా -ట్యాగ్స్ మరియు ఏదైనా ఇతర "అంతర్లీనంగా ఉన్న టెక్ట్స్" ఉపయోగించలేరు. వెర్సే నుండి ముందుగా స్పష్టమైన రాతపూర్వకమైన అనుమతి లేకుండా మీరు వెర్సే లోగో లేదా ఇతర యాజమాన్య గ్రాఫిక్ లేదా ట్రేడ్ మార్క్ ను లింక్ లో భాగంగా ఉపయోగించలేరు. అనధికారమైన ఏ వాడకమైనా వెర్సే జారీ చేసిన అనుమతి లేదా లైసెన్స్ ను రద్దు చేస్తుంది.
  11. ప్లాట్ ఫాంలో కేటాయించిన ఫీచర్స్ ద్వారా మినహా కంటెంట్ ను మీరు స్క్రాపింగ్ ను వినియోగించలేరు లేదా సమూహంగా చేయడానికి, పునః లక్ష్యం కోసం, అనుసరించడానికి, కాపీ చేయడానికి, పునః ప్రచురణకు అలాంటి టెక్నిక్కులను వినియోగించలేరు, అందించలేరు లేదా లేకపోతే ప్రజలకు తెలియచేయలేరు, ప్రదర్శించలేరు, నిర్వహించలేరు, బదిలీ చేయలేరు, భాగస్వామం, పంపిణీ చేయలేరు లేదా లేకపోతే వినియోగించలేరు లేదా దోపిడీ చేయలేరు.
  12. ప్లాట్ ఫాం ఆబ్జెక్ట్ కోడ్ ను లేదా ప్లాట్ ఫాం యొక్క ఏ భాగానికి చెందిన ఆబ్జెక్ట్ కోడ్ నైనా కాపీ చేయడానికి లేదా స్వీకరించడానికి, లేదా రివర్స్ ఇంజనీర్ చేయడానికి, రివర్స్ కూర్పు, డీకంపైల్ చేయడానికి, సవరించడానికి లేదా ఆధారం కనుగొనడాన్ని ప్రయత్నించడానికి మీరు మూడవ పక్షానికి అనుమతించలేరు, లేదా కాపీ రక్షణ వ్యవస్థనైనా మీరు కాపీ చేయడాన్ని తప్పించుకోవడం లేదా తప్పించుకోలేరు లేదా తప్పించుకోవడాన్ని ప్రయత్నించడం చేయలేరు లేదా కంటెంట్ లేదా ప్లాట్ ఫాంకు సంబంధించిన హక్కుల నిర్వహణ సమాచారం యాక్సెస్ చేయలేరు.
  13. ప్లాట్ ఫాం లేదా ప్లాట్ ఫాం యొక్క నెట్ వర్క్స్ ను రూపొందించే భాగానికి, కనక్ట్ చేయబడిన భాగానికి, లేదా ప్లాట్ ఫాం యొక్క ఇతర యూజర్స్ వాడకం మరియు ఆనందాన్ని నిరోధించడానికి లేదా అంతరాయం కలిగించడానికి లేదా అవరోధం కలిగించడానికి , పరిమితం చేయడానికి అవకాశమున్న లేదా ఇవి చేసే అధిక భారం కలిగించే ఏవైనా వైరస్ లు, వర్మ్స్, లోపాలు, ట్రోజన్ హార్స్, కాన్సిల్ బాట్స్, స్పైవేర్, నాశనకారి లేదా కలుషితమైన స్వభావం గల ఇతర అంశాలు, ఆడ్ వేర్, పాకెట్ లేదా ఐపీ స్పూఫింగ్, ఫోర్జ్ డ్ రౌటింగ్ లేదా ఎలక్ట్రానిక్ మెయిల్ అడ్రస్ సమాచారం లేదా అలాంటి పద్ధతులు లేదా సాంకేతికత, హానికరమైన కోడ్, ఫ్లడ్ పింగ్స్, మాల్ వేర్, బాట్, టైమ్ బాంగ్, వర్మ్ లేదా వేరొక హానికరమైన లేదా మోసపూరితమైన భాగం మీరు ప్రసారం చేయలేరు.
  14. వేరొక యూజర్ ను, లేదా వెర్సే ఉద్యోగులను మరియు /లేదా అనుబంధ వ్యక్తులను మీరు వెంటాడలేరు, దోపిడీ చేయలేరు, బెదిరించలేరు, దూషించలేరు లేదా లేకపోతే వేధించలేరు.
  15. వెర్సే ఏర్పాటు చేసిన ఏ డేటా భద్రతా చర్యలను మీరు ఉల్లంఘించలేరు, తప్పించుకోలేరు లేదా ఉల్లంఘించడానికి లేదా తప్పించుకోవడానికి ప్రయత్నించలేరు ;మీ వాడకం; లాగ్ ఇన్ చేయడానికి ఉద్దేశ్యించబడని డేటా లేదా మెటీరియల్స్ యాక్సెస్ చేయలేరు లేదా యాక్సెస్ చేయడానికి ప్రయత్నించలేరు లేదా మీరు యాక్సెస్ చేయడానికి అధికారం ఇవ్వబడని అకౌంట్ లోకి లాగ్ ఇన్ చేయడానికి ప్రయత్నించలేరు ;వర్సే సర్వర్ లేదా సిస్టం లేదా నెట్ వర్క్ ను స్కాన్ చేయలేరు లేదా హానికి గురయ్యే సంభావ్యతను పరీక్షించడం చేయలేరు లేదా వెర్సే డేటా భద్రత లేదా ధృవీకరణ ప్రక్రియలు ఉల్లంఘించడాన్ని ప్రయత్నించలేరు మరియు ;

  1. పబ్లిక్ సెర్చ్ ఇంజన్స్ మినహాయింపుతో ప్లాట్ ఫాం యొక్క ఏ భాగాన్నైనా తిరిగి పొందడానికి లేదా సూచన చేయడానికి మీరు ఏ రోబోట్, స్పైడర్, ఆఫ్ లైన్ రీడర్స్, సైట్ సెర్చ్ మరియు /లేదా రిట్రీవల్ అప్లికేషన్ లేదా ఇతర డివైజ్ ను వినియోగించలేరు; ప్లాట్ ఫాం మరియు /లేదా సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, విశ్లేషించడానికి లేదా కాపీ చేయడానికి ఏదైనా రోబోట్, స్పైడర్, స్క్రాపర్ లేదా ఇతర ఆటోమేటెడ్ మార్గాలను వినియోగించలేరు (మన సమాచారం లేదా ఇతర యూజర్స్ సమాచారం కావచ్చు).

12.7 మీరు కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలు మరియు గోప్యతా పాలసీకి కట్టుబడి ఉండాలి.

13. ప్రాతినిధ్యాలు మరియు హామీలు

13.1 ఈ నియమాలలో స్పష్టంగా పేర్కొనబడినవి కాకుండా లేదా చట్టం కోరిన విదంగా, సర్వీస్ "యథాతథంగా" కేటాయించబడింది మరియు సర్వీస్ గురించి వర్సే ఎలాంటి నిర్దిష్టమైన నిబద్ధతలు లేదా హామీలు ఇవ్వదు. ఉదాహరణకు, మేము వీటి గురించి హామీలు ఇవ్వము: (ఏ) సర్వీస్ ద్వారా కేటాయించబడిన కంటెంట్; (బి) సర్వీస్ లేదా దాని ఖచ్చితత్వం, నమ్మకం, లభ్యత లేదా మీ అవసరాలను తీర్చగలిగే సామర్థ్యం యొక్క నిర్దిష్టమైన ఫీచర్స్; లేదా (సీ) మీరు సమర్పించే ఏదైనా కంటెంట్ సర్వీస్ పై లభింపచేయడానికి.

13.2 ప్లాట్ ఫాంను మీరు వినియోగించడం ద్వారా మీచే యాక్సెస్ చేయబడే కంటెంట్ లో మూడవ పక్షాలకు చెందిన మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అలాంటి కంటెంట్ కోసం వెర్సే ఎలాంటి బాధ్యతను ఊహించదని మీరు గుర్తించారు. ప్లాట్ ఫాంను వినియోగిస్తున్నప్పుడు మీరు నేరపూరితమైన, అసభ్యకరమైన, లేదా ఇతర అభ్యంతకరమైన కంటెంట్ ను మీరు ఎదుర్కోవచ్చని మీరు అర్థం చేసుకున్నారు మరియు అలాంటి నేరపూరితమైన మరియు అశ్లీలమైన మెటీరియల్స్ కు మీకు తెలియకుండానే బహిర్గతం కావచ్చని మీరు అర్థం చేసుకున్నారు. మీరు ప్లాట్ ఫాంను వినియోగించడం వలన ఇతరులు కూడా మీ గురించి వ్యక్తిగత సమాచారాన్ని సంపాదించడానికి ఇతరులకు కూడా సాధ్యం మరియు మిమ్మల్ని వేధించడానికి లేదా గాయపరచడానికి గ్రహీత అలాంటి సమాచారాన్ని ఉపయోగించవచ్చు. వెర్సే అలాంటి అనధికార వాడకాన్ని ఆమోదించదు కానీ ప్లాట్ ఫాంను వినియోగించడం ద్వారా ఇతరులు సంపాదించిన వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించడానికి ఏదైనా అలాంటి అనధికార వాడకం కోసం వెర్సే బాధ్యతవహించదని మీరు గుర్తించారు మరియు అంగీకరించారు.

13.3 ప్లాట్ ఫాం నష్టం, నాశనం, హాని , వెర్సే సురక్షితమైన సర్వర్స్ ను వినియోగించడానికి అనధికార యాక్సెస్ నుండి మరియు /లేదా ఏదైనా మరియు అన్ని వ్యక్తిగత సమాచారం మరియు /లేదా అక్కడ భద్రపరచబడిన ఆర్థిక సమాచారం, అవినీతి, దాడి, ప్లాట్ నుండి లేదా ప్లాట్ ఫాంకు ప్రసారానికి అంతరాయం కలగటం లేదా ఆపుచేయబడటం, మూడవ పక్షంచే ప్లాట్ ఫాం ద్వారా లేదా ప్లాట్ ఫాంకు బగ్స్, వైరస్ లు, ట్రోజన్ హార్సెస్, లేదా అలాంటివి ప్రసారం చేయబడటానికి, మరియు /లేదా ఏ కంటెంట్ లోనైనా ఏవైనా లోపాలు లేదా తీసివేతలకు లేదా ప్లాట్ ఫాం ద్వారా యాక్సెస్ చేయదగిన ఏ కంటెంట్ నైనా వినియోగించడం వలన కలిగిన ఏ రకమైన హాని లేదా నష్టం కోసం వెర్సే ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వదు.

13.4 ప్లాట్ ఫాం ద్వారా యూజర్ యాక్సెస్ చేసే కంటెంట్ లేదా మూడవ పక్షాలు కేటాయించిన లింక్స్ వైరస్ ల రహితంగా లేదా అలాంటి కలుషితాలు లేదా నాశనకారి ఫీచర్స్ ను కలిగి లేవని వెర్సే ఎలాంటి గ్యారంటీలు లేదా ప్రాతినిధ్యాలు ఇవ్వదు. ప్లాట్ ఫాం యొక్క నాణ్యత మరియు పనితీరుకు ఉన్న అన్ని నష్టాలను మరియు కంటెంట్ యొక్క ఖచ్చితత్వం మరియు సంపూర్ణత గురించి మీరు ఊహించారని మీరు అంగీకరించారు.

13.5 ప్లాట్ ఫాం లేదా ఏదైనా హైపర్ లింక్డ్ సర్వీసెస్ ను వినియోగించడం ద్వారా మూడవ పక్షంచే ఆఫర్ చేయబడిన లేదా ప్రచారం చేయబడిన సర్వీస్ లేదా ఉత్పత్తి కోసం లేదా బ్యానర్ లేదా ఇతర ప్రకటనలో కనిపించిన వాటి గురించి వెర్సే హామీ, మద్దతు, గ్యారంటీ ఇవ్వదు లేదా బాధ్యతను ఊహించదు, మరియు ఉత్పత్తులు లేదా సర్వీసెస్ యొక్క మూడవ పక్షం ప్రొవైడర్స్ మరియు మీకు మధ్య ఏ లావాదేవీనైనా పర్యవేక్షించడానికి ఏ విధంగా బాధ్యతవహించదు లేదా పార్టీగా ఉండబోదు. ఏ మాధ్యమం ద్వారానైనా లేదా ఏ వాతావరణంలోనైనా ఉత్పత్తి లేదా సర్వీస్ ను కొనుగోలు చేయడంతో పాటు ప్లాట్ ఫాంను యాక్సెస్ చేయడం, ఉపయోగించడం, హ్యాకింగ్ లేదా మీచే ఇతర భద్రతా అతిక్రమణలు వలన ఏర్పడే ఏదైనా జోక్య, వ్యక్తిగత గాయం లేదా ఆస్థి నష్టం, అలాంటి స్వభావం కలిగిన వాటిలో మీరు ఉత్తమమైన నిర్ణయం తీసుకోవాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి, మరియు వెర్సే దీనికి సంబంధించిన బాధ్యతను నిరాకరిస్తోంది.

13.6 ప్లాట్ ఫాం వినియోగం లేదా ఫలితాలు ఖచ్చితంగా, సకాలంలో, నమ్మకంగా, నిరంతరంగా లేదా లోపాలు లేకుండా ఉంటాయని హామీలు, ప్రాతినిధ్యాలు, లేదా వారంటీలు ఇవ్వదు. ముందుగా నోటీసు ఇవ్వకుండానే, వర్సే ప్లాట్ ఫాం అంతా లేదా కొంచెం భాగాన్ని ప్లాట్ ఫాంను మీరు వినియోగించడాన్ని సవరించవచ్చు, రద్దు చేయవచ్చు లేదా కొనసాగించడం ఆపుచేయవచ్చు, అలాంటి సందర్భంలో, వెర్సే మీకు లేదా మూడవ పక్షానికి బాధ్యతవహించదు.

14.ప్రకటనలు ">14.1 ప్లాట్ ఫాం మూడవ పక్షం కంటెంట్ కు మరియు /లేదా వెర్సే నియంత్రించిన లేదా సొంతం చేసుకున్న వెబ్ సైట్స్ ను యాక్సెస్ ను అందిస్తుంది.

14.2. ఈ ప్లాట్ ఫాంను వినియోగించడం ద్వారా మీరు ప్రకటనలు స్వీకరించడానికి ఇందుమూలముగా అంగీకరించారు, బాధ్యతవహిస్తున్నారు మరియు నిర్థారిస్తున్నారు.

14.3. ప్లాట్ ఫాం మూడవ పక్షానికి చెందిన నైపుణ్యం అవసరమైన గేమ్స్, క్విజ్ లు మరియు ఇతర అలాంటి కార్యకలాపాలకు యాక్సెస్ ను కేటాయించవచ్చు. సంబంధిత మూడవ పక్షం వీటికి బహుమతులు కూడా అందచేయవచ్చు. వెర్సే మూడవ పక్షానికి చెందిన గేమ్స్ లేదా ఇతర కార్యకలాపాలను నియంత్రించలేదు లేదా వెర్సే సొంతం కాదు, మరియు ఫలితాలు ప్రకటించడానికి లేదా బహుమతులు ఇవ్వడానికి ఎటువంటి బాధ్యతవహించదు లేదా నియంత్రించలేదు.

14.4 వెర్సే మూడవ పక్షానికి చెందిన ప్లాట్ ఫాంలో ఉన్న టెక్ట్స్, గ్రాఫిక్స్, యూజర్ ఇంటర్ ఫేసెస్, విజువల్ ఇంటర్ ఫేసెస్, ఫోటోగ్రాఫ్స్, ట్రేడ్ మార్క్స్, లోగోలు, సౌండ్స్, మ్యూజిక్ మరియు ఆర్ట్ వర్క్ లేదా అప్లికేషన్స్, సర్వీసెస్, ప్రకటనలు , మరియు /లేదా లింక్స్ సహా కంటెంట్ కు బాధ్యతవహించదు.

14.5 ప్లాట్ ఫాం పై మూడవ పక్షం కంటెంట్ లేదా మూడవ పక్షం కార్యకలాపాలకు సంబంధించి మీకు ఏవైనా ఫిర్యాదులు లేదా ఆందోళనలు ఉంటే ఫిర్యాదులు నమోదు చేయడానికి వ్యవస్థలో పేర్కొనబడిన (లింక్ చేర్చండి) ఫిర్యాదు పరిష్కారం వ్యవస్థ ద్వారా మీరు ఫిర్యాదులు నమోదు చేయడానికి అంగీకరించారు. వర్తించే చట్టాలు మరియు ఫిర్యాదు పరిష్కారం వ్యవస్థ ప్రకారం మీ ఫిర్యాదులను వెర్సే నిర్వహిస్తుందని మీరు అంగీకరించారు మరియు గుర్తించారు.

14.6 ప్లాట్ ఫాం లేదా ఏదైనా కంటెంట్ ను ( "మిర్రరింగ్" సహా) మీరు కాపీ, పునరుత్పత్తి, పునః ప్ర ప్రచురణ, అప్ లోడ్, పోస్ట్, బహిరంగంగా ప్రదర్శించడం,ఎన్ కోడ్ చేయడం, అనువాదం చేయడం, ప్రసారం, డౌన్ లోడ్ చేయడం లేదా పంపిణీ చేయడానికి ఏ విధంగా కూడా వేరొక కంప్యూటర్, సర్వర్, వెబ్ సైట్ కు పంపించలేరు లేదా ఇతర మాధ్యమానికి పంపిణీ లేదా ప్రచురణ కోసం లేదా ఏదైనా వాణిజ్యపరమైన సంస్థ కోసం పంపించలేరు. ఉల్లంఘన జరిగితే కావలసిన చర్యలు తీసుకోవడానికి మరియు నష్టాలను క్లెయిమ్ చేయడానికి వెర్సేకు అన్ని హక్కులు ఉన్నాయి. అలాంటి చర్యలో మీ అకౌంట్ ను నిర్మూలించడం ద్వారా ప్లాట్ ఫాం వినియోగానికి మీ అనుమతిని రద్దు చేయడం కూడా ప్రమేయాన్ని కలిగి ఉంటుంది.

14.7 స్పష్టంగా అనుమతించబడిన ప్లాట్ ఫాం యొక్క సాధారణ సమాచారాన్ని మీరు వినియోగించవచ్చు, అయితే మీరు (1) అలాంటి డాక్యుమెంట్స్ యొక్క అన్ని కాపీలలో ఏదైనా యాజమాన్య నోటీసు భాషను తొలగించకూడదు, (2) అంగీకరించితే మినహా లేకపోతే అంగీకారం ద్వారా మీ వ్యక్తిగత, వాణిజ్యేతర సమాచారం లక్ష్యం కోసం అలాంటి కంటెంట్ ఉపయోగించాలి మరియు అలాంటి కంటెంట్ ను ఏదైనా నెట్ వర్క్ ఉన్న కంప్యూటర్ పై కాపీ చేయవద్దు లేదా పోస్ట్ చేయవద్దు లేదా ఏదైనా మీడియాలో ప్రసారం చేయవద్దు, (3)అలాంటి కంటెంట్ కు సవరణలు చేయవద్దు, మరియు (4) అలాంటి డాక్యుమెంట్స్ కు సంబంధించిన ఏవైనా అదనపు హామీలు లేదా ప్రాతినిధ్యాలను చేయవద్దు.

15.ప్లాట్ ఫాం వాడకం

15.1 జోష్ మరియు ప్లాట్ ఫాంలు కేవలం సమన్వయకర్త మాత్రమే అని మీరు అంగీకరించారు మరియు గుర్తించారు మరియు ప్లాట్ ఫాం పై ఏవైనా లావాదేవీలను ఏ విధంగా కూడా నియంత్రించలేరు మరియు దానిలో పక్షంగా ఉండలేరు. తదనుగుణంగా, ప్లాట్ ఫాం పై ఉత్పత్తుల విక్రయం యొక్క ఒప్పందం ప్లాట్ ఫాం పై విక్రేతలు /వ్యాపారులు మరియు మీకు మధ్య మాత్రమే నేరుగా ఉంటుంది.

మీరు ఏదైనా అనధికార లేదా చట్టవిరుద్ధమైన లక్ష్యం కోసం ప్లాట్ ఫాం పై లభించే ఏవైనా ఉత్పత్తులను మీరు ఉపయోగించలేకపోవచ్చు;

ఈ ప్లాట్ ఫాంను మోసపూరితంగా వినియోగించడం లేదా ప్లాట్ ఫాం నుండి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వర్తించే చెల్లింపు విధానం యొక్క మీ చర్య/చర్య తీసుకోకపోవడం వలన జోష్ కు కలిగిన ఆర్థిక నష్టం మీ నుండి స్వాధీనం చేసుకోబడుతుంది. పైన చెప్పిన విషయంతో పక్షపాతం లేకుండా, ఈ ప్లాట్ ఫాంను మోసపూరితంగా వినియోగించినందుకు మరియు /లేదా ప్లాట్ పాం లేదా ఏదైనా ఇతర చట్ట విరుద్ధమైన చర్య కోసం లేదా ఈ నియమాలు ఉల్లంఘన విస్మరించడం కోసం మీ పై చట్టబద్ధమైన చర్య తీసుకోవడానికి జోష్ హక్కును కలిగి ఉంది;

ప్లాట్ ఫాం పై చిత్రాలు మరియు బొమ్మల ప్రాతినిధ్యాలు ప్రకటనా లక్ష్యాలు కోసం పెంపొందించబడటం;

కంటెంట్, ఉత్పత్తి వర్ణన మరియు ఇతర సంబంధిత సమాచారం తనిఖీ చేయడానికి మీరు బాధ్యులుగా ఉంటారు; మరియు

ప్లాట్ ఫాం పై విక్రేతలు /వ్యాపారులతో మీ ఒప్పందము మరియు మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తి (లు) మీ అంతర్గత /వ్యక్తిగత లక్ష్యం కోసం కొనుగోలు చేయబడ్డాయి మరియు వ్యాపార లక్ష్యాలు లేదా పునః విక్రయాలు కోసం కాదు. వెబ్ సైట్ పై ఆర్డర్ చేయబడిన ఇంతకు ముందు చెప్పిన ఉత్పత్తుల లక్ష్యాన్ని మీ తరపున పేర్కొంటూ ప్రభుత్వ సంస్థకు వెల్లడించటానికి మరియు వెల్లడింపు కేటాయించడానికి మీరు జోష్ కు అధికారం ఇచ్చారు.

15.2 నిషేధిత వాడకాలు :

జోష్ కు ఉన్న బిల్ట్ సిస్టంస్ లో ప్లాట్ ఫాం పై వ్యాపారులు నిషేధిత వస్తువులను విక్రయించడాన్ని మేము పరిమితం చేస్తాం. అయితే, అవకాశం లేని ఘటనలో భాగంగా వ్యాపారి ద్వారా ప్లాట్ ఫాం పై జాబితా చేయబడిన ఈ క్రింది ఉత్పత్తులను ఏ సమయంలో కూడా కొనుగోలు చేయకుండా నిర్థారించడం ఒక బయ్యర్ గా మీ బాధ్యత:

అడల్ట్ ఉత్పత్తులు మరియు ఏ రూపంలోనైనా (ప్రింట్, ఆడియో/వీడియో, మల్టిమీడియా సందేశాలు, చిత్రాలు, ఫోటోగ్రాఫ్స్, మొదలైనవి) అశ్లీలమైన మెటీరియల్స్ ( పిల్లల అశ్లీలకరమైన మెటీరియల్స్ సహా) ;

  1. ఆల్కహాల్;
  1. జంతువులు మరియు అటవీ ఉత్పత్తులు - జీవించి ఉన్న జంతువులు, దంతాలు, మౌంటెండ్ స్పెసిమన్స్;
  2. ఐపీని ఉల్లంఘించిన కళాకృతులు, నకిలీ సరుకులు మరియు సేవలు (ఈ క్రింద నిర్వచించిన విధంగా);
  3. క్రూడ్ ఆయిల్;
  4. చట్టం నిషేధించిన ఎలక్ట్రానిక్ నిఘా సామగ్రి;
  5. నిషేధిత దేశాలు నుండి మోసపూరితమైన వస్తువులు;
  6. జీవించినవి లేదా మరణించిన అంతరించిపోతున్న జంతువులు, మొక్కల జాతులు;
  7. చట్టం ద్వారా పునః విక్రయించడం నుండి మినహాయించబడిన కార్యక్రమం టికెట్స్;
  8. ఆయుధాలు, పేలుడు ఆయుధాలు మరియు కత్తులు - ఉదాహరణలలో పెప్పర్ స్ప్రే, అనుకరణలు, మరియు స్టంట్ గన్స్;
  9. ఏవైనా ఆర్థికపరమైన సేవలు;
  10. కావలసిన అనుమతులు లేకుండా ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణ వస్తువులు ;
  11. నల్ల బజారు ఉత్పత్తులు ;
  12. ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులు /సామగ్రి ( పోలీసులు ఉపయోగించే ఫ్రీక్వెన్సీతో ఉన్న వైర్ లెస్ సామగ్రి, పోలీసులు/భారత సైన్యం మొదలైన వారు ఉపయోగంచే సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వ అధికారుల యూనిఫాంలు )
  13. పాస్ పోర్స్ట్ వంటి ప్రభుత్వం జారీ చేసిన డాక్యుమెంట్స్ మొదలైనవి;
  14. ప్రమాదకరమైనవి, పరిమితం చేయబడిన లేదా నియంత్రిత వస్తువులు -ఉదాహరణలు- బ్యాటరీలు, టపాసులు మరియు రిఫ్రిజిరెంట్స్ ;
  15. మనుష్యుల అవశేషాలు మరియు శరీర భాగాలు;
  16. వ్యాపారికి పంపిణీ హక్కులు లేని ఏ రూపంలోనైనా ఉన్న ఐపీ ( మ్యూజిక్, మూవీస్, పుస్తకాలు, డిజైన్స్ సహా, వాటికి మాత్రమే పరిమితం కాకుండా);
  17. ఇన్ వాయిస్ లు మరియు రసీదులు ( ఖాళీ మరియు ముందుగా భర్తీ చేసిన వాటితో సహా);
  18. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్;
  19. లాటరీ టికెట్స్;
  20. మెయిలింగ్ జాబితాలు మరియు వ్యక్తిగత సమాచారం;
  21. భారతదేశపు బయటి సరిహద్దులు తప్పుగా చూపించిన ఐమ్యాప్స్ మరియు సాహిత్యం;

15.3 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ అవసరమైన మందులు, డ్రగ్స్ మరియు డ్రగ్ సామగ్రి ;

  1. నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల చట్టం, 1985 క్రింద నిర్వచించబడిన విధంగా నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలు;
  2. మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన తేదీ, వర్ణం, లేదా సంస్కృతి ఆధారంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే నేరపూరితమైన సామగ్రి;
  3. అణుధార్మిక సామగ్రిలు;
  4. పాము చర్మాలు;
  5. ప్రీ-కన్సెప్షన్ మరియు ప్రీ-నాటల్ డయోగ్నిస్టిక్ టెక్నిక్స్ చట్టం, 1994 క్రింద ఉన్న విధంగా లింగ నిర్థారణ;
  6. స్టాక్స్ మరియు సెక్యూరిటీస్ ;
  7. రియల్ ఎస్టేట్ ;
  8. అణుధార్మిక సామగ్రిలు;
  9. దొంగతనం చేయబడిన ఆస్థి;
  10. పొగాకు;వర్తించే చట్టాలు ప్రకారం ఏదైనా ఇతర మంజూరైన లేదా నిషేధించబడిన వస్తువులు లేదా సేవలు; మరియు
  11. జోష్ ద్వారా తగిన విధంగా ఉందని భావించిన ఏదైనా ఇతర వస్తువు.

16. ఉత్పత్తులు

16.1 ప్లాట్ ఫాం మార్కెట్ ప్రదేశంగా ఆపరేట్ చేస్తుంది మరియు వివిధ విక్రేతలు వివిధ ఉత్పత్తులు (ఉత్పత్తులు మరియు సేవలకు అనుబంధంగా ఉన్న సేవలు సహా) లభించేలా చేయడానికి, వోచర్స్, మరియు ప్లాట్ ఫాం యొక్క యూజర్స్ కు సేవలు ("ఉత్పత్తులు") ప్రకటించడానికి, ప్రదర్శించడానికి కేవలం ఒక ఆన్ లైన్ ప్లాట్ ఫాంను మాత్రమే కేటాయిస్తుంది. ప్లాట్ ఫాం యూజర్స్ మరియు వివిధ విక్రేతలు యొక్క ప్రమేయాన్ని సమన్వయం చేస్తుంది మరియు అనుషంగికంగా మరియు అనుబంధంగా ఉన్న అలాంటి ఇతర సేవలను కేటాయిస్తుంది. అదనంగా, ఎలాంటి నోటీసు లేకుండా ఏ ఆఫర్ చేయబడిన సేవలను ఏ సమయంలోనైనా రద్దు చేసే హక్కు ప్లాట్ ఫాంకు ఉంది.

16.2. ప్లాట్ ఫాం పై అన్ని ఉత్పత్తులు "యథాతథంగా " మరియు "లభించే విధంగా" ప్రాతిపదికన ప్రదర్శించబడతాయి. ఉత్పత్తుల చిత్రాలు సూచన ద్వారా మరియు కోసం మాత్రమే మరియు అసలు ఉత్పత్తి ప్రదర్శించబడిన చిత్రం నుండి వేరుగా ఉండవచ్చు. ఈ విషయంలో తలెత్తే ఏవైనా వ్యత్యాసాలు నుండి తలెత్తిన ఏవైనా బాధ్యతలను ప్లాట్ ఫాం నిరాకరిస్తుంది. ఏవైనా ఉత్పత్తులు యొక్క నాణ్యత, సమాచారం లేదా ప్లాట్ ఫాం నుండి కొనుగోలు చేసిన ఇతర సామగ్రి లేదా పొందిన ఇతర సామగ్రి మీరు ఆశించిన విధంగా ఉంటుంది, లేదా సర్వీసెస్ లోని ఏవైనా లోపాలు సరిదిద్దబడతాయి. దీనికి వ్యాపారులు మాత్రమే పూర్తి బాధ్యులు.

16.3. యూజర్ ఆర్డర్ చేసిన విధంగా అంతిమ ఉత్పత్తి రూపం మరియు తుది మెరుగులకు ఖచ్చితత్వం యొక్క ఏవైనా గ్యారంటీలను ప్లాట్ ఫాం ఇందుమూలంగా నిరాకరిస్తుంది. ప్లాట్ ఫాం ద్వారా మీరు కొనుగోలు చేసిన లేదా పొందిన ఏవైనా ఉత్పత్తులు, సేవలు, సమాచారం యొక్క నాణ్యత జోష్ మద్దతు చేయదు లేదా సహాయపడదు మరియు సంబంధిత విక్రేత యొక్క పూర్తి బాధ్యత మాత్రమే. సంబంధిత బ్రాండ్స్ యొక్క సైజ్ చార్ట్స్ లో ఉత్పత్తి తేడా యొక్క లభ్యత కలిగించిన పరిమితులు వలన మర్చండైజ్ బ్రాండ్, సైజ్, రంగు మొదలైనటువంటి మీ ఆర్డర్ యొక్క కొన్ని అంశాలకు మార్పులు కావాలి.

16.4. ప్లాట్ ఫాం మరియు /లేదా ప్లాట్ ఫాం యొక్క సదుపాయాన్ని ఏ వ్యక్తికైనా , భౌగోళిక ప్రాంతం లేదా అధికార పరిధికి పరిమితం చేయడానికి జోష్ హక్కును కలిగి ఉంది కానీ బాధ్యతను కాదు. ఆయా సందర్భాలను బట్టి మేము ఈ హక్కును అమలు చేస్తాము. ఉత్పత్తులకు సంబంధించిన అన్ని వర్ణనలు లేదా ఉత్పత్తి ధరలు మా స్వంత నిర్ణయాధికారం మేరకు నోటీసు లేకుండానే, ఏ సమయంలోనైనా మారవచ్చు. ఏ సమయంలోనైనా ఏదైనా ఉత్పత్తిని కొనసాగించకుండా ఆపు చేసే హక్కు మాకు ఉంది. ఈ ప్లాట్ ఫాం లో ఏదైనా ఉత్పత్తి కోసం చేసిన ఏదైనా ఆఫర్ నిషేధించబడిన చోట చెల్లదు.

16.5 అన్ని ధరలు సరుకులు మరియు సేవల పన్ను ("జీఎస్టీ"), వేరొక విధంగా పేర్కొనబడినప్పుడు మినహా వర్తించే విధంగా సుంకాలు మరియు పన్నులతో కలిపి ఉంటాయి. మా నుండి కొనుగోలు చేసిన ఉత్పత్తులతో సంబంధమున్న అన్ని ఫీజు/ఖర్చులు/ఛార్జీలు యొక్క చెల్లింపు కోసం మీరే బాధ్యులు మరియు జీఎస్టీ, సుంకాలు మరియు పన్నులు మొదలైన వాటితో సహా అయితే వాటికి మాత్రమే పరిమితం కాకుండా ఏవైనా మరియు అన్ని వర్తించే పన్నులను భరించడానికి మీరు అంగీకరించారు.

16.6 సర్వీసెస్, ప్లాట్ ఫాం మరియు /లేదా దానికి సంబంధించిన ఏదైనా భాగం లేదా కంటెంట్ ను ముందుగా నోటీసు ఇవ్వకుండా ఏ సమయంలోనైనా సవరించడానికి లేదా కొనసాగించకుండా ఆపుచేయడానికి జోష్ కు హక్కు ఉంది. ప్లాట్ ఫాం యొక్క సవరణ, ధరల మార్పు, సర్వీసెస్ రద్దు చేయడం లేదా కొనసాగించకపోవడం కోసం జోష్ మీకు లేదా మూడవ పక్షానికి బాధ్యతవహించదు.

17. చెల్లింపు, రిటర్న్ ">17.1 ఉత్పత్తులు కోసం ధరలు మా ప్లాట్ ఫాం పై వర్ణించబడ్డాయి మరియు సూచన ద్వారా ఈ నియమాల్లోకి చేర్చబడ్డాయి. అన్ని ధరలు భారతదేశపు రూపాయలలో ఉన్నాయి. సంబంధిత విక్రేత ద్వారా ధరలు, ఉత్పత్తులు మరియు సేవలు అందించబడుతున్నాయి మరియు బ్రాండ్ మార్గదర్శక సూత్రాలు లేదా ప్రతి విక్రేతకు వర్తించే ఇతర నియమాలు, షరతులు ప్రకారం మారవచ్చు. వర్తించే చట్టాలు అనుమతించిన విధంగా మరియు ప్లాట్ ఫాం ఆమోదించిన విధంగా అలాంటి చెల్లింపు సదుపాయాలను ఉపయోగిస్తూ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి విక్రేతతో చట్టబద్ధంగా కట్టుబడటం ద్వారా మరియు అమలుచేయదగిన ఒప్పందాన్ని యూజర్ కుదుర్చుకుంటున్నారని ,లావాదేవీని ఆరంభించడం ద్వారా, యూజర్ లు హామీ ఇస్తున్నారు.

17.2 అన్ని చెల్లింపులు మరియు డెలివరీకి సంబంధించిన షరతులు అనేవి ఉత్పత్తులు యొక్క విక్రేత మరియు వాటిని కొనుగోలు చేసే యూజర్ లు మధ్య సూచించబడిన ఒప్పందపరమైన సంబంధానికి అనుగుణంగా ఉంటాయి మరియు యూజర్ పూర్తి చేసిన కొనుగోలును సమన్వయం చేయడానికి ప్లాట్ ఫాం కేటాయించిన చెల్లింపు సదుపాయాన్ని కేవలం యూజర్ మరియు ఉత్పత్తి యొక్క విక్రేత మాత్రమే ఉపయోగిస్తారు.

17.3 ఉత్పత్తులు యొక్క రిటర్న్ మరియు ఎక్స్ ఛేంజ్ మీరు మరియు విక్రేత మధ్య ఉంటాయి. విక్రేత యొక్క రిటర్న్ మరియు ఎక్స్ ఛేంజ్ పాలసీ విక్రేత ద్వారా లోపభూయిష్టమైన మరియు తప్పుగా డెలివరీ చేయబడిన ఉత్పత్తులు కోసం వర్తిస్తుంది. ఏవైనా లోపభూయిష్టమై మరియు తప్పుగా డెలివరీ చేయబడిన ఉత్పత్తి కోసం జోష్ మీకు లేదా ఏదైనా మూడవ పక్షానికి బాధ్యతవహించదు.

17.4 ప్లాట్ ఫాం నుండి కొనుగోలు చేసిన అన్ని ఉత్పత్తులు విక్రేతచే లాజిస్టిక్స్ భాగస్వామి లేదా విక్రేతలు ద్వారా ప్రామాణిక కొరియర్ సర్వీస్ తో యూజర్ కు డెలివరీ చేయబడతాయి. వర్తించే చోట అన్ని డెలివరీలు ఉత్తమమైన ప్రయత్నాలు ఆధారంగా జరుగుతాయి మరియు తెలియచేసిన తేదీలలో ఉత్పత్తులను డెలివరీ చేయడానికి విక్రేత ప్రయత్నిస్తాడు, ఈ విషయంలో తలెత్తిన ఏదైనా జాప్యం వలన కలిగిన క్లెయిమ్స్ లేదా బాధ్యతలను ప్లాట్ ఫాం నిరాకరిస్తుంది.

17.5 ఉత్పత్తులను డెలివరీ చేయడంలో కలిగే ఆలస్యానికి ప్లాట్ ఫాం/జోష్ లు బాధ్యతవహించవు. లాజిస్టిక్స్ భాగస్వామి తప్పుగా నిర్వహించడం వలన ప్రయాణంలో ఉత్పత్తికి హాని కలిగించే ప్లాట్ ఫాం బాధ్యతవహించదు.

18. గోప్యత

ప్లాట్ ఫాంను యాక్సెస్ చేసేటప్పుడు, పొందేటప్పుడు మరియు /లేదా ఉపయోగించేటప్పుడు వెర్సే మీ యొక్క వ్యక్తిగత సమాచారం మరియు డేటాను సేకరించవచ్చు. సేకరించబడిన అలాంటి సమాచారం కేవలం ప్లాట్ ఫాం యొక్క పనితీరుకు మాత్రమే వర్తిస్తుంది. వెర్సే సేకరించి యూజర్ సమాచారం అంతా వెర్సే వ్యాపార అసోసియేట్స్ (భాగస్వాములు, ప్రకటనదారులు, కాంట్రాక్టర్స్ సహా అయితే వారికి మాత్రమే పరిమితం కాకుండా మొదలైన వారు) మరియు అనుబంధ సంస్థలతో పంపిణీ చేయబడుతుంది మరియు భాగస్వామ్యం చేయబడుతుందని మీరు అర్థం చేసుకున్నారు మరియు ఆమోదించారు. ఈ క్రింది లింక్ అనుసరించడం ద్వారా మీరు వెర్సే గోప్యతా పాలసీని చదవవచ్చు : గోప్యతా పాలసీ (గోప్యతా పాలసీ పేజీకి లింక్)

మేము మీ గోప్యత యొక్క రక్షణను ఎంతో తీవ్రంగా పరిగణన చేసాము, కాబట్టి సమాచారం సాంకేతిక చట్టం 2000 మరియు దానికి సంబంధించి అక్కడ ఉన్న నియమాలు ద్వారా ఆదేశించబడిన విధంగా డేటా రక్షణ మరియు భద్రతా చర్యలు యొక్క ఉన్నతమైన ప్రామాణాలతో మీ అకౌంట్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మేము ఒప్పందం చేసుకున్నాము . మా ప్రస్తుత గోప్యతా పాలసీ ఇక్కడ అందుబాటులో ఉంది.

19. నష్టపరిహారం

ప్లాట్ ఫాంను మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగించడం నుండి వచ్చిన ఫలితంగా లేదా దానికి అనుషంగికంగా లేదా దాని వలన కలిగిన ఖర్చులు, న్యాయవాది ఫీజు సహా అన్ని నష్టాలు, వ్యయాలు, బాధ్యతలు నుండి మరియు వ్యతిరేకంగా వెర్సే మరియు దాని అనుబంధ సంస్థలు, వాటి అధికారులు, డైరక్టర్స్, ఉద్యోగులను హానిరహితంగా ఉంచుతానని మరియు మద్దతు చేస్తానని, నష్టపరిహారం చెల్లిస్తానని మీరు అంగీకరించారు. సహేతుకమైన ప్రయత్నాలు చేసినా కూడా ప్లాట్ ఫాం ద్వారా మీరు పొందిన కంటెంట్ కోసం వెర్సే ఎలాంటి బాధ్యత తీసుకోదు లేదా నియంత్రించదు.

20. బాధ్యత లేదు

వర్తించే చట్టం అనుమతించిన గరిష్ట పరిధి మేరకు, వెర్సే లేదా దాని అనుబంధ సంస్థలు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా, అనుషంగికంగా, శిక్షార్హమైన, ప్రత్యేకమైన లేదా పరిణామాత్మకమైన నష్టాలు కోసం, లేదా ఇతర సమాచారం, వ్యాపారం అంతరాయానికి, వ్యక్తిగత గాయానికి, గోప్యత నష్టానికి, సహేతుకమైన సంరక్షణ లేదా మంచి విశ్వాసం సహా విధి నిర్వహణలో విఫలమవడం, నిర్లక్ష్యానికి, ఏదైనా ఇతర డబ్బుకు సంబంధించిన లేదా ఏదో విధంగా వాడకానికి సంబంధించి లేదా దాని నుండి తలెత్తిన నష్టానికి లేదా ప్లాట్ ఫాంను వినియోగించలేని అసమర్థతకు మరియు దాని నుండి తలెత్తిన నష్టం లేదా హాని లేదా వెర్సేలేదా దాని అనుబంధ సంస్థల నియంత్రణలో లేని భగవంతుడు లేదా మూడవ పక్షానికి చెందిన చర్యలకు సంబంధించి బాధ్యతవహించరు.

యూజర్ కేటాయించిన డేటా కోసం ప్రత్యక్ష లేదా పరోక్ష హాని కోసం లేదా మూడవ పక్షానికి చెందిన హక్కులను ఏవైనా ఉల్లంఘించినప్పుడు, దాని నుండి తలెత్తే లేదా ప్లాట్ ఫాంను వినియోగించడం లేదా వినియోగించలేకపోవడానికి సంబంధించి వెర్సే లేదా దాని అనుబంధ సంస్థలు బాధ్యతవహించవు.

ఎట్టి పరిస్థితిలో కూడా వెర్సే ప్లాట్ ఫాంకు సంబంధించిన అన్ని క్లెయిమ్స్ ను రూ. 5000/- (అయిదు వేల రూపాయలు మాత్రమే) కి మించిన బాధ్యతవహించదు. బాధ్యత యొక్క ఈ పరిమితి మీకు మరియు వెర్సేకు మద్య ఉన్న సంబంధం పై ఆధారపడింది మరియు వెర్సే లేదా దాని అనుబంధ సంస్థలకు అలాంటి నష్టం జరిగే అవకాశం గురించి చెప్పబడినప్పటికీ, ఈ పరిష్కారాలు తమ ప్రధానమైన లక్ష్యాన్ని విఫలమైనా కూడా మరియు బాధ్యత యొక్క అన్ని క్లెయిమ్స్ కు వర్తిస్తుంది (ఉదా. వారంటీ, నిర్లక్ష్యం, ఒప్పందం, చట్టం, అన్యాయం).

21. వేరుచేయబడటం

ఈ ఒప్పందంలో ఏదైనా నిబంధన చెల్లనిదిగా మారినా లేదా అనధికారమైనా లేదా అమలుచేయబడలేదని నిర్ణయించబడినా, ఆ నిబంధన ఈ ఒప్పందం నుండి వేరు చేయబడినట్లుగా భావించబడుతుంది మరియు ఈ ఒప్పందం యొక్క తక్కిన నిబంధలు సాధ్యమైనంత వరకు వేరుచేయబడిన ప్రభావానికి గురి కావు.

22. మాఫీ

ఈ ఒప్పందం యొక్క నిబంధనలలో వేటినైనా వెర్సే ఏ సమయంలోనైనా అమలుచేయడంలో విఫలమవడం తన హక్కు, అధికారం, ప్రత్యేకమైన సదుపాయం లేదా పరిష్కారం లేదా ఈ ఒప్పందం పై మీ యొక్క బాధ్యత ఇంతకు ముందు లేదా తరువాత ఉల్లంఘనకు మాఫీగా భావించరాదు లేదా ఏదైనా హక్కు లేదా , అధికార సదుపాయం లేదా పరిష్కారం యొక్క ఏదైనా ఒకటి లేదా పాక్షిక అమలు ఈ ఒప్పందంలో అందించబడిన అటువంటి లేదా ఏదైనా ఇతర హక్కు, అధికార హక్కు లేదా పరిష్కారం యొక్క ఏదైనా ఇతర లేదా మరింత అమలు చేయడాన్ని నిరోధించదు , ఇవన్నీ అనేకమైనవి మరియు సంచితమైనవి మరియు ఒకదానికొకటి ప్రత్యేకమైనవి కావు లేకపోతే ఈక్విటీలో లేదా వెర్సేకి చట్టంలో అందుబాటులో ఉండే ఏవైనా హక్కులు లేదా పరిష్కారాలు .

23.ఊహించని పరిస్థితి మరియు మూడవ పక్షాల చర్య

వెర్సే లేదా దాని అనుబంధ సంస్థలు యొక్క ఈ సేవా నియమాలు లేదా ఇతర పాలసీలలో ఏదైనా విభాగం యొక్క పనితీరు ఊహించని ఘటనలు జరిగినప్పుడు (భగవంతుని చర్యలు, ప్రజా శతృవు, మహమ్మారి, అంటు వ్యాధులు, విప్లవం, సమ్మెలు, ఆందోళనలు, తీవ్రవాదుల దాడి, అగ్ని ప్రమాదం, వరదలు, యుద్ధం, టైఫూన్ మరియు ప్రభుత్వం యొక్క ఏదైనా నిబంధన లేదా సమర్థవంతమైన చట్టబద్దమైన లేదా న్యాయబద్ధమైన సంస్థ యొక్క లేదా ప్రభుత్వానికి చెందిన ఏదైనా ఆదేశం సహా అయితే దానికి మాత్రమే పరిమితం కాకుండా) , లేదా వెర్సే యొక్క సహేతుకమైన నియంత్రణలో లేని ఏదైనా ఇతర కారణం, లేదా హ్యాకింగ్, డేటా దొంగతనం, యూజర్ అకౌంట్ లో అనధికారంగా ప్రవేశించడం, మోసం, ఇంకొక వ్యక్తి వలే నటించడం, తప్పుడు ప్రాతినిధ్యం మొదలైన వాటితో సహా అయితే వాటికి మాత్రమే పరిమితం కాకుండా వర్సే నియంత్రణలో లేని మూడవ పక్షం చర్య వలన క్షమించబడుతుంది.

24.ఈ ఒప్పందం యొక్క సవరణ

ఈ ఒప్పందంలోని ఏ భాగాన్నైనా మరియు /లేదా గోప్యతా పాలసీని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడానికి, సవరణ లేదా రద్దు చేయడానికి వెర్సేకు హక్కు ఉందని మీరు ఇందుమూలంగా అంగీకరిస్తున్నారు, బాధ్యతవహిస్తున్నారు మరియు నిర్థారిస్తున్నారు. అలాంటి సవరించబడిన ఒప్పందం మరియు /లేదా గోప్యతా పాలసీలు అలాంటి అప్ డేట్ తేదీ లేదా సవరణ లేదా రద్దు నుండి అమలవుతుంది. ఒప్పందంలోని ఏవైనా మార్పులతో మీరు ఏకీభవించకపోతే, మీరు ప్లాట్ ఫాంను అన్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా ప్లాట్ ఫాంను వినియోగించడానికి లేదా యాక్సెస్ చేయడాన్ని మీరు ఆపివేయవచ్చు. ఒప్పందంలో మరియు /లేదా పాలసీలలో (గోప్యతా పాలసీ, కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలుసహా) మార్పులు చేసిన తరువాత మీరు ప్లాట్ ఫాంను నిరంతరంగా వినియోగించడం లేదా యాక్సెస్ చేయడం లేదా పొందడం అనేవి మీరు మార్పులను ఆమోదించడం మరియు గుర్తించడాన్ని సూచిస్తుంది మరియు మీరు సవరించబడిన ఒప్పందం మరియు /లేదా పాలసీలకు మీరు కట్టుబడి ఉంటారని మీరు ఇందుమూలముగా అంగీకరిస్తున్నారు, బాధ్యతవహిస్తున్నారు మరియు నిర్థారిస్తున్నారు.

25. నియంత్రించే చట్టం

25.1 ఒప్పందం భారతదేశ భూ భాగంలో చట్టాలు ద్వారా నియంత్రించబడుతూ ప్రస్తుతం అమలులో ఉంది మరియు బెంగళూరులోని న్యాయస్థానాలకు మాత్రమే ఈ ఒప్పందానికి సంబంధించిన విషయాలలో ప్రత్యేకమైన న్యాయ పరిధి ఉంది.

25.2 ఈ ఒప్పందం ద్వారా లేదా దాని సంబంధంలో తలెత్తిన అన్ని వివాదాలు ఏకైక మధ్యవర్తికి సూచించబడవచ్చు. ఇండియన్ ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్ చట్టం, 1996 (ద "యాక్ట్") ద్వారా నిర్దేశించబడిన సమయంలో ఏకైక మధ్యవర్తిని నియామకం చేయడానికి పక్షాలు అంగీకరించకపోతే, ఏకైక మధ్యవర్తిని నియామకం చేయడానికి చట్టం ద్వారా సమర్థవంతమైన న్యాయస్థానాన్ని పక్షాలు సంప్రదించవచ్చు. చట్టానికి అనుగుణంగా మరియు రూపొందించబడిన నియమం ప్రకారం  మధ్యవర్తిత్వం యొక్క ప్రొసీడింగ్స్ నిర్వహించబడతాయి మరియు మధ్యవర్తిత్వం ప్రదేశం/సీట్ బెంగళూరులో ఉంటుంది. మధ్యవర్తిత్వం ప్రొసీడింగ్స్ ఇంగ్లిష్ లో నిర్వహించబడతాయి.

26. నోటీసు

ప్లాట్ ఫాం ద్వారా యాక్సెస్ చేయదగిన కంటెంట్ లేదా ప్రకటనలు కోసం వెర్సే బాధ్యతవహించదని ప్రత్యేకించి నోటీసు ఇవ్వబడింది. మూడవ పక్షానికి చెందిన హక్కులు ఉల్లంఘించబడ్డాయని క్లెయిమ్ చేయబడిన కంటెంట్ ను తొలగించడానికి మరియు /లేదా యాక్సెస్ ను ఆపుచేయడానికి వెర్సే తన స్వంత నిర్ణయాధికారం మేరకు తన హక్కును వినియోగించగలదు మరియు /లేదా వెర్సే మరియు /లేదా ఇతర మూడవ పక్షాలకు చెందిన మేథో సంపత్తి లేదా ఇతర హక్కులను ఉల్లంఘించిన ప్లాట్ ఫాం యూజర్స్ యొక్క అకౌంట్స్ ను రద్దు చేయగలదు.

27. ఫిర్యాదు పరిష్కారం యంత్రాంగం

ఫిర్యాదులతో వ్యవహరించడానికి వెర్సే ఈ క్రింది యంత్రాంగాన్ని అమలు చేసింది:

సేవా నియమాలు , గోప్యతా విధానం మరియు కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలకు సంబంధించిన ఫిర్యాదులు లేదా ఆందోళనల ఉల్లంఘనలను "రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్" కు పంపించాలి. grievance.officer@myjosh.in ఈమెయిల్ ద్వారా రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ ను సంప్రదించవచ్చు లేదా ఈ క్రింద 26లో ఇచ్చిన విధంగా మెయిల్ కు పంపించవచ్చు. ఫిర్యాదును పరిష్కరించడానికి వెర్సేకు అవసరమైన విధానంలో అలాంటి సమాచారం ఫిర్యాదులో ఉండాలి.

డేటా భద్రత, గోప్యత మరియు ప్లాట్ ఫాంకు సంబంధించిన ఇతర వాడకపు ఆందోళనలకు సంబంధించిన మీ విచారాలను పరిష్కరించడానికి వెర్సేకు గ్రీవెన్స్ ఆఫీసర్ ఉన్నారు.

మీరు సంప్రదించవచ్చు

పరిధి

పేరు/శీర్షిక

ఈమెయిల్-ఐడీ

ఫిర్యాదు పరిష్కారం కోసం

గ్రీవెన్స్ అధికారి శ్రీ. నాగరాజ్

grievance.officer@myjosh.in

చట్టాన్ని అమలు చేసే సమన్వయం కోసం

నోడల్ అధికారి శ్రీ. సునీల్ కుమార్ డీ

nodal.officer@myjosh.in

నిబంధనల అనుసరణ కోసం

కాంప్లియెన్స్ ఆఫీసర్

compliance.officer@myjosh.in

ప్లాట్ ఫాం పై ప్రచురించిన కంటెంట్ లేదా ప్రకటన ద్వారా బాధపడిన వ్యక్తి/సంస్థ అలాంటి కంటెంట్ లేదా ప్రకటన పై ఫిర్యాదు నమోదు చేయవచ్చు. బాధిత వ్యక్తి/సంస్థ యొక్క న్యాయవాది, ఏజెంట్ లేదా చట్టబద్ధమైన వారసులు అలాంటి కంటెంట్ పై ఫిర్యాదు నమోదు చేయవచ్చు లేదా ఫిర్యాదు నేర తరగతికి చెందిన పరిధిలో లేనట్లయితే, కంటెంట్ లేదా ప్రకటనతో బాధపడని లేదా ఆసక్తి లేని సంబంధం లేని వ్యక్తి /సంస్థ ప్రకటన లేదా కంటెంట్ గురించి చెల్లుబాటయ్యే ఫిర్యాదు చేయలేరు. మీరు బాధిత పక్షానికి చెందిన ఏజెంట్ లేదా న్యాయవాది అయితే, బాధిత పక్షం తరపున ఫిర్యాదు నమోదు చేసే మీ హక్కును సమర్థించే మీరు డాక్యుమెంట్స్ ప్రూఫ్ సమర్పించవలసిన అవసరం ఉంది,

28. ఫిర్యాదు మరియు తొలగింపు ప్రక్రియ

28.1 మీరు కంటెంట్ పై ఫిర్యాదు నమోదు చేస్తే, మీరు ఈ క్రింది సమాచారం కేటాయించాలి:

  • మీరు ఫిర్యాదును నమోదు చేయడంలో మీ ఆసక్తి
  • ఫిర్యాదు స్వభావం
  • ఫిర్యాదు నమోదు చేయబడిన కంటెంట్/ప్రకటన యొక్క వివరాలు ( ప్రచురణ తేదీ/పేరు /కంటెంట్ కు లింక్)
  • కంటెంట్/ప్రకటనతో బాధిత పక్షానికి గల సంబంధం
  • బాధ ఎలా కలిగింది విషయం గురించి ఖచ్చితమైన వాస్తవాలు
  • మీరు కోరుకుంటున్న పరిష్కారాలు
  • ఫిర్యాదు వివరాలు (ఫిర్యాదు యొక్క వివరణ)
  • ఫిర్యాదును నమోదు చేసే వ్యక్తి యొక్క వివరాలు (మీరు)
  • బాధిత పక్షం వివరాలు
  • సమాచారం వివరాలు
  • వర్తిస్తే, డాక్యుమెంట్స్ ప్రూఫ్

వెర్సేకు పంపించే అన్ని నోటీసులు రాతపూర్వకంగా ఉండాలి మరియు వ్యక్తిగతంగా డెలివరీ చేయబడితే లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ద్వారా పంపించబడితే , వాపసు రసీదు అభ్యర్థించబడితే లేదా ఈ క్రింది చిరునామాకు ఫాసిమైల్ చేయబడితే లేదా ఈ క్రింది ఈమెయిల్ కు ఈమెయిల్ చేయబడితే తగిన విధంగా ఇవ్వబడుతుంది

ఐడీ: grievance.officer@myjosh.in

వెర్సే ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్

11వ అంతస్థు, వింగ్ ఈ, హెలియోస్ బిజినెస్ పార్క్,

అవుటర్ రింగ్ రోడ్, కడుబీసనహళ్లి,

బెంగళూరు - 560103, కర్ణాటక, భారతదేశం

grievance.officer@myjosh.in

26.2 తొలగింపు ప్రక్రియ

ఈ ప్లాట్ ఫాంను వెర్సే ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ("వెర్సే") ఆపరేట్ చేస్తోంది, మరియు ప్లాట్ ఫాంకు సంబంధించిన అన్ని హక్కులు వెర్సేకు ఉన్నాయి. ఈ మార్గదర్శక సూత్రాలు యూజర్ ఉత్పన్నం చేసిన కంటెంట్ లేదా ప్లాట్ ఫాం పై ప్రదర్శించబడిన లేదా ప్రసారం చేయబడిన ఏదైనా ఇతర కంటెంట్ పై చేసిన ఫిర్యాదును నివేదించడం, దర్యాప్తు మరియు పరిష్కారంతో వ్యవహరిస్తాయి. ఈ మార్గదర్శక సూత్రాలు ఫిర్యాదును నమోదు చేయడానికి సంబంధించిన సూచనలను కూడా అందిస్తాయి. ప్లాట్ ఫాం పై ప్రదర్శించబడిన ప్రకటన లేదా కంటెంట్ పై ఫిర్యాదును ఏ విధంగా దాఖలు చేయాలో అర్థం చేసుకోవడానికి వ్యక్తికి ఫిర్యాదు ("మీరు") దాఖలు చేయడంలో సహాయపడటానికి, మీ ఫిర్యాదుతో వెర్సే ఏ విధంగా వ్యవహరిస్తుంది మరియు ప్లాట్ ఫాం పై ప్రదర్శించబడిన కంటెంట్ మరియు ప్రకటనకు సంబంధించిన చట్టబద్ధమైన ఆవశ్యకతలు ఈ మార్గదర్శకసూత్రాలు ఇవ్వబడ్డాయి. ఈ మార్గదర్శక సూత్రాల లక్ష్యం కోసం, వెర్సేకు చేసే ఏవైనా సూచనలలో దాని అనుబంధ సంస్థలు, మాతృ సంస్థలు, సోదరి సంస్థలు కూడా ఉంటాయి.

కావల్సిన సమాచారంతో మీరు "తొలగింపు అభ్యర్థన" విషయంతో grievance.officer@myjosh.inకు ఈమెయిల్ పంపించవచ్చు. ఈ క్రింది చిరునామాకు కావలసిన సమాచారంతో తపాలా ద్వారా కూడా మీరు ఫిర్యాదులు /నోటీసులు పంపించవచ్చు:

శ్రీ . నాగరాజ్

గ్రీవెన్స్ ఆఫీసర్,

వెర్సే ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్

11వ అంతస్థు, వింగ్ ఈ, హెలియోస్ బిజినెస్ పార్క్,

అవుటర్ రింగ్ రోడ్, కడుబీసనహళ్లి,

బెంగళూరు- 560103, కర్ణాటక, భారతదేశం

ఫిర్యాదు వ్యవస్థ :

ఫిర్యాదు కోసం లేదా యూజర్ ఎదుర్కొంటున్న ఏదైనా ఇతర సమస్యను ఈ క్రింది చిరునామాకు ఈమెయిల్ చేయవచ్చు. ఫిర్యాదు ఈ విషయాలు పేర్కొనాలి : (i) మా ప్లాట్ ఫాం నుండి సంబంధిత ఖాతాదారు యొక్క యూజర్ నేమ్ ( ii) నిర్దేశిత కంటెంట్ /వీడియో నంబర్ లేదా url లేదా సంబంధిత లింక్ మరియు ( iii) అలాంటి తొలగింపు అభ్యర్థన చేయడానికి గల కారణాలు

సమాచారం సాంకేతికత చట్టం 2000 మరియు అక్కడ చేసిన సమాచారం సాంకేతికత (ఇంటర్మీడియేటరి గైడ్ లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021 నియమాలు ప్రకారం, ఫిర్యాదు వ్యవస్థను సంప్రదించవలసిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

శ్రీ. నాగరాజ్

ఈమెయిల్ : grievance.officer@myjosh.in

ఫిర్యాదు పత్రం, ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా మీరు ఆరంభించిన ఏవైనా మరియు అన్ని ఫిర్యాదులు ఈ మార్గదర్శక సూత్రాలు ప్రకారం దర్యాప్తు చేయబడతాయి మరియు వ్యవహరించబడతాయి. వెర్సే పై లేదా ప్లాట్ ఫాం పై ప్రదర్శించబడిన /ప్రసారం చేయబడిన ఏదైనా కంటెంట్ పై ఇచ్చిన ఏదైనా చట్టబద్ధమైన నోటీసు లేదా తీసుకున్న ఏదైనా ఇతర చట్టబద్ధమైన చర్య ఈ మార్గదర్శక సూత్రాలలోని ఏవైనా నియమాలకు లోబడి ఉండదు.

ఈ మార్గదర్శక సూత్రాలు లక్ష్యం కోసం, 'కంటెంట్' అంటే ఏవైనా మరియు అన్ని వార్తలు, వీడియోలు, చిత్రాలు, యూజర్ ఉత్పన్నం చేసిన కంటెంట్, స్పాన్సర్ చేయబడిన కంటెంట్ లేదా ప్రదర్శించబడిన లేదా ప్రసారం చేయబడిన ఏదైనా ఇతర కంటెంట్ లేదా ప్లాట్ ఫాం లేదా అక్కడ ఉన్న భాగం పై ప్రజలకు తెలియచేయబడిన కంటెంట్ అని అర్థం.

ఈ మార్గదర్శకాల లక్ష్యం కోసం, 'ప్రకటన' అంటే ప్లాట్ ఫాం పై లేదా అక్కడ ఉన్న ఏదైనా భాగం పై ప్రదర్శించబడిన లేదా ప్రసారం చేయబడిన ఏదైనా మద్దతు, ప్రకటన లేదా ప్రోత్సాహ మెటీరియల్ అని అర్థం.

తన స్వంత నిర్ణయాధికారం మేరకు వెర్సే ఈ మార్గదర్శక సూత్రాలను ఏ సమయంలోనైనా సవరించవచ్చు కాబట్టి, వెర్సేకు ఏదైనా కంటెంట్ లేదా ప్రకటన గురించి మీరు ఫిర్యాదు పంపించడానికి /నమోదు చేయడానికి ముందు ప్రతిసారీ చాలా జాగ్రత్తగా ఈ మార్గదర్శకసూత్రాలను చదవవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం.

ఎవరు ఫిర్యాదు నమోదు చేయగలరు?

ప్లాట్ ఫాం పై ప్రచురించబడిన ప్రకటన లేదా కంటెంట్ ద్వారా బాధకు గురైన వ్యక్తి /సంస్థ అలాంటి కంటెంట్ లేదా ప్రకటన గురించి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. బాధిత వ్యక్తి/సంస్థ యొక్క న్యాయవాది, ఏజెంట్ లేదా చట్టబద్ధమైన వారసులు అలాంటి కంటెంట్ పై ఫిర్యాదు నమోదు చేయవచ్చు లేదా ఫిర్యాదు నేర తరగతికి చెందిన పరిధిలో లేనట్లయితే, కంటెంట్ లేదా ప్రకటనతో బాధపడని లేదా ఆసక్తి లేని సంబంధం లేని వ్యక్తి /సంస్థ ప్రకటన లేదా కంటెంట్ గురించి చెల్లుబాటయ్యే ఫిర్యాదు చేయలేరు. మీరు బాధిత పక్షానికి చెందిన ఏజెంట్ లేదా న్యాయవాది అయితే, బాధిత పక్షం తరపున ఫిర్యాదు నమోదు చేసే మీ హక్కును సమర్థించే మీరు డాక్యుమెంట్స్ ప్రూఫ్ సమర్పించవలసిన అవసరం ఉంది.

మీరు బాధిత పక్షానికి చెందిన ఏజెంట్ లేదా న్యాయవాది అయితే, బాధిత పక్షం తరపున ఫిర్యాదు నమోదు చేయడానికి మీకు గల హక్కును సమర్థించే డాక్యుమెంట్స్ ప్రూఫ్ మీరు సమర్పించాలి.

ఫిర్యాదులో మీరు ఏ సమాచారం కేటాయించవలసిన అవసరం ఉంది?

మీరు కంటెంట్ గురించి ఫిర్యాదు నమోదు చేస్తుంటే, మీరు ఈ క్రింది సమాచారం కేటాయించాలి:

  • ఫిర్యాదు నమోదు చేయడంలో మీకు గల ఆసక్తి
  • ఫిర్యాదు స్వభావం
  • నమోదు చేయబడిన ఫిర్యాదుకు సంబంధించిన కంటెంట్ /ప్రకటన వివరాలు ( కంటెట్ కు శీర్షిక లింక్)
  • కంటెంట్/ప్రకటనతో బాధిత పక్షానికి గల సంబంధం
  • బాధ ఎలా కలిగించింది గురించి ఖచ్చితమైన వాస్తవాలు
  • మీరు కోరుకుంటున్న పరిష్కారాలు
  • ఫిర్యాదు యొక్క వివరాలు (ఫిర్యాదు యొక్క వివరణ)
  • ఫిర్యాదును నమోదు చేసే వ్యక్తి యొక్క వివరాలు (మీరు)
  • బాధిత పక్షం వివరాలు
  • సమాచారం వివరాలు
  • వర్తిస్తే, డాక్యుమెంట్స్ ప్రూఫ్ ( ఈ క్రింద చర్చించబడినవి)

ఫిర్యాదు పత్రం లేదా ఈమెయిల్ ద్వారా మీరు ఫిర్యాదు నమోదు చేసిన విషయంతో సంబంధం లేకుండా, పైన చెప్పిన పూర్తి సమాచారం, ఫిర్యాదులో ఉండేలా మీరు నిర్థారించాలి. ఫిర్యాదు నుండి కావలసిన సమాచారం ఏదైనా లేకపోతే, ఫిర్యాదు అసంపూర్ణంగా ఉందని పరిగణన చేయబడుతుంది వెర్సే ఫిర్యాదు గురించి ఎలాంటి చర్య తీసుకోదు లేదా ఫిర్యాదును పరిగణన చేయదు.

'ఫిర్యాదు స్వభావం' అంటే ఏమిటి మరియు ఇది దేనికి సంబంధించినది?

'ఫిర్యాదు స్వభావం'కు సంబంధించిన సమాచారం ఫిర్యాదు యొక్క విషయాన్ని నియంత్రించే చట్టబద్ధమైన ఏర్పాట్లు ఆధారంగా వర్గీకరించబడుతుంది. ప్లాట్ ఫాం పై ప్రచురించబడిన ఏదైనా కంటెంట్ లేదా ప్రకటన పై చేసిన మీ ఫిర్యాదుతో, ఫిర్యాదు స్వభావాన్ని నిర్దేశించే వివిధ ఆప్షన్స్ ను వెర్సే కేటాయించింది. పత్రంలో అందచేసిన ప్రతి తరగతి గురించి క్లుప్తంగా ఈ క్రింద వర్ణించబడింది:

కాపీరైట్ ఉల్లంఘన: ఏ కంటెంట్/ ప్రకటనైనా కాపీరైట్, పెర్ఫార్మర్ హక్కులు లేదా బాధిత పక్షం యొక్క ప్రచారం హక్కులను ఉల్లంఘించిన కంటెంట్ /ప్రకటన. దీనిలో బాధిత పక్షం సృష్టించిన/సొంతం చేసుకున్న కంటెంట్ ను దాని అనుమతి లేకుండా ప్రదర్శించడం భాగంగా ఉంది.

ట్రేడ్ మార్క్ ఉల్లంఘన: బాధిత పక్షం యొక్క ట్రేడ్ మార్క్ హక్కులను ఉల్లంఘించిన కంటెంట్ /ప్రకటన లేదా ట్రేడ్ మార్క్ చట్టాలు ద్వారా రక్షించబడుతున్న ఏదైనా పదం, లోగో లేదా ఇతర ప్రాతినిధ్యం అనధికార వినియోగం/ప్రదర్శన.

గోప్యతలో చొరబడటం: ప్రైవేట్ గా ఉన్న సమాచారం, చిత్రం, టెక్ట్స్ లేదా ఏదైనా ఇతర కంటెంట్ లేదా లేకపోతే మూడవ పక్షానికి చెందిన గోప్యతా హక్కులను ఉల్లంఘించే కంటెంట్ /ప్రకటన.

పరువు నష్టం: తప్పుగా ఉన్న ఏదైనా సమాచారం ఉన్న కంటెంట్ /ప్రకటన మరియు 1) బాధిత పక్షం యొక్క ప్రతిష్ట లేదా సమాజంలో ఉన్న పేరు, ప్రతిష్టలకు హాని కలిగించేది లేదా 2)లేకపోతే బాధిత పక్షం గురించి సాధారణ ప్రజలు ఏ విధంగా భావించారు విషయం పై వ్యతిరేక ప్రభావం కలిగి ఉండటం.

తప్పుడు/తప్పుదోవ పట్టించేది: తప్పుగా లేదా అసంపూర్ణంగా ఉన్న కంటెంట్ /ప్రకటన మరియు ఏదో తప్పు అని ప్రజలు విశ్వసించేలా వారిని తప్పుదోవ పట్టించడం, లేదా ఒక సంస్థ , సంఘటన లేదా వస్తువు గురించి ప్రజల అభిప్రాయాన్ని తప్పుగా మార్చే కంటెంట్/ప్రకటన.

అశ్లీలమైన/కుంభకోణం కంటెంట్ : ఏదైనా కంటెంట్/ప్రకటనలో ఏదైనా టెక్ట్స్, చిత్రం, వీడియో, ఆడియో లేదా ఏదైనా ఇతర ప్రాతినిధ్యం అసహ్యకరంగా, నిరాడంబరానికి అభ్యంతరకరమైనవి, అసభ్యకరమైనవి, అనైతిక లేదా అసభ్యకరమైనవి మరియు చూసేవారి మనస్సులను పాడు చేసేవి లేదా చెడగొట్టేవి.

కంటెంట్ మతపరమైన మనోభావాలకు బాధ కలిగించాయి లేదా హింసను ప్రేరేపించాయి: కంటెంట్, ప్రకటనలో ఉన్న చిత్రం, టెక్ట్స్ లేదా బాధిత పక్షం యొక్క మతపరమైన విశ్వాసాలు లేదా మనోభావాలకు బాధ కలిగించే ఏదైనా ఇతర కంటెంట్ లేదా ప్రజలలో ప్రత్యక్షంగా ప్రేరేపించే లేదా హింసను ప్రేరేపించేవి. ద్వేషపూరితమైన ప్రసంగం, ఉన్న కంటెంట్/ప్రకటన, ప్రభుత్వం లేదా ఏదైనా మతం లేదా మతపరమైన సంస్థ పా తిరుగుబాటును ప్రేరేపించే కంటెంట్ కూడా ఈ తరగతి క్రింద నివేదించబడవచ్చు.  

ఈ తరగతులు అన్నింటితో పాటు, "లేకపోతే అనధికారం" పేరుతో మరొక బహిరంగ తరగతి ఫిర్యాదు పత్రంలో ఇవ్వబడింది. ఫిర్యాదులో సమస్య తలెత్తితే పైన చెప్పిన తరగతులు క్రింద యోగ్యమైనది కాదు అప్పుడు మీరు ఫిర్యాదు స్వభావంగా దీనిని ఎంచుకోవచ్చు మరియు క్లుప్తంగా ప్రతిపాదించిన సమస్యను వేరుగా పేర్కొనవచ్చు.

మీరు కేవలం ఒక తరగతిని మాత్రమే ఎంచుకోవాలి. ఫిర్యాదు పైన చెప్పిన తరగతులలో ఒక దాని కంటే ఎక్కువ తరగతుల పరిధిలో ఉంటే ఫిర్యాదు యొక్క ప్రతి తరగతి కోసం మీరు వేరుగా ఫిర్యాదు చేయవచ్చు మరియు ఫిర్యాదును నిరూపించడానికి కావలసిన అన్ని డాక్యుమెంట్స్ తో పాటు వాస్తవాలు మరియు ఫిర్యాదు యొక్క నిర్దిష్టమైన వర్ణనను కేటాయించాలి. ఒక కంటెంట్ /ఫిర్యాదు పై మీరు ఒకటి కంటే ఫిర్యాదు చేసినట్లయితే, ఫిర్యాదును ప్రభావవంతంగా నిర్వహించడానికి అదే కంటెంట్ కు సంబంధించిన తదుపరి ఫిర్యాదులలో మీ యొక్క ఇంతకు ముందున్న ఫిర్యాదు ఐడీని మీరు పేర్కొనవలసి ఉంది.

ఫిర్యాదుతో పాటు కావలసిన డాక్యుమెంటరీ సాక్ష్యం ఏమిటి ?

ఫిర్యాదు మరియు విచారం స్వభావాన్ని బట్టి డాక్యుమెంటరీ ప్రూఫ్ మారవచ్చు. వివిధ రకాల ఫిర్యాదు స్వభావాలు కోసం తగినవిగా ఉన్న డాక్యుమెంటరీ సాక్ష్యాలకు ఈ క్రింద కొన్ని ఉదాహరణలు ఇవ్వబడినవి:

కాపీరైట్ ఉల్లంఘన: బాధిత పక్షం హక్కులకు ప్రూఫ్ మరియు ఉల్లంఘన యొక్క ప్రూఫ్.

ట్రేడ్ మార్క్ ఉల్లంఘన: ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఉల్లంఘన యొక్క ప్రూఫ్.

గోప్యతా ఉల్లంఘన: కంటెంట్ లేదా ప్రకటన ప్రైవేట్ అని ప్రూఫ్ లేదా లేకపోతే గోప్యతా హక్కులను ఉల్లంఘించింది.

మీరు బాధిత పక్షం యొక్క ఏజెంట్ లేదా న్యాయవాది అయితే, ఫిర్యాదుతో పాటు బాధిత పక్షం యొక్క ఫిర్యాదును మీరు దాఖలు చేసే హక్కును సమర్థిస్తూ పవర్ ఆఫ్ అటార్నీ లేదా థృవీకరణ లేఖను జత చేయవలసి ఉంది.

ఫిర్యాదులో కేటాయించబడిన సమాచారం అసంపూర్ణంగా లేదా అబద్ధంగా ఉంటే ఏమవుతుంది?

చట్టానికి కట్టుబడి ఉండే సంస్థను, ప్లాట్ ఫాం పై ప్రచురించబడిన ఏదైనా కంటెంట్ లేదా ప్రకటన పై నమోదు చేసిన ప్రతి ఫిర్యాదును వెర్సే పరిగణన చేస్తుంది మరియు దర్యాప్తు చేస్తుంది. అవసరమైతే వెర్సే అంతర్గత దర్యాప్తు చేసినా కూడా, ఏదైనా విచారంతో వ్యవహరించేటప్పుడు ఫిర్యాదులో ఇచ్చిన సమాచారమే సమాచారానికి దాని ప్రాథమికమైన మూలాధారంగా నిలుస్తుంది. ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం ఆధారంగా, ఫిర్యాదు స్వభావాన్ని, చర్చిస్తున్న కంటెంట్ /ప్రకటన ద్వారా ఉల్లంఘించబడిన చట్టాలు/హక్కులను, ఈ విషయంలో నిమగ్నమైన పక్షాలు మరియు ఫిర్యాదులే లేవదీసిన సమస్యను పరిష్కరించడానికి కావలసిన ఇతర సంబంధిత సమాచారాన్ని వెర్సే నిర్ణయిస్తుంది.

ఫిర్యాదును పరిష్కరించడంలో వెర్సే ఏ విధంగా సహాయపడగలదు?

కేవలం టెక్నాలజీ ప్రొవైడర్ మరియు సమాచారం సాంకేతిక చట్టం, 2000 క్రింద మధ్యవర్తిగా ఉండటం వలన, 1) అవసరమైన అన్ని డాక్యుమెంట్స్, ప్రాథమిక విచారణ మరియు ప్లాట్ ఫాం పై ఉన్న కంటెంట్ లేదా ప్రకటన మూడవ పక్షం యొక్క హక్కులను ఉల్లంఘించిందని స్పష్టంగా సమర్థించడంతో పాటు ఫిర్యాదు అందుకున్నప్పుడు లేదా 2) వెర్సే కంటెంట్ లేదా ప్రకటనను ప్లాట్ ఫాం నుండి తీసివేయవలసిన బాధ్యతను కలిగి ఉంది లేదా 2) చట్టం ద్వారా సక్రమమైన సంస్థ నుండి తొలగించవలసిందిగా ఆదేశిస్తూ అది ఆదేశం అందుకుంటే ప్లాట్ ఫాం నుండి వెర్సే కంటెంట్ ను లేదా ప్రకటనను తీసివేసే బాధ్యతను కలిగి ఉంటుంది.

చట్టం ప్రకారం కంటెంట్ వివరాలను కూడా వెర్సే మీకు కేటాయిస్తుంది. ఇది నేరుగా మీతో కమ్యూనికేట్ చేయడంలో మరియు మీ ఫిర్యాదును పరిష్కరించడంలో సహాయపడవచ్చు.

సమాచారం సాంకేతిక చట్టం, 2000 సమాచారం సాంకేతికత (మధ్యంతర మార్గదర్శక సూత్రాలు) నియమాలు, 2011కు మరియు భారతదేశంలో వర్తించే అన్ని ఇతర చట్టాలకు అనుగుణంగా ఏదైనా ప్రకటనలో లేదా కంటెంట్ లో వెర్సే ఫిర్యాదులను పరిష్కరించి, దర్యాప్తు చేస్తుంది. వెర్సే తన స్వంత నిర్ణయాధికారం మేరకు మరియు ఫిర్యాదులో కేటాయించిన అంశాన్ని మరియు వెర్సే తీసుకున్న ఏదైనా చర్య మరియు నిర్వహించిన దర్యాప్తును మించి వ్యవహరించవలసిందిగా వెర్సే కు ఏ చట్టం బాధ్యత కలిగించడం లేదు మరియు మీకు లేదా ఏదైనా ఇతర పక్షానికి ఇదే విషయాన్ని తెలియచేయవలసిన అవసరం లేదు.

తమ ప్లాట్ ఫాం పై కంటెంట్ ను ప్రచురించడానికి వెర్సే బాధ్యతవహిస్తుందా?

లేదు, వెర్సే కేవలం ఒక మధ్యవర్తి మాత్రమే, మీతో సహా అంతిమ యూజర్స్ కోసం తమ కంటెంట్ ను ప్రచురించడానికి వివిధ మూడవ పక్షానికి చెందిన కంటెంట్ ప్రొవైడర్స్ కు ప్లాట్ ఫాం కేటాయిస్తుంది. ప్లాట్ ఫాం పై ఏదైనా కంటెంట్ లేదా ప్రకటనను ప్రచురించడానికి లేదా రచించడంలో వెర్సే ప్రమేయం లేదు.

సమాచారం సాంకేతికత చట్టం, 2000లో సెక్షన్ 79 ప్రకారం, ప్లాట్ ఫాం పై ప్రచురించిన ఏదైనా కంటెంట్ లో లేదా ఏదైనా భాగానికి బాధ్యతవహించదు. 1) అవసరమైన సాక్ష్యం, ప్రాథమిక విచారణ మరియు మూడవ పక్షం యొక్క హక్కులను కంటెంట్ ఉల్లంఘిస్తోందని స్పష్టంగా సమర్థించే అంశంతో ఫిర్యాదు అందుకుంటే లేదా 2) తొలగించమని చట్టం ద్వారా సక్రమమైన సంస్థ నుండి ఆదేశం అందుకున్నప్పుడు ప్లాట్ ఫాం నుండి కంటెంట్ ను తొలగించడానికి ప్లాట్ ఫాం పై ప్రచురించిన ఏదైనా కంటెంట్ కోసం వెర్సేకు పరిమితమైన బాధ్యత ఉంది.

ప్లాట్ ఫాం పై కంటెంట్ ను రచించడంలో లేదా ప్రచురించడంలో వెర్సేకు ప్రమేయం లేనందున తమ హక్కులను ఉల్లంఘించినందుకు కంటెంట్ లేదా అక్కడ ఉన్న భాగానికి బాధిత పక్షానికి కలిగిన నష్టాలు లేదా వ్యయాలకు చెల్లింపులు చేయవలసిన బాధ్యత లేదు. కేవలం మధ్యవర్తిగా వ్యవహరిస్తుండటం వలన వెర్సే, మూడవ పక్షం యొక్క ఏదైనా కంటెంట్ లేదా అక్కడ ఉన్న భాగంలో హక్కులను ఉల్లంఘించడం వలన వెర్సే పై ఎటువంటి పౌర దావా వేయబడదు.

ప్లాట్ ఫాం పై కంటెంట్ మరియు ప్రకటనలు యొక్క చట్టబద్ధతను వెర్సే ఏ విధంగా నిర్థారణ చేస్తుంది?

పైన వివరించిన విధంగా, వెర్సే వివిధ మూడవ పక్షాలు తమ కంటెంట్ ను ప్రదర్శించడానికి ప్లాట్ ఫాంను కేటాయించే మధ్యవర్తి మాత్రమే. ప్లాట్ ఫాం పై ప్రదర్శించబడే కంటెంట్ ను అప్ లోడ్ చేసిన ఈ మూడవ పక్షానికి చెందిన కంటెంట్ ప్రొవైడర్స్ తో వెర్సేకు ఒప్పందాలు ఉన్నాయి. వెర్సేతో వారికి గల ఒప్పందాలలో, ఈ కంటెంట్ ప్రొవైడర్స్ తమ కంటెంట్ కు లేదా ప్లాట్ ఫాం పై అప్ లోడ్ చేయబడిన ఏదైనా కొంత భాగం ఏదైనా చట్టాన్ని లేదా మూడవ పక్షానికి చెందిన హక్కులను ఉల్లంఘించడం లేదని ప్రాతినిధ్యంవహిస్తున్నారు. మరింత ప్రత్యేకంగా, కంటెంట్ ప్రొవైడర్స్ ఈ క్రింది విషయాలకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు:

  • ప్లాట్ ఫాం పై కంటెంట్ అప్ లోడ్ చేయడానికి వారికి అధికారం ఉంది.
  • కాపీరైట్, ట్రేడ్ మార్క్ హక్కులు,గోప్యతా హక్కులు, ప్రచారం హక్కులు లేదా ఇతర చట్టబద్ధమైన హక్కులు సహా కంటెంట్ మూడవ పక్షం హక్కులను ఉల్లంఘించదు,
  • కంటెంట్ అశ్లీలంగా, ప్రతిష్టకు భంగం కలిగించేదిగా, అసహ్యంగా, అసభ్యకరంగా, అనైతికంగా లేదా లేకుంటే అనధికారంగా ఉండదు,
  • కంటెంట్ ఏ విధంగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింస, తిరిగుబాటును లేదా ద్వేషం ప్రోత్సహించదు లేదా ప్రేరేపించదు; లేదా మతపరమైన మనోభావాలు దెబ్బతీయదు లేదా నిషేధించబడిన పదార్థం, ఉత్పత్తి లేదా సేవల వాడకం లేదా పంపిణీని మద్దతు చేయదు.

తమ ప్లాట్ ఫాం వాడకాన్ని నియంత్రించే సొంత పాలసీలు మరియు ఒప్పందాలు కూడా వెర్సేకు ఉన్నాయి. ఈ ఒప్పందాలు మరియు పాలసీలకు యూజర్స్ కట్టుబడాలి మరియు ప్లాట్ ఫాం యొక్క వినియోగం ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించడం లేదని నిర్థారించడానికి రూపొందించబడ్డాయి. ప్లాట్ ఫాంను వినియోగించడం ద్వారా, ఏదైనా చట్టం లేదా వెర్సే వినియోగించే నియమాలను ఉల్లంఘించే ఎటువంటి కంటెంట్ ను (టెక్ట్స్, చిత్రాలు, వీడియోలు, వ్యాఖ్యానాలు మొదలైనవి) అప్ లోడ్ చేయబోమని అంగీకరించారు.

మధ్యవర్తిగా, వెర్సే ప్లాట్ ఫాం పై కంటెంట్ ను పర్యవేక్షించవలసిన అవసరం లేదు. సక్రమమైన సంస్థ నుండి ఆదేశం లేదా ప్రాథమిక విచారణ కేసును సమర్థించే పూర్తి ఫిర్యాదును అందుకున్నప్పుడు మాత్రమే వెర్సే కంటెంట్ పై చర్య తీసుకోవలసిన అవసరం ఉంది. అయితే, వెర్సే తన స్వంత నిర్ణయాధికారం మేరకు, అలాంటి కంటెంట్ చట్టాన్నిలేదా ప్లాట్ ఫాం యొక్క నియమాలను ఉల్లంఘించేదిగా ఉందని భావించినప్పుడు కంటెంట్ ను తొలగించే హక్కు వెర్సేకు ఉంది.

ఏదైనా కంటెంట్ పై చేసిన ఫిర్యాదుతో వెర్సే ఏ విధంగా వ్యవహరిస్తుంది?

ప్లాట్ ఫాం పై కంటెంట్ గురించి దాఖలు చేసిన అన్ని ఫిర్యాదులతో వ్యవహరించడానికి వెర్సే కు సమర్థవంతమైన న్యాయవాదులు ఉన్నారు. తమ అంతర్గత పరిశోధన మరియు మీరు కేటాయించిన కంటెంట్ మరియు సాక్ష్యం ఆధారంగా వాస్తవమైన మరియు చట్టబద్ధమైన అంశాలు పై ఈ బృందాలు దర్యాప్తు చేస్తాయి. ఫిర్యాదులో ఉన్న కంటెంట్, కేటాయించిన సాక్ష్యం, తమ అంతర్గత పరిశోధన, చట్టబద్ధమైన ఏర్పాట్లు మరియు ప్రతిస్పందన ఆధారంగా ఈ బృందాలు ఫిర్యాదు మరియు విచారాన్ని అంచనా వేస్తాయి మరియు బాధిత పక్షానికి లేదా మీకు ఏ పరిష్కారాలు ఇవ్వాలి నిర్ణయిస్తాయి.

ఫిర్యాదుతో వ్యవహరించేటప్పుడు వెర్సే తీసుకున్న చర్యలను కేటాయిస్తుందా?

అతి క్లిష్టమైన తనిఖీ ప్రక్రియ ద్వారా ఫిర్యాదు పరిశీలించబడుతుంది. ఇది అతి గోప్యమైనది. చట్టం లేదా సరైన న్యాయ/క్వాజీ-జ్యుడీషియల్ సంస్థ కోరినప్పుడు మినహా, వెర్సే ఒక ప్రత్యేకమైన ఫిర్యాదుతో వ్యవహరించేటప్పుడు తీసుకున్న చర్యలను వెల్లడించదు.

నమోదు చేసిన అన్ని ఫిర్యాదులకు వెర్సేకు  ప్రతిస్పందించవలసిన బాధ్యత ఉందా?

ఫిర్యాదులో కేటాయించిన సమాచారం, ఫిర్యాదు స్వభావం,కేటాయించిన డాక్యుమెంట్స్ యొక్క సాక్ష్యాలు, ఫిర్యాదులో ఫిర్యాదు  మరియు విచారం యొక్క చట్టబద్ధమైన చెల్లుబాటు సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాని వివిధ వాస్తవాలు ఆధారంగా ప్లాట్ ఫాం పై ఏవైనా/అన్ని కంటెంట్ లకు వ్యతిరేకంగా నమోదు చేసిన అన్ని ఫిర్యాదులను వెర్సే పరిగణన చేస్తుంది. ఈ అంశాలు ఆధారంగా, వెర్సే మీకు జవాబు పంపించవచ్చు లేదా పంపించకపోవచ్చు లేదా ఫిర్యాదు ఆధారంగా ఏదైనా చర్య తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. ప్లాట్ ఫాం పై కంటెంట్ కు వ్యతిరేకంగా నమోదు చేసిన ప్రతి ఫిర్యాదు ఆధారంగా వెర్సే జవాబు ఇవ్వడానికి లేదా చర్య తీసుకోవడానికి బాధ్యతను కలిగి లేదు.

మీరు తప్పు లేదా మోసపూరితమైన ఫిర్యాదును నమోదు చేసినట్లయితే ఏమిటి జరుగుతుంది?

మీరు ఫిర్యాదులో తప్పు సమాచారం కేటాయిస్తే, వెర్సే కావలసిన సమాచారాన్ని సేకరించలేదు లేదా మీ ఫిర్యాదును పరిష్కరించలేదు. ఫిర్యాదులో మీరు తప్పు లేదా తప్పుదోవకు దారితీసే సమాచారం కేటాయించడం ద్వారా మీరు వెర్సేను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తే, ప్లాట్ ఫాం యొక్క తమ చట్టబద్ధమైన హక్కులు మరియు సమైక్యతను రక్షించడానికి వెర్సే మీ పై కఠినమైన చట్టబద్ధమైన చర్య తీసుకోవచ్చు. మీరు తప్పు మరియు మోసపూరితమైన ఫిర్యాదులు నమోదు చేస్తే మీరు నష్టాలను (వ్యయాలు మరియు న్యాయవాది ఫీజు) భరించవలసి ఉందని దయచేసి గమనించండి. ఎందుకంటే ఫిర్యాదులను సమీక్షించేటప్పుడు వెర్సే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుంది.

ఈ మార్గదర్శక సూత్రాలకు మీరు కట్టుబడి ఉండాలా?

ప్లాట్ ఫాం పై కంటెంట్ కు వ్యతిరేకంగా వెర్సే పై ఫిర్యాదు నమోదు చేయడంలో మీకు సహాయపడటానికి ఈ మార్గదర్శక సూత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. నమోదు చేసిన ఫిర్యాదుకు సంబంధించి లేదా ఫిర్యాదుతో వ్యవహరించే చట్టబద్ధమైన నిబంధనల పై ఈ మార్గదర్శకసూత్రాలు వివరిస్తాయి. ఈ మార్గదర్శక సూత్రాలలో పేర్కొన్న ఏదీ కూడా చట్టం పరిధిని మించి లేదు కాబట్టి ఈ మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి ఉండనా లేదా ఉండకపోయినా, మీరు సంబంధిత చట్టబద్ధమైన నిబంధనలకు కట్టుబడాలి.

మీరు నమోదు చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కంటెంట్ పై వెర్సే ఏ చర్య తీసుకుంటుంది?

ఒక మధ్యవర్తిగా, వెర్సే కంటెంట్ ను లేదా అక్కడ ఉన్న ఏదైనా భాగాన్ని తన సొంతంగా లేదా అందుకున్న ఫిర్యాదుకు అనుగుణంగా మార్చలేదు లేదా ఎడిట్ చేయలేదు . అయితే, కొన్ని పరిస్థితులలో వెర్సే పూర్తి కంటెంట్ ను తొలగించడానికి అనుమతించబడుతుంది.

ఈ క్రింది సందర్భాలలో వెర్సే కంటెంట్ ను తొలగించవచ్చు :

  • సరైన న్యాయ లేదా క్వాజీ జ్యుడీషియల్ సంస్థ నుండి ఈ మేరకు వెర్సే ఆదేశం అందుకున్నప్పుడు,
  • నిర్దిష్టమైన కంటెంట్ ను తొలగించవలసిందిగా వెర్సేను కోరే చట్టబద్ధమైన నిబంధన ఉన్నప్పుడు,
  • చర్చించబడుతున్న కంటెంట్ తమ సొంత ప్లాట్ ఫాం నుండి కంటెంట్ ను తొలగిస్తే మరియు ఇదే విషయాన్ని వెర్సేకు సొంతంగా తెలియజేసినప్పుడు లేదా ఫిర్యాదు అందుకున్న తరువాత తెలియజేసినప్పుడు.

ఈ క్రింది సందర్భాలలో వెర్సే కంటెంట్ ను తొలగించవచ్చు :

  • ప్రాథమిక విచారణ కేసుతో పూర్తిగా మరియు సక్రమంగా నిరూపించబడిన ఫిర్యాదును అందుకున్నప్పుడు,
  • వెర్సే తన స్వంత నిర్ణయాధికారం మేరకు, కంటెంట్ ఏదైనా చట్టం లేదా ప్లాట్ ఫాం నియమాలను ఉల్లంఘిస్తోందని నిర్ణయించినప్పుడు.

29. రద్దు చేయడం

29.1 మీ అకౌంట్ ను నిర్మూలించడం మరియు ప్లాట్ ఫాం యొక్క అన్ని వినియోగాలను ఆపుచేయడం ద్వారా మీరు ఈ నియమాలను ఏ సమయంలోనైనా రద్దు చేయవచ్చు. మీ కంప్యూటర్ లేదా డివైజ్ నుండి ప్లాట్ ఫాంను తొలగించడం వలన మీ అకౌంట్ తొలగిపోదు మరియు మీరు ప్లాట్ ఫాం పై ఇంతకు ముందు అప్ లోడ్ చేసిన యూజర్ కంటెంట్ అదే విధంగా ఉంటుందని దయచేసి గమనించండి. మీరు మీ అకౌంట్ ను నిర్మూలించాలని కోరుకుంటే, సైట్ పై దయచేసి మీ అకౌంట్ ను లాగ్ ఇన్ చేయండి లేదా యాప్ లో అకౌంట్ ప్రొఫైల్ ఐకాన్ ను క్లిక్ చేయండి, మీరు అకౌంట్ ప్రొఫైల్ లోపల ఉన్నప్పుడు, "డిలీట్ అకౌంట్" ఎంచుకోండి. మీరు మీ అకౌంట్ ను డిలీట్ చేసినట్లయితే, యూజర్ కంటెంట్ అంతా ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుందని దయచేసి గమనించండి. ఇంకా, మీరు ప్లాట్ ఫాం పై అప్ లోడ్ చేసిన ఏదైనా ఒక అంశం యొక్క యూజర్ కంటెంట్ ను మీరు డిలీట్ చేయాలని కోరుకుంటే, ప్లాట్ ఫాంలో ఉన్న యూజర్ కంటెంట్ డిలీషన్ విధులను ఉపయోగిస్తూ మీరు ఆ విధంగా చేయవచ్చు; అయితే, మీ యూజర్ కంటెంట్ ను డిలీట్ చేయడం వలన మీ అకౌంట్ డిలీట్ కాదు లేదా ఈ ఒప్పందం యొక్క నియమాలు రద్దు కావు. ఈ నియమాలు , మరియు పోస్ట్ చేయబడిన సవరణ, మీరు ప్లాట్ ఫాంను ఉపయోగిస్తున్నప్పుడు పూర్తిగా అమలులో ఉంటుంది మరియు రద్దు చేసిన తరువాత కూడా కొన్ని నిబంధనలు వర్తించడం కొనసాగవచ్చు.

29.2 ఏ కారణంగానైనా, ఏ సమయంలోనైనా మీరు ప్లాట్ ఫాంను అన్ ఇన్ స్టాల్ చేయడం లేదా డిలీట్ చేయడం ద్వారా ఈ ఒప్పందాన్ని రద్దు చేయవచ్చు. మీరు మరోసారి మా సేవలను ఉపయోగించవద్దని కోరుకుంటే, మరియు మీ అకౌంట్ డిలీట్ చేయబడాలని కోరుకుంటే, మమ్మల్ని grievance.officer@myjosh.in పై సంప్రదించండి. ఈ ప్రక్రియను అనుసరించవలసిన విధానం గురించి మేము మీకు మరింత సహాయ, సహకారాలు అందిస్తాము. మీరు మీ అకౌంట్ ను డిలీట్ చేయాలని కోరుకున్న తరువాత, మీరు మీ అకౌంట్ ను రీయాక్టివేట్ చేయలేరు మీరు చేర్చిన ఏదైనా సమాచారం లేదా కంటెంట్ ను తిరిగి పొందలేరు.

29.3 ఈ నియమాలు యొక్క ఏర్పాట్లకు మీరు కట్టుబడి ఉండటంలో విఫలమైతే, లేదా మీ అకౌంట్ లో సంభవించిన కార్యకలాపాలు, సర్వీసెస్ కు నష్టం లేదా బలహీనపరచడం కలుగజేస్తాయని లేదా కలుగజేయవచ్చని లేదా మూడవ పక్షం హక్కులను ఉల్లంఘించవచ్చు లేదా హక్కులలో ప్రవేశించవచ్చని లేదా వర్తించే ఏవైనా చట్టాలను ఉల్లంఘించవచ్చని మా స్వంత నిర్ణయాధికారం మేరకు మేము భావించినప్పుడు మీ యూజర్ కంటెంట్ ను ఏ సమయంలోనైనా  రద్దు చేయడానికి లేదా ఆపుచేయడానికి, మీరు అప్ లోడ్ లేదా అందచేసిన ఏదైనా కంటెంట్ ను తొలగించడానికి లేదా ఆపుచేయడానికి మాకు హక్కు ఉంది. అలాంటి రద్దు లేదా తాత్కాలిక బహిష్కరణ చేసినప్పుడు మీరు ప్లాట్ ఫాంను యాక్సెస్ చేయలేరు లేదా వినియోగించలేరు మరియు వేరొక సభ్యుని పేరు ఉపయోగించి లేదా మరొక విధంగా  ప్లాట్ ఫాంను యాక్సెస్ చేయడానికి లేదా ప్లాట్ ఫాంతో మళ్లీ రిజిస్టర్ చేయడానికి ప్రయత్నించరని మీరు అంగీకరిస్తున్నారు. 

29.4 రద్దు ప్రభావం. ఒప్పందం, మీ అకౌంట్, ప్లాట్ ఫాం యొక్క వినియోగం లేదా మీ యాక్సెస్ లో ప్లాట్ ఫాంను మరింత వినియోగించడాన్ని నిరోధిస్తుంది మరియు యాక్సెస్ ను తొలగిస్తుంది. ఈ ఒప్పందాన్ని లేదా మీ అకౌంట్ ను రద్దు చేయడం వలన మీ యూజర్ నేమ్, మీ పాస్ వర్డ్ మరియు, సంబంధిత సమాచారం అంతా, ఫైల్స్ మరియు దానితో సంబంధమున్న లేదా మీ అకౌంట్ లోపల ఉన్న (లేదా అక్కడ ఉన్న ఏదైనా భాగం) మీ యూజర్ కంటెంట్ సహా సంబంధాన్ని కోల్పోతారు. ఒప్పందాన్ని రద్దు చేయడం వలన, మీ ప్రొఫైల్ కంటెంట్ మరియు ఇతర సమాచారం డిలీట్ చేయబడవచ్చు. అయితే, ఆర్కైవల్ మరియు చట్టబద్ధమైన ఉద్దేశ్యాలకోసం కొన్ని వివరాలు మాతో నిర్వహించబడవచ్చు. మీ రద్దుతో సంబంధం లేకుండా, కంటెంట్ బాధ్యత అన్ని వేళలా యూజర్ తో కొనసాగుతుంది. ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు, మొబైల్ సాఫ్ట్ వేర్ సహా మీరు ప్లాట్ ఫాంను ఉపయోగించే హక్కు ఆటోమేటిక్ గా రద్దవుతుంది. మీ యూజర్ కంటెంట్ ను డిలీట్ చేయడం సహా ఏదైనా రద్దు లేదా తాత్కాలికంగా బహిష్కరించడం పై వెర్సేకు మీ గురించి ఎలాంటి బాధ్యత ఉండదు. కావలసినంత కాలం మరియు /లేదా స్థానిక చట్టాలు క్రింద అనుమతించదగిన కంటెంట్ /డేటాను వెర్సే నిలిపి ఉంచుతుంది/వినియోగిస్తుంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసిన తరువాత కూడా, హామీ నిరాకరణలు, నియంత్రించే చట్టం, బాధ్యత యొక్క పరిమితి సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా ఈ ఒప్పందం యొక్క అన్ని నిబంధనలు కొనసాగుతాయి.

29.5. ఈ నియమాలను ఎప్పటికప్పుడు మార్చడానికి వెర్సేకు హక్కు ఉంది. అలాంటి ఏవైనా మార్పులకు మీరు అంగీకరించకపోతే, ప్లాట్ ఫాంను యాక్సెస్ చేయడం, పొందడం లేదా వినియోగించడం నుండి తొలగిపోవడానికి మీకు అధికారం ఉంది. ఏవైనా అలాంటి మార్పులు గురించి నోటీసు వచ్చిన తరువాత ప్లాట్ ఫాంను నిరంతరంగా యాక్సెస్ చేయడం లేదా వినియోగించడం అది అలాంటి మార్పులకు మీ అంగీకారాన్ని సూచిస్తుంది మరియు మీరు అలాంటి సవరించబడిన నియమాలకు కట్టుబడి ఉండాలి.

29.6. ఈ ఒప్పందాన్ని రద్దు చేసిన తరువాత కూడా, హామీ నిరాకరణలు, నియంత్రించే చట్టం, బాధ్యత యొక్క పరిమితి సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా ఈ ఒప్పందం యొక్క అన్ని నిబంధనలు కొనసాగుతాయి.

28. మధ్యవర్తి, నెలవారీ సమాచారం వెల్లడింపు, వెర్సే నెలవారీ సమాచారాన్ని సమాచారం సాంకేతికత (ఇంటర్ మీడియరీ గైడ్ లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్స్) నియమాలు, 2021 క్రింద అవసరమైన విధంగా వెల్లడిస్తుంది. ఈ వెల్లడింపులు కోసం, దయచేసి సందర్శించండి:

విచారం వెల్లడింపు: గ్రీవెన్స్ డేటా 

ఎథిక్స్ నియమావళి ప్రకారం, అలాంటి నియమాల మేరకు వెర్సే తమ నిబద్ధత కలిగి ఉంటుంది.