జనవరి 2023
జోష్-గోప్యతా విధానం
దయచేసి ఈ గోప్యతా విధానం గురించి జాగ్రత్తగా చదవండి. ఈ గోప్యతా విధానం 11వ అంతస్తు, వింగ్ ఈ, హీలియోస్ బిజినెస్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్, కదుబీసనహళ్లి, బెంగళూరు- 560103, కర్ణాటక, భారతదేశంలో తమ వ్యాపారం గల వర్సే ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వెంటనే అమలు చేయబడింది. ("జోష్", "వర్సే", "మేము", "మాకు లేదా మనము" లేదా "మాకు లేదా మనది").
1. సాధారణం
ఎ. జోష్ మీ ("మీరు", "మీ యొక్క", లేదా "యూజర్") గోప్యతను ఎంతో తీవ్రంగా పరిగణన చేస్తుంది మరియు మీ ప్రైవేట్ డేటా/సమాచారం కాపాడటానికి తమ ఉత్తమమైన ప్రయత్నాలు చేస్తుంది. తమ ప్లాట్ ఫాం మరియు సేవలు ఉపయోగించడానికి జోష్ సురక్షితమైన మరియు నమ్మకమైన వాతావరణం కేటాయిస్తుంది. మీ నుండి జోష్ ఏదైనా ప్రైవేట్ సమాచారం సేకరిస్తే ఈ గోప్యతా విధానం మరియు ఈ క్రింద కేటాయించబడిన నియమాలు మరియు షరతులు ప్రకారం మాత్రమే ఉపయోగించబడుతుంది.
బి. జోష్ మొబైల్ లేదా జోష్ గా పిలువబడే డెస్క్ టాప్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ ("ప్లాట్ ఫాం" లేదా "జోష్") మరియు ప్లాట్ ఫాం ("సర్వీసెస్")తో ఉన్న సంబంధంలో జోష్ అందించే సేవలకు ఈ గోప్యతా విధానం వర్తిస్తుంది.
సి. మొబైల్ లేదా డెస్క్ టాప్ అప్లికేషన్స్ యూజర్స్ నుండి మరియు /లేదా దానితో సంబంధం ఉన్న సర్వీసెస్ నుండి సేకరించబడిన సమాచారాన్ని ఏ విధంగా మేము సేకరిస్తాము, ఉపయోగిస్తాము, నిర్వహిస్తాము పద్ధతిని ఈ గోప్యతా విధానం సూచిస్తుంది.
డి. మీరు పాలసీని జాగ్రత్తగా చదవాలని సలహా ఇవ్వబడింది మరియు పాలసీ నియమాలకు మీరు అంగీకరించినప్పుడు మాత్రమే మీ సమ్మతి తెలియచేయండి. ప్లాట్ ఫాంతో మీ ప్రొఫైల్ మరియు /లేదా ప్లాట్ ఫాంతో ఉన్న సంబంధంలో అందచేయబడే సర్వీసెస్ ను ఉపయోగించడం ద్వారా, ఈ గోప్యతా విధానంలో నిర్దేశించిన పద్ధతిలో మీరు సమాచారం ఉపయోగించడానికి, సేకరించడానికి, బదిలీ చేయడానికి, భద్రపరచడానికి, వెల్లడించడానికి మరియు మీ సమాచారం యొక్క ఇతర వాడకాలు కోసం మీరు సమ్మతి ఇస్తున్నారు. ఈ పాలసీ లక్ష్యం కోసం, జోష్ కు సంబంధించిన ఏదైనా సూచనను దాని అనుబంధ సంస్థలు, వ్యాపార సంస్థలు మరియు సోదరి సంస్థలకు కూడా వర్తిస్తుంది.
ఈ. ఈ ప్లాట్ ఫాంను అప్ డేట్ చేయడం, డౌన్ లోడింగ్ చేయడం, ఇన్ స్టాలింగ్ చేయడం మరియు /లేదా పొందడాన్ని /ఉపయోగించడాన్ని కొనసాగించడం ద్వారా, ఈ గోప్యతా విధానం లో చేసిన ఏదైనా మార్పు, సవరింపు , చేర్చడం లేదా రూపాంతరానికి మీరు కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు.
ఎఫ్. జోష్ సొంతం కానివి, నియంత్రించలేనివి లేదా నిర్వహించలేని మూడవ పక్షాల పద్ధతులకు ఈ గోప్యతా విధానం వర్తించదు దీనిలో ఏవైనా మూడవ పక్షం వెబ్ సైట్స్, సేవలు, అప్లికేషన్స్ లేదా వ్యాపారలు ( మూడవ పక్షం సేవలు) సహా అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా ఉన్నాయి. ఆ మూడవ పక్షం సేవలు యొక్క గోప్యతా విధానాలు లేదా కంటెంట్ కోసం జోష్ బాధ్యతవహించదు. మీరు ప్లాట్ ఫాం ద్వారా పొందే అన్ని మూడవ-పక్షం సేవలు యొక్క గోప్యతా విధానాలను మీరు జాగ్రత్తగా సమీక్షించడానికి జోష్ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.
జి. ఈ గోప్యతా విధానం ప్లాట్ ఫాం యొక్క సేవా నియమాలకు లోబడి ఉంది
హెచ్. ఈ గోప్యతా విధానంలో ఏవైనా నియమాలకు మీరు అంగీకరించకపోతే, మీరు ప్లాట్ ఫాం మరియు /లేదా సేవలను డౌన్ లోడ్ చేయలేరు, ఇన్ స్టాల్ చేయలేరు మరియు /లేదా ఉపయోగించలేరు. ఈ పేజీని అప్ డేట్ చేయడం ద్వారా జోష్ ఏ సమయంలోనైనా ఈ గోప్యతా విధానాన్ని సవరించవచ్చు, మార్చవచ్చు, చేర్చవచ్చు, రూపాంతరం చేయవచ్చు లేదా సరిదిద్దవచ్చు.
2.జోష్ ఏ సమాచారం సేకరించవచ్చు
ఎ. మీరు అకౌంట్ ను సృష్టించి మరియు కంటెంట్ ను ప్లాట్ ఫాం పై అప్ లోడ్ చేసినప్పుడు మీరు మాకు ఇచ్చిన సమాచారాన్ని మేము సేకరిస్తాము మరియు ప్రక్రియ చేస్తాము. దీనిలో మీరు ప్లాట్ ఫాంను ఉపయోగించడం గురించి సాంకేతిక మరియు ప్రవర్తనాపరమైన సమాచారం ఉంది. మీరు యాప్ ను డౌన్ లోడ్ చేసి మరియు అకౌంట్ ను సృష్టించకుండా ప్లాట్ ఫాంతో పరస్పరం చర్చలు జరిపిన సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము. యూజర్స్ ద్వారా ప్లాట్ ఫాం పై రిజిస్ట్రేషన్ నుండి యూజర్స్ ద్వారా కంటెంట్ సమర్పించడం వరకు లేదా యూజర్ సేవలను పొందుతున్నప్పుడు /ఉపయోగిస్తున్నప్పుడు వివిధ దశలలో యూజర్స్ నుండి జోష్ సమాచారం కూడా సేకరిస్తుంది .
బి. మిమ్మల్ని గుర్తించే సామర్థ్యం గల వ్యక్తిగత సమాచారాన్ని కూడా జోష్ సేకరించవచ్చు. దీనిలో డౌన్ లోడ్ సమయంలో సమర్పించిన సమాచారం, ఇన్ స్టలేషన్ మరియు /లేదా ప్లాట్ ఫాంను ఉపయోగించినప్పుడు /ప్రవేశించినప్పుడు లేదా ప్లాట్ ఫాం ద్వారా అందించబడే సేవలు లేదా ఫీచర్స్ వాడకం /పొందడంతో సంబంధం ఉన్న సమాచారం లేదా ప్లాట్ ఫాంతో సంబంధమున్నప్పుడు సమాచారం సహా, అయితే దీనికి మాత్రమే పరిమితం కాదు. సేకరించబడిన వ్యక్తిగత సమాచారంలో మీ పేరు, ఫోటో, మెయిలింగ్ అడ్రస్ , ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ మరియు లింగం, జాతీయత, పోస్ట్ కోడ్ వంటి సమాచారం మరియు తేదీ, సమయం లేదా పుట్టిన ప్రదేశం, ప్రదేశం, ఆసక్తులు ఇష్టాయిష్టాలు మరియు వాడకపు సమాచారం సహా అయితే వీటికి మాత్రమే పరిమితం కాని సమాచారం ఉండవచ్చు.
సి. మీరు మాకు అలాంటి సమాచారం కేటాయించినప్పుడు లేదా ప్లాట్ ఫాం లేదా సేవలు ద్వారా సామాజిక నెట్ వర్కింగ్ సైట్స్ కు కనక్ట్ చేయబడటం ద్వారా అలాంటి సమాచారాన్ని పొందినప్పుడు యాక్సెస్ కేటాయించడానికి మాత్రమే జోష్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది ( ఉదాహరణకు ప్లాట్ ఫాంతో సంబంధం ఉన్న సదుపాయాలు లేదా సేవలను మీరు ఉపయోగించినప్పుడు లేదా ప్లాట్ ఫాంకు సంబంధించిన కార్యకలాపాలలో మీరు నిమగ్నమైనప్పుడు సహా, అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా, సభ్యునిగా మారడం ద్వారా లేదా అకౌంట్ కోసం సైనింగ్ చేయడం లేదా ఫేస్ బుక్, ట్విట్టర్ లేదా గూగుల్ ప్లస్ వంటి సామాజిక నెట్ వర్క్ ద్వారా అకౌంట్ ను లింక్ చేసినప్పుడు సహా, అయితే దీనికి మాత్రమే పరిమితం కాకుండా).
డి. ఈ మెయిల్ లేదా ఫోన్ ద్వారా లేదా ఏదైనా ఇతర ప్లాట్ ఫాం మరియు /లేదా సేవలు యొక్క ఇంటరాక్టివ్ /నాన్-ఇంటరాక్టివ్ ఫీచర్స్ పొందడానికి /ఉపయోగించడానికి మాతో మీరు సమాచారం కేటాయించినప్పుడు జోష్ వ్యక్తిగత సమాచారాన్ని కూడా కేటాయించవచ్చు.
ఈ. మీరు వ్యక్తిగత సమాచారాన్ని అందించడానికి మీరు ఎల్లప్పుడూ తిరస్కరించవచ్చు; అయితే ఇది మీరు ప్లాట్ ఫాంను ఉపయోగించడం నుండి ఇది మిమ్మల్ని నివారించవచ్చు మరియు /లేదా ప్లాట్ ఫాం యొక్క కొన్ని ఫీచర్స్ ను ఉపయోగించడం నుండి నివారించవచ్చు.
ఎఫ్. మీరు ప్లాట్ ఫాంతో ఎప్పుడు పరస్పర చర్చ చేసినా లేదా పొందినా లేదా ఉపయోగించినప్పుడు మరియు /లేదా దాని సేవలను ఉపయోగించినప్పుడు వ్యక్తిగత సమాచారం కావచ్చు లేదా కాకపోయినా కూడా జోష్ ఇతర సమాచారం సేకరించవచ్చు మరియు భద్రపరచవచ్చు. అలాంటి సమాచారంలో మొబైల్ లేదా కంప్యూటర్ పేరు, వెర్షన్, ఉపయోగించిన డివైజ్ రకం, మీ ఆపరేటింగ్ సిస్టం మరియు వెర్షన్, మొబైల్ డివైజ్ యూనిక్ ఐడీ, ఈ ప్లాట్ ఫాంకు మిమ్మల్ని సూచించిన మూడవ పక్షం యాప్స్ లేదా వెబ్ సైట్స్ లేదా సేవలు , భాషా ప్రాధాన్యతలు, ప్రదేశం యొక్క సమాచారం, ఐపీ అడ్రస్, సాంకేతిక సమాచారం, ప్యాకేజీ పేరు పరిమితి లేకుండా సహా మూడవ పక్షం యాప్స్ గురించి సమాచారం ( ప్లే స్టోర్ పై ప్యాకేజీ ఐడీ వలే ఉన్నది), ప్యాకేజీ వెర్షన్, ఇన్ స్టలేషన్ మరియు /లేదా అన్ ఇన్ స్టలేషన్ కార్యక్రమం సమాచారం మరియు యూజర్ గురించి అటువంటి ఇతర సమాచారం భాగంగా ఉన్నాయి.
జి. మీ యొక్క స్పష్టమైన నిర్దేశిత సమ్మతి ఆధారంగా, మేము జీపీఎస్, ఫోన్ మెమోరి మొదలైనవి సహా అయితే వాటికి మాత్రమే పరిమితం కాకుండా అదనపు సమాచారం కూడా సేకరించవచ్చు. అలాంటి సమాచారాన్ని ప్లాట్ ఫాం పై మీ ప్రొఫైల్ లేదా కంటెంట్ ను అప్ డేట్ చేయడానికి ఉపయోగించవచ్చు.
హెచ్. మీరు వ్యక్తిగత సమాచారాన్ని మరియు /లేదా ఇతర సమాచారాన్ని జోష్ తో కేటాయించాలని లేదా పంచుకోవాలని కోరుకోకపోతే మీరు ప్లాట్ ఫాంను డౌన్ లోడ్ చేయలేరు, ఇన్ స్టాల్ చేయలేరు మరియు /లేదా ఉపయోగించలేరు. జోష్ కు వ్యక్తిగత మరియు ఇతర సమాచారాన్ని కేటాయించడం ద్వారా, ఈ గోప్యతా విధానంలో కేటాయించబడిన పేర్కొనబడిన సమాచారాన్ని ఉపయోగించడానికి మీరు జోష్ కు అనుమతి ఇవ్వడానికి అంగీకరించారు.
3. సేకరించబడిన సమాచారాన్ని జోష్ ఏ విధంగా ఉపయోగిస్తుంది
ఎ. జోష్ వ్యాపారం మరియు /లేదా వాణిజ్యేతర లక్ష్యాలు కోసం మీ వ్యక్తిగత సమాచారం మరియు ఇతర సమాచారాన్ని సేకరించవచ్చు మరియు ఉపయోగించవచ్చు. ఈ క్రింది లక్ష్యాలు కోసం జోష్ సమాచారాన్ని ఉపయోగించవచ్చు:
ఐ. ప్లాట్ ఫాంలోకి లాగిన్ చేసేటప్పుడు మిమ్మల్ని గుర్తించడానికి మీ ఈమెయిల్ అడ్రస్ మరియు పాస్ వర్డ్ లను ఉపయోగించవచ్చు. ప్లాట్ ఫాంలోకి మీరు ప్రవేశించడాన్ని, ప్లాట్ ఫాం మరియు సేవలను ఉపయోగించడం నియంత్రించడానికి , మీతో సమాచారం తెలియచేయడానికి, ప్లాట్ ఫాం మరియు /లేదా ఏదైనా ఈమెయిల్ న్యూస్ లెటర్ లేదా జోష్ కు సంబంధించిన ఇతర అంశాలను ఉపయోగించి మీ అనుభవాన్ని అనుకూలం చేయడానికి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించవచ్చు , ఎప్పటికప్పుడు పంపించవచ్చు మరియు /లేదా కంటెంట్ లేదా వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం ఆధారంగా ఉపయోగకరమైన లేదా ఆసక్తికరమైన సమాచారాన్ని జోష్ ఇవ్వవచ్చు. యూజర్ సమాచారం, పరిపాలనా సంబంధిత సమాచారం, అకౌంట్ సెట్టింగ్స్ లో మార్పులు మరియు ప్లాట్ ఫాంలో /సేవలలో కలిగిన ఏవైనా మార్పులు లేదా జోష్ యొక్క కొత్త పాలసీలు పై అప్ డేట్స్ పంపించడానికి మీ ఈమెయిల్ అడ్రస్ ఉపయోగించబడవచ్చు. ఇదే కాకుండా, మీరు మా మెయిలింగ్ జాబితాను ఎంచుకుంటే, కంపెనీ న్యూస్, సంబంధిత ఉత్పత్తి లేదా సేవా సమాచారం మొదలైన వాటికి సంబధించిన క్రమానుగతమైన ఈమెయిల్స్ మీరు అందుకుంటారు. మీరు అడిగిన సందేహాలు, ప్రశ్నలు మరియు /లేదా ఏవైనా మీరు చేసిన అభ్యర్థనలకు జవాబు ఇవ్వడానికి మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఉపయోగించబడుతుంది. మీరు ఏ సమయంలోనైనా భవిష్యత్తు ఈమెయిల్స్ ను అందుకోవడాన్ని అన్ సబ్ స్క్రైబ్ చేయాలని కోరుకుంటే, ప్రతి మెయిల్ అడుగు భాగంలో అన్ సబ్ స్క్రైబ్ చేయడానికి వివరంగా సూచనలు పంపిస్తుంది, లేదా మీరు ప్లాట్ ఫాం ద్వారా జోష్ ను సంప్రదించవచ్చు.
ii. సేకరించబడిన సమాచారాన్ని జోష్ ప్లాట్ ఫాం ఫీచర్స్ ను మెరుగుపరిచే లక్ష్యం కోసం ప్లాట్ ఫాం వాడకం మరియు /లేదా సేవలను మరియు, ప్లాట్ ఫాంను సందర్శించే మరియు ఉపయోగించే ప్రజలను విశ్లేషించడానికి కూడా ఉపయోగిస్తుంది . మీకు అనుకూలమైన కంటెంట్ , ప్రకటనలు మరియు ఫీచర్స్ ను కేటాయించడానికి మీరు ప్లాట్ ఫాంను ఉపయోగించిన విధానాన్ని విశ్లేషించడానికి జోష్ మీ సమాచారం ఉపయోగించవచ్చు. మీరు కేటాయించిన సమాచారం మీ యొక్క కస్టమర్ సేవా అభ్యర్థనలకు జవాబు ఇవ్వడంలో జోష్ కు సహాయపడుతుంది మరియు మరింత సమర్థవంతంగా అవసరాలకు సహాయపడుతుంది.
iii. ఒక సమూహంగా యూజర్స్ ఏ విధంగా ప్లాట్ ఫాం మరియు /లేదా సేవలను ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవడానికి జోష్ ఒక మొత్తంగా సమాచారాన్ని ఉపయోగిస్తుంది. జోష్ ఒప్పందం మరియు ఏవైనా వర్తించే చట్టాల ఉల్లంఘనగా ఉన్న ఏవైనా కార్యకలాపాలను నివారించడానికి లేదా చర్య తీసుకోవడానికి జోష్ యూజర్ కేటాయించడిన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
iv. జోష్ మీ వ్యక్తిగతం కాని సమాచారాన్ని అనగా మూడవ పక్షానికి చెందిన యాప్స్ సమాచారం, ప్యాకేజీ పేరు (ప్లేస్టోర్ లో ప్యాకేజీ ఐడీగా ఉన్నటువంటిది), ప్యాకేజీ వెర్షన్, ఇన్ స్టలేషన్ మరియు /లేదా మీ ఆసక్తులను బట్టి వ్యక్తిగత కంటెంట్స్ మరియు సేవలు సమాచారం కోసం అన్ ఇన్ స్టలేషన్ చేసిన సమాచారానికి సంబంధించిన మీ వ్యక్తిగతేతర సమాచారం సహా, అయితే దీనికి మాత్రమే పరిమితం కాకుండా జోష్ ఉపయోగించవచ్చు. ఇన్ స్టాల్ చేయబడిన ఇతర అప్లికేషన్స్ నుండి లేదా వాటికి సంబంధించిన లేదా మీరు ఉపయోగించిన లేదా మీ కోసం అనుకూలమైన షేరింగ్ ఆప్షన్స్ సృష్టించడానికి సంబంధించి కంటెంట్ ను ప్రోత్సహించడానికి కూడా జోష్ మీ వ్యక్తిగతయేతర సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
v. ప్లాట్ ఫాం మరియు సేవల ఫీచర్స్ ను మెరుగుపరచడానికి మీరు ప్లాట్ ఫాం మరియు సేవలను ఉపయోగించడాన్ని విశ్లేషించడానికి మరియు ప్లాట్ ఫాం మరియు సేవలను సందర్శించి, ఉపయోగించే ప్రజలను విశ్లేషించడానికి జోష్ మీ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ప్లాట్ ఫాం మరియు /లేదా సేవలను పొందేటప్పుడు, ఉపయోగించేటప్పుడు లేదా ఇన్ స్టాలింగ్ చేసేటప్పుడు ప్లాట్ ఫాంలో చేర్చబడిన ఎస్ డీకేలు (సాఫ్ట్ వేర్ డవలప్ మెంట్ కిట్స్ ) యొక్క మూడవ పక్షాలకు కూడా మీ సమాచారం అందుబాటులో ఉండవచ్చు. అలాంటి ఎస్ డీకేలలో, గూగుల్ ప్రకటనలు, గూగుల్ ప్లాట్ ఫాం ఇండెక్సింగ్, గూగుల్ సపోర్ట్ లైబ్రరీ, గూగుల్ డిజైన్ లైబ్రరీ, లాగ్ ఇన్ కోసం గూగుల్ ధృవీకరణ, మాబ్ విస్టా (ప్రకటనలు), యాప్ నెక్ట్స్ నేటివ్ (ప్రకటనలు), యాప్ నెక్ట్స్ ఇంటర్ స్టైషియల్ (ప్రకటనలు), ఫేస్ బుక్ ఆడియెన్స్ నెట్ వర్క్ (ప్రకటనలు), వీమ్యాక్స్ (ప్రకటనలు), మస్తాడ్ వ్యూ (ఎంరైడ్), గ్లైడ్ ఫర్ గ్రాఫిక్స్, డీప్ లింక్ సహాయం కోసం బ్రాంచ్ ఐఓ , బైడు (ప్రకటనలు), డీప్ లింక్ సహాయం కోసం ఫైర్ బేస్ , ఐఎంఏ (ప్రకటనలు), ఆప్ నెక్ట్స్ యాక్షన్స్ (ప్రకటనలు), ఇమేజ్ నిర్వహణ కోసం పికాస్సో, ఆర్ఎక్స్ జావా, రిట్రోఫిట్ మరియు కోడ్ సామర్థ్యం కోసం డ్యాగర్, నెట్ వర్క్ సామర్థ్యం కోసం ఓకేహెచ్ టీటీపీ , ఒట్టో ఈవెంట్ బస్, మెమోరీ అనుకూలతలు కోసం డిస్క్ ఇరుకాషే, నెట్ వర్క్ నాణ్యతా అంచనా కోసం ఫేస్ బుక్ కనక్షన్ తరగతి, లాగ్ ఇన్ కోసం ఫేస్ బుక్ ఎస్ డీకే, మరియు పెర్ఫార్మెన్స్ అనుకూలత కోసం ఎస్ క్యూఎల్ లైట్ అస్సెట్ హెల్పర్. ఈ ఎస్ డీకేలు సాధారణ విశ్లేషణ మరియు ఇతర లక్ష్యాలు కోసం మీ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
vi. జోష్ మీ సమాచారాన్ని మార్కెట్ పరిశోధనా లక్ష్యాలు కోసం కూడా ఉపయోగించవచ్చు మరియు అది నియంత్రించే (జోష్ ఇన్నోవేషన్ తో సహా) అనుబంధ వ్యాపారాలకు మీ సమాచారాన్ని అందించవచ్చు. లక్ష్యభరితమైన ప్రకటన , లక్ష్యభరితమైన కంటెంట్ డెలివరీ మరియు ఇతర వ్యాపార లక్ష్యాలు కోసం కూడా మీరు అలాంటి వాడకాలు నుండి ప్రత్యేకంగా తొలగిపోయినప్పుడు మినహా జోష్ మీ సమాచారం ఉపయోగించవచ్చు.
vii. జోష్ మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించదగిన మరియు /లేదా ఇతర సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ప్లాట్ ఫాం మరియు సేవలను పొందేటప్పుడు /ఉపయోగించేటప్పుడు మీరు సమర్పిస్తారు, ఫీడ్ బ్యాక్ కేటాయిస్తారు, వ్యాఖ్యానాలు చేస్తారు/సమర్పిస్తారు, ఇన్ పుట్స్ కేటాయిస్తారు మరియు /లేదా లక్ష్యభరితమైన కంటెంట్, ప్రకటన మరియు సేవలు కేటాయించడానికి మరియు ఇతర వ్యాపారం మరియు /లేదా వాణిజ్యేతర లక్ష్యాలు కోసం ప్లాట్ ఫాం పై మరియు సేవల సంబంధంలో యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్ ఫాం మరియు సేవలతో పరస్పర చర్యలు జరుపుతారు.
4. మీ సోషల్ అకౌంట్స్ ను జోష్ కు లింక్ చేయడం
ఎ. మీ ఆదేశం మేరకు , మీ ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ మరియు యూ ట్యూబ్ అకౌంట్ (ల)తో మీ జోష్ అకౌంట్ ను లింక్ చేయడానికి మా సేవలు మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇది జోష్ ద్వారా ఇతర ప్లాట్ ఫాంస్ పై యూజర్స్ మిమ్మల్ని మరింత సులభంగా కనుగొనడానికి మరియు మీ సామాజిక మీడియా (అకౌంట్)లకు వారిని రీడైరక్ట్ చేయడానికి అనుమతిస్తుంది.
బి. ఇన్ స్టాగ్రామ్ లేదా యూ ట్యూబ్ లు బదిలీ చేయబడటానికి అనుమతించే పరిమితమై సమాచారాన్ని ( అనగా మీ పేరు, యూజర్ నేమ్ లేదా ఛానల్ పేరు మరియు పబ్లిక్ ప్రొఫైల్) మరియు మీరు మొదట మీ అకౌంట్ ను అలాంటి ప్లాట్ ఫాంలు నుండి మీ జోష్ అకౌంట్ తో కనక్ట్ చేసినప్పుడు మీరు అంగీకరించినప్పుడు మాత్రమే మేము అందుకుంటాము మరియు భద్రపరుస్తాము. ఈ సమాచారం మా ప్లాట్ ఫాం పై మీ లింక్ చేయబడిన పబ్లిక్ ప్రొఫైల్స్ ను ప్రదర్శించబడే లక్ష్యం కోసం మాత్రమే భద్రపరచబడుతుంది మరియు ఏవైనా మూడవ పక్షం యాప్స్, వెబ్ సైట్స్ లేదా ఇతర సేవలతో భాగస్వామం చేయబడదు.
సి. మీ జోష్ అకౌంట్ తో మీ ఇన్ స్టాగ్రామ్ లేదా యూ ట్యూబ్ అకౌంట్ ను లింక్ ను ఇంక ఎంత మాత్రం లింక్ చేయబోనని కోరుకుంటే, మీ ప్రొఫైల్ పేజీలో యూ ట్యూబ్ ఐకాన్ లేదా ఇన్ స్టాగ్రామ్ ను దయచేసి ట్యాప్ చేయండి మరియు జోష్ యాప్ ను పొందే అనుమతులను తొలగించడానికి సూచనలను అనుసరించండి.
5. జోష్ ఏ విధంగా యూజర్ సమాచారాన్ని రక్షిస్తుంది
మీ సమాచారం సురక్షితంగా ఉండటానికి మరియు ఈ పాలసీకి అనుగుణంగా ఉండటాన్ని నిర్ధారించడానికి మేము చర్యలు తీసుకుంటాము. ఈ పాలసీలు కోసం మేము ఏవైనా బాధ్యత లేదా జవాబుదారీతనం ఆమోదించము. ఇంటర్నెట్ 100% సురక్షితం కాదు. మీరు మా వెబ్ సైట్స్, యాప్స్ లేదా సేవలను ఉపయోగించడం పూర్తిగా సురక్షితమని మేము వాగ్థానం చేయలేము. మా సేవలకు మీరు ప్రసారం చేసిన ఏదైనా సమాచారం మీ సొంత నష్టం పై ఆధారపడింది. ఈ గోప్యతా విధానంలో వర్ణించిన పద్ధతులకు సంబంధించి లేదా అవసరమైనంత వరకు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉదాహరణకు, చట్టబద్ధమైన అనుసరణ, వివాదం పరిష్కారం, కాంట్రాక్ట్ అమలు చేయడం, బ్యాక్అప్, ఆర్కైవల్, మరియు ఇతర అంతర్గత కార్యకలాపాల లక్ష్యాలు సహా మేము భద్రపరుస్తాము. దీనిలో మీరు లేదా ఇతరులు మాకు కేటాయించిన డేటా మరియు మా సేవలను మీరు ఉపయోగించడం నుండి ఉత్పన్నమైన డేటాలు భాగంగా ఉన్నాయి. చట్టం కోరిన విధంగా కూడా మేము సమాచారాన్ని భద్రపరుస్తాము.
ఎ. పైన చెప్పిన లక్ష్యం కోసం, జోష్ అనధికారంగా పొందడం, మార్పు చేయడం , వెల్లడించడం లేదా మీ వ్యక్తిగత సమాచారం నాశనం చేయడం నుండి కాపాడటానికి భద్రతా చర్యలను అనుసరిస్తుంది. మరియు యూజర్ నేమ్, పాస్ వర్డ్ మరియు యాప్ లో భద్రపరచబడిన డేటా సరైన డేటా సేకరణ, భద్రపరచడం, నియంత్రణ మరియు ప్రాసెసింగ్ పద్ధతులు అవలంబిస్తుంది. ప్రత్యేకించి, పాస్ వర్డ్ ను రక్షించడం వంటి భద్రతా చర్యలను తీసుకోవడం ద్వారా మరియు క్రమబద్ధమైన విరామాలలో భద్రతా దాడులను పర్యవేక్షించడం ద్వారా మరియు డేటా ఉల్లంఘన మరియు నష్టాన్ని నివారించడానికి పరిష్కార చర్యలను తీసుకోవడం ద్వారా మీ వ్యక్తిగత సమాచారం గురించి జోష్ జాగ్రత్తవహిస్తుంది.
బి. ప్లాట్ ఫాం /సేవలు మరియు యూజర్స్ మధ్య వ్యక్తిగత సమాచారం వినిమయం చేయడాన్ని ఎస్ఎస్ఎల్ (సెక్యూర్ సాకెట్ లేయర్) సురక్షితమైన కమ్యూనికేషన్ ఛానల్ ను ఉపయోగించి జోష్ కాపాడుతుంది. అయితే, అనధికార ప్రవేశం లేదా వాడకం, హార్డ్ వేర్ లేదా సాఫ్ట్ వేర్ వైఫల్యం మరియు యూజర్ సమాచారం యొక్క భద్రతతో ఏ సమయంలోనైనా రాజీపడే ఇతర అంశాలు ద్వారా పొందబడిన ఏదైనా సమాచారం యొక్క భద్రతకు జోష్ హామీ ఇవ్వదు. ఆమె /అతని డివైజ్ కు యాక్సెస్ ను పరిమితం చేయడం ద్వారా ఆమె/అతని అకౌంట్ ను మరియు వ్యక్తిగత సమాచారాన్ని అనధికారంగా పొందడాన్ని నివారించడం యూజర్ కు ప్రధానం. [SS2]
6. యూజర్ సమాచారం పై నియంత్రణ
ఉపయోగించబడే నియమాలకు అనుగుణంగా మీ వ్యక్తిగత సమాచారంలో నియంత్రణ కలిగి ఉండాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము :
ఎ. పొందడం, సవరింపు మరియు పోర్టబిలిటి. మీరు నేరుగా మా ప్లాట్ ఫాం పై మీ అకౌంట్ సమాచారాన్ని ఎడిట్ చేయవచ్చు. ఎందుకంటే మీ గోప్యత మాకు ప్రధానం, మీ గుర్తింపును ధృవీకరించవలసిందిగా మిమ్మల్ని మేము కోరుతాం. ఉదాహరణకు ఇతర యూజర్స్ లేదా చట్టబద్ధం కాని గోప్యతకు నష్టాన్ని కలిగించే అభ్యర్థన చేసిన విషయంతో సహా, చాలా కారణాలు వలన మీ వ్యక్తిగత సమాచారాన్ని అప్ డేట్ చేయవలసిందిగా మీ అభ్యర్థనను మేము తిరస్కరించవచ్చు.
బి. అనుమతులను రద్దు చేయడం. చాలా కేసులలో, మీరు మమ్మల్ని మీ సమాచారాన్ని ఉపయోగించనిస్తే, మాచే విధించబడిన అనుమతి కోసం తగిన ప్రక్రియ ప్రకారం మాకు తెలియచేయడం ద్వారా మీ అనుమతిని మీరు రద్దు చేయవచ్చు.
సి. తొలగించడం. మీరు జీవితాంతం జోష్ యూజర్ గా ఉంటారని మేము ఆశిస్తున్నాము, అయితే ఏదైనా కారణం వలన మీరు ఎప్పుడైనా మీ అకౌంట్ ను తొలగించాలని కోరుకుంటే, మీ సోషల్ లాగిన్ ఆధారంగా ఏ విధంగా తొలగించవచ్చో తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న విధాలు అనుసరించండి. దీనిలో మీరు లేదా ఇతరులు మాకు కేటాయించిన డేటా మరియు మా సేవలను ఉపయోగించడం నుండి ఉత్పన్నమైన డేటా భాగంగా ఉన్నాయి. చట్టం కోరినట్లయితే ఆ సమాచారాన్ని కూడా మేము మీకు ఇస్తాము. పరిమితమైన సమయం కోసం లేదా చట్టం కోరిన విధంగా బ్యాక్అప్ లో కూడా మేము కొంత సమాచారం నిలిపి ఉంచుతాం.
7. యూజర్ సమాచారం అందచేయడం
మాకు సేవలను కేటాయించి, నిర్వహించి మరియు మెరుగుపరచడంలో సహాయపడే మేము మా కార్పొరేట్ గ్రూప్ తో మరియు ఎంపిక చేయబడిన మూడవ పక్షం భాగస్వాములు లేదా వ్యాపార సహచరులతో కలిసి పని చేస్తాం. మేము మీ సమాచారాన్ని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్, సీడీఎన్ లు, ఐఎస్ పీలు, టెక్నాలజీ భాగస్వాములు, కంటెంట్ మోడరేషన్ సేవలు, మెజర్మెంట్ ప్రొవైడర్స్, ప్రకటనదారులు మరియు అనలిటిక్స్ ప్రొవైడర్స్ తో కూడా భాగస్వామం చేస్తాం. చట్టం కోరినప్పుడు, కోరిన చోట, మేము మీ సమాచారాన్ని చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు లేదా రెగ్యులేటర్స్ తో మరియు చట్టబద్ధంగా నిబద్ధత కలిగి ఉన్న కోర్టు ఆదేశంతో కూడా మీ సమాచారాన్ని అందచేస్తాము. వ్యాపార భాగస్వామం, ఒప్పందపు నిమగ్నత, విలీనం, సేకరణ, లేదా జోష్ ఆస్తుల మొత్తం లేదా ఒక భాగాన్ని వేరొక పక్షానికి విక్రయించడం కోసం వేరొక పక్షానికి వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేసే హక్కు జోష్ కు ఉంది, మరియు అలాంటి పరిస్థితిలో, ఈ గోప్యతా విధానం యొక్క నియమాలు మీకు తెలియచేయబడితే మినహా వర్తించడం కొనసాగుతాయి.
ఎ. జోష్ సేకరించిన మీ వ్యక్తిగత సమాచారాన్ని ఈ పాలసీలో పేర్కొన్న విధంగా మినహా జోష్ మూడవ పక్షాలకు విక్రయించదు, వాణిజ్యం చేయదు లేదా కిరాయికి ఇవ్వదు. జోష్ వ్యాపార భాగస్వాములు, కాంట్రాక్టర్స్, అనుబంధ సంస్ధలు ( జోష్ ఇన్నోవేషన్ సహా) మరియు ప్రకటనదారులతో సందర్శకులు మరియు యూజర్స్ కు సంబంధించి ఏదైనా వ్యక్తిగత సమాచారానికి లింక్ చేయబడని మొత్తం జనాభా సమాచారాన్ని అందచేయవచ్చు.
బి. యూజర్స్ గురించి వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడానికి చట్టం లేదా వ్యాజ్యం జోష్ ను కోరవచ్చు. జాతీయ భద్రత, చట్టాన్ని అమలుచేయడం , లేదా సమాచారం వెల్లడించటం అవసరమయ్యే ప్రజా ప్రాధాన్యత కలిగిన ఇతర సమస్యలను జోష్ నిర్ధారిస్తే జోష్ యూజర్స్ గురించి కూడా సమాచారాన్ని వెల్లడించవచ్చు.
సి. ప్లాట్ ఫాం యొక్క వాడకం యొక్క వర్తించే నియమాలను అమలు చేయడానికి అవసరమైతే మరియు /లేదా మా హక్కులు మరియు ఆస్తిని లేదా మా అధికారులు, డైరక్టర్స్, భాగస్వాములు, ఉద్యోగులు లేదా ఏజెంట్స్ ను కాపాడటానికి తగిన విధంగా అవసరమైనప్పుడు కూడా జోష్ సమాచారాన్ని వెల్లడించవచ్చు
డి. వ్యాపార భాగస్వామం, ఒప్పందపుపరంగా నిమగ్నం కావడం, విలీనం, సేకరణ వలన యూజర్స్ వ్యక్తిగత సమాచారాన్ని వేరొక పక్షానికి బదిలీ చేయడానికి లేదా జోష్ యొక్క ఆస్థులు అన్నీ లేదా సగం భాగాన్ని వేరొక పక్షానికి విక్రయించడానికి జోష్ హక్కును పొందుపరుచుకుంది , మరియు అలాంటి పరిస్థితిలో, మీకు వేరొక విధంగా తెలియచేయబడితే మినహా ఈ గోప్యతా విధానం యొక్క నియమాలు వర్తించడం కొనసాగుతుంది.
7. కుకీస్
మేము కుకీస్ ఉపయోగించవచ్చు , ఉదాహరణకు, మీ ప్రాధాన్యతలు మరియు అకౌంట్ ప్రొఫైల్ సమాచారాన్ని గమనించడానికి , లేదా మీ యూజర్ అనుభవం మరియు ప్లాట్ ఫాం యొక్క సామర్థ్యం మరియు ప్రభావం మరియు అక్కడ అందించిన కొన్ని సేవలు మరియు పనితీరులు మెరుగ్గా పెంపొందిస్తాయని మేము భావించే కొన్ని పునః లక్ష్యాల కార్యకలాపాలలో నిమగ్నమవడానికి. సాధారణ వాడకం మరియు వ్యక్తిగత సమాచారం లేని పరిమాణ గణాంకపరమైన సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించడానికి కూడా కుకీస్ ఉపయోగించబడతాయి. ప్లాట్ ఫాం యూజర్స్ గురించి మా కోసం సమూహం గణాంకాలు సంకలనం చేయడానికి వ్యక్తిగతయేతరంగా గుర్తించదగిన సమాచారాన్ని సేకరించడానికి మీ కంప్యూటర్ పై కుకీస్ ఉంచడానికి మేము వేరొక కంపెనీ లేదా మూడవ పక్షం సేవలను కూడా ఉపయోగించవచ్చు.
కుకీస్ అనగా చిన్న సమాచారం రాశి, మీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ పై మీ ఇంటర్నెట్ బ్రౌజర్ వీటిని టెక్ట్స్ ఫైల్స్ వలే భద్రపరుస్తుంది. చాలా ఇంటర్నెట్ బ్రౌజర్స్ ఆరంభంలో కుకీస్ ను ఆమోదిస్తాయి. వెబ్ సైట్స్ నుండి కుకీస్ ను తిరస్కరించడానికి లేదా మీ హార్డ్ డ్రైవ్ నుండి కుకీస్ ను తొలగించడానికి మీరు మీ బ్రౌజర్ ను సెట్ చేయవచ్చు, కానీ మీరు ఆ విధంగా చేసినట్లయితే, మీరు ప్లాట్ ఫాం యొక్క భాగాలను పొందలేకపోవచ్చు లేదా ఉపయోగించలేకపోవచ్చు లేదా ఉద్దేశించిన విధంగా ప్లాట్ ఫాం పై ఉన్న కొన్ని ఆఫరింగ్స్ పని చేయకపోవచ్చు. మిమ్మల్ని ట్రాక్ చేయవద్దని వెబ్ సైట్ కు చెప్పటానికి మీకు అనుమతిని ఇచ్చే " డు నాట్ ట్రాక్ " ఫీచర్స్ కొన్ని బ్రౌజర్స్ కు ఉంటాయి. ఈ ఫీచర్స్ అన్నీ ఏకరీతిగా ఉండవు. మీరు కుకీస్ ను బ్లాక్ చేసినట్లయితే, ప్లాట్ ఫాం పై కొన్ని ఫీచర్స్ పని చేయకపోవచ్చు. మీరు కుకీస్ ను తిరస్కరించినా లేదా బ్లాక్ చేసినా, ఇక్కడ వర్ణించబడిన ట్రాకింగ్ అంతా ఆగిపోదు. మీరు ఎంపిక చేసిన కొన్ని ఆప్షన్స్ బ్రౌజర్ -మరియు డివైజ్ ప్రత్యేకంగా ఉంటాయని దయచేసి గమనించండి.
ఎ. మీరు ప్లాట్ ఫాంను మరియు /లేదా సేవలను ఎప్పుడు యాక్సెస్ చేసినా మీ అనుభవాన్ని పెంచడానికి లేదా మీకు వ్యక్తిగత అనుభవం ఇవ్వడానికి జోష్ రికార్డ్ ను ఉంచే లక్ష్యాలు కోసం కుకీస్ ను ఉంచవచ్చు. మీరు సందర్శించే ప్లాట్ ఫాం ద్వారా మీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ పై ఉంచబడే చిన్న టెక్ట్స్ ఫైల్స్ ని కుకీస్ అంటారు. ప్లాట్ ఫాం పై మీ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని గుర్తించడంలో మరియు మీ ప్రాధాన్యతలు మరియు చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని నిలిపి ఉంచడంలో కుకీస్ జోష్ కు సహాయపడతాయి.
బి. మీకు మరియు మీ ఆసక్తులకు సంబంధించిన ప్రకటనలను అందించడానికి జోష్ మరియు /లేదా దాని సర్వీస్ ప్రొవైడర్స్ ప్రకటనా కుకీస్ ను ఉపయోగించవచ్చు.
సి. వెబ్ బ్రౌజర్ పై కుకీ ఫీచర్ ఆఫ్ చేయడం ద్వారా మీరు కుకీస్ ను డిజేబుల్ చేయవచ్చు. అయితే, ఈ ఫీచర్ ను డిజేబుల్ చేయడం వలన, ప్లాట్ ఫాంలో ఉండే కొన్ని భాగాలు సక్రమంగా పని చేయకపోవచ్చు. ఇది ప్లాట్ ఫాం మరియు సేవలు యొక్క పూర్తి ప్రయోజనాలను మీరు తీసుకోవడంలో నివారించవచ్చు.
8. సమాచారాన్ని కలపడం
మీ ఆసక్తులు, ఇష్టాలు మరియు/లేదా ప్రాధాన్యతలకు అత్యంత సంబంధం ఉన్న ఆఫర్స్, ప్రమోషన్స్ మరియు సమాచారం కేటాయించడానికి ప్లాట్ ఫాం మరియు సర్వీసెస్ లో మీ వ్యక్తిగత మరియు ఇతర సమాచారాన్ని జోష్ కలపవచ్చు. ప్లాట్ ఫాం పై జోష్ కు మీరు అందచేసే సమాచారాన్ని మరియు కంటెంట్, ప్రకటనలు, ప్రమోషన్స్, ఆఫర్స్ కేటాయించడానికి మరియు ప్లాట్ ఫాం మరియు సర్వీసెస్ పై యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మాతో సమాచారం పంచుకోవడానికి మీరు ధృవీకరించి మరియు మీరు కేటాయించిన మూడవ పక్షాలకు సమాచారంతో సేవలకు సంబంధించి కూడా జోష్ కలపవచ్చు. మీ సమాచారం కలిగిన మరియు సమాచారాన్ని కలపడానికి ధృవీకరించబడిన, మూడవ పక్షాలతో మీ సమాచారాన్ని కూడా జోష్ పంచుకోవచ్చు.
9. మీ డేటాను జోష్ ఎంత కాలం నిలిపి ఉంచుతుంది
సర్వీస్ ను మీకు కేటాయించడానికి అవసరమైన సమయానికి గాను జోష్ వ్యక్తిగత సమాచారాన్ని నిలిపి ఉంచుతుంది. మీకు సర్వీస్ ను కేటాయించడానికి మాకు మీ ఒకవేళ, మీ సమాచారం అవసరం లేకపోతే, అలాంటి డేటాను ఉంచడానికి చట్టబద్ధమైన వ్యాపార లక్ష్యాన్ని మేము కలిగి ఉన్నంత కాలం వరకు మాత్రమే మేము నిలిపి ఉంచుతాం. కొన్ని సందర్భాలలో, మా చట్టబద్ధమైన బాధ్యతలకు అనుగుణంగా ఈ డేటాను చాలా కాలం మేము ఉంచబోయే చోట లేదా చట్టం అనుమతించిన లేదా స్థాపించడానికి , అమలు చేయడానికి అవసరమైన చోట మేము ఉంచుతాము.
మా నిలిపి ఉంచే సమయాలను నిర్ణయించడానికి ఉపయోగించిన అర్హతలో ఇవి భాగంగా ఉన్నాయి:
యూజర్స్ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని జోష్ కేవలం సేకరించబడిన లక్ష్యం కోసం మరియు చట్టం కోరినంత విధంగా అవసరమైనంత మేరకు మాత్రమే ఉంచుతుంది. ఆ నిలిపి ఉంచే సమయం చివరిలో, జోష్ సమాచారం తొలగించవచ్చు లేదా అనామకం చేయవచ్చు లేదా దానికి మారు పేరు పెట్టవచ్చు.
10. మీ డేటాను ఉపయోగించడం నుండి జోష్ ను మీరు ఏ విధంగా ఆపుచేయగలరు
ఎ. జోష్ మీ ప్రాధాన్యతలకు విలువనిస్తుంది మరియు మాతో నేరుగా మార్కెటింగ్ సమాచారాలు పంచుకోవడాన్ని ఆపుచేయడానికి ఆప్షన్స్ కేటాయిస్తుంది. ఈ క్రింది వాటిలో ఏవైనా చేయడం ద్వారా మీరు ప్రత్యక్ష మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ ను ఆపుచేయవచ్చు:
i. 'అన్ సబ్ స్క్రైబ్ ' పై క్లిక్ చేయండి లేదా ఒక ప్రత్యేకమైన విభాగం, సేవ లేదా జట్టు నుండి ఈమెయిల్ సమాచారాలు నుండి 'ఆప్ట్-అవుట్ ' చేయండి;
ii. మీ అకౌంట్ లోకి లాగిన్ ఇన్ చేయండి మరియు మీ గోప్యతా ప్రాధాన్యతలను మార్చండి.
బి. మీరు మార్కెటింగ్ సమాచారాలు నుండి ఆప్ట్-అవుట్ చేసినట్లయితే, మీ అకౌంట్ గురించి ఈమెయిల్స్, ప్లాట్ ఫాంకు సంబంధించిన మరియు /లేదా సేవలకు సంబంధించిన అప్ డేట్స్, మరియు /లేదా ఏవైనా ఇతర వ్యాపార కమ్యూనికేషన్స్ వంటి ప్రోత్సాహేతర ఈమెయిల్స్ /నోటిఫికేషన్స్ ను మీరు ఇంకా అందుకోవచ్చు.
సి. మీరు గోప్యతా విధానంతో అంగీకరించకపోతే మీ డివైజ్ నుండి ప్లాట్ ఫాంను తొలగించడం ద్వారా ప్లాట్ ఫాం మరియు సేవలను ఉపయోగిస్తూ మీరు కొనసాగించడం ఆపుచేయవచ్చు మరియు /లేదా అన్ ఇన్ స్టాల్ చేయవచ్చు లేదా ఈ పాలసీలో కేటాయించబడిన వాడకాలు కోసం మీ సమాచారాన్ని అందచేయబడాలని కోరుకోవద్దు.
11. ఈ గోప్యతా విధానానికి మార్పులు మరియు అప్ డేట్స్
మేము ఈ గోప్యతా విధానాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తాము. మేము గోప్యతా విధానాన్ని అప్ డేట్ చేసినప్పుడు, "చివరి అప్ డేటెడ్ " తేదీని ఈ పాలసీ పైన అప్ డేటింగ్ చేయడం ద్వారా మరియు కొత్త గోప్యతా విధానాన్ని పోస్టింగ్ చేయడం ద్వారా మరియు వర్తించే చట్టం కోరిన విధంగా ఏదైనా ఇతర నోటీసును కేటాయించడం ద్వారా మేము మీకు తెలియచేస్తాం. అప్ డేట్ చేయబడిన పాలసీ యొక్క తేదీ తరువాత ప్లాట్ ఫాంను నిరంతరంగా పొందడానికి లేదా ఉపయోగించడానికి అప్ డేట్ చేయబడిన పాలసీకి మీ అంగీకారాన్ని ఏర్పరుస్తుంది.
జోష్ ఈ గోప్యతా విధానాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంది మరియు సవరిస్తుంది. సవరించబడిన గోప్యతా విధానం ఇక్కడ పోస్ట్ చేయబడుతుంది. ఈ గోప్యతా విధానానికి కలిగిన మార్పులు గురించి తెలియచేయబడి ఉండటానికి క్రమానుగతంగా ఈ పేజీని తనిఖీ చేయవలసిందిగా మీరు ప్రోత్సహించబడతారు. ఈ గోప్యతా విధానాన్ని క్రమానుగతంగా సమీక్షించడం మీ బాధ్యతగా మరియు సవరణలు గురించి చైతన్యం కలిగి ఉండటానికి మీరు అంగీకరించారు మరియు గుర్తించారు. గోప్యతా విధానానికి కలిగిన ఏవైనా మార్పులతో మీరు అంగీకరించకపోతే, మీరు ప్లాట్ ఫాం మరియు సేవలను ఉపయోగించడం లేదా యాక్సెసింగ్ చేయడం నుండి నివారించబడతారు. సవరించబడిన పాలసీని పోస్ట్ చేసిన తరువాత మీరు నిరంతరంగా ప్లాట్ ఫాం మరియు /లేదా సేవలను ఉపయోగించడం మార్పులకు మీ ఆమోదం మరియు గుర్తింపును సూచిస్తుంది మరియు మీరు మారిన పాలసీకి కట్టుబడి ఉంటారు.
12. నోటీసు మరియు ఫిర్యాదు పరిష్కారం యంత్రాంగాలు
యాప్ ద్వారా పొందగలిగే ప్రకటనలు లేదా కంటెంట్ కోసం జోష్ బాధ్యతవహించదని ప్రత్యేకించి నోటీసు ఇవ్వబడింది. మూడవ పక్షం హక్కులు ఉల్లంఘించడానికి క్లెయిమ్ చేయబడిన కంటెంట్ కు యాక్సెస్ ను తొలగించడానికి మరియు /లేదా ఆపుచేయడానికి మరియు /లేదా జోష్ మరియు /లేదా ఇతర మూడవ పక్షాలు యొక్క ఇతర హక్కులు పై ఉల్లంఘనలు చేసే ప్లాట్ ఫాం యూజర్స్ యొక్క అకౌంట్స్ ను రద్దు చేయడానికి జోష్ కు నిర్ణయాధికారం ఉంది.
ఫిర్యాదు పరిష్కారం యంత్రాంగం
ఫిర్యాదులతో వ్యవహరించడానికి జోష్ ఈ క్రింది యంత్రాంగాన్ని అమలు చేసింది:
ఇక్కడ పేర్కొనబడిన ప్రక్రియ ద్వారా "రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ " కు సర్వీస్, ఒప్పందం, గోప్యతా విధానం మరియు కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలకు సంబంధించిన ఫిర్యాదులు లేదా ఆందోళనల ఉల్లంఘనలను పరిష్కరించాలి.
(ఏ) యాప్ పై స్వీయ -నివేదిక : ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ పై యాప్ లో రిపోర్ట్ కంటెంట్ ఫీచర్ ను ఉపయోగించడం ద్వారా కూడా మీరు కంటెంట్ గురించి నివేదించవచ్చు.
(బి) ఈమెయిల్ : సమాచారం సాంకేతికత చట్టం 2000 ప్రకారం మరియు గ్రీవెన్స్ అధికారిని సంప్రదించవలసిన వివరాలు క్రింద చేసిన నియమాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
శ్రీ నాగరాజు
ఈమెయిల్ : grievance.officer@myJosh.in
(సి) ప్రత్యామ్నాయంగా, మీరు మాకు రాయడం ద్వారా
కి,
శ్రీ. నాగరాజు
గ్రీవెన్స్ అధికారి
వెర్సే ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్
11వ అంతస్తు, వింగ్ ఈ, హీలియోస్ బిజినెస్ పార్క్,
ఔటర్ రింగ్ రోడ్, కడుబీసనహల్లి,
బెంగళూరు - 560103, కర్ణాటక, భారతదేశం
మా ప్రోడక్ట్ ను ఉపయోగించే వారు ఎదుర్కొన్న సమస్య లేదా ఫిర్యాదును ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్ ద్వారా సమర్పించవచ్చు. ఫిర్యాదు ఈ విషయాలు సమర్పించాలి :(i) సంబంధిత ఖాతాదారుని యూజర్ నేమ్ (ii) విచారానికి సంబంధించిన నిర్దేశిత కంటెంట్ /వీడియో (iii) అలాంటి అభ్యర్థన తీసుకోవడానికి గల కారణం (లు).
ఫిర్యాదును పరిష్కరించడానికి జోష్ కు అవసరమైన అలాంటి సమాచారాన్ని ఫిర్యాదు తప్పనిసరిగా కలిగి ఉండాలి. జోష్ కు ఇక్కడ ఉన్న అన్ని నోటీసులు రాతపూర్వకంగా ఉండాలి మరియు వ్యక్తిగతంగా డెలివరీ చేయబడితే లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ద్వారా పంపించబడితే , వాపసు రసీదు అభ్యర్థించబడితే లేదా పైన చెప్పిన చిరునామాకు ఫాసిమైల్ చేయబడితే లేదా ఈమెయిల్ చేయబడితే తగిన విధంగా ఇవ్వబడుతుంది.
ఈ డాక్యుమెంట్ సమాచారం సాంకేతికత (ఇంటర్వీడియేటరీ గైడ్ లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021 నియమాలు ప్రకారం ప్రచురించబడింది. ఇది యాప్ యాక్సెస్ లేదా వినియోగానికి సంబంధించిన నియమాలు మరియు నిబంధనలు, గోప్యతా విధానం మరియు నిబంధనలను ప్రచురించడాన్ని కోరుతోంది.
ఈ యూజర్ ఒప్పందం నియమాలు, ఒప్పందాన్ని నేను చదివాను, అర్థం చేసుకున్నాను, నేను నా అభీష్టం మేరకు, బేషరతుగా వీటికి కట్టుబడి ఉండటానికి ఆమోదించాను.
ఈ గోప్యతా విధానం గురించి మీకు ఏవైనా విచారాలు లేదా ఫిర్యాదులు ఉంటే, మీరు జోష్ వారి గ్రీవెన్స్ ఆఫీసర్ ను ఈమెయిల్ లేదా మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. "ప్రైవసీ గ్రీవెన్స్" పేరుతో మీరు ఫిర్యాదులను ఈమెయిల్ అడ్రస్ (ఈమెయిల్ అడ్రస్ చేర్చండి) కి మీరు పంపించవచ్చు. ఈమెయిల్ లేదా లేఖ రాయడం ద్వారా పైన చెప్పిన పద్ధతులలో గ్రీవెన్స్ ఆఫీసర్ ను సంప్రదించవచ్చు:
Landscape mode not supported, Please try Portrait.