జనవరి 2023

కమ్యూనిటీ మార్గదర్శకసూత్రాలు

పరిచయం

ఈ కమ్యూనిటీ మార్గదర్శకాలు ("మార్గదర్శకాలు") భారతదేశంలోని చట్టాలు ద్వారా స్థాపించబడిన ప్రైవేట్ కంపెనీ, హీలియోస్ బిజినెస్ పార్క్, 11వ అంతస్తు, వింగ్ ఈ, హేలియోస్ బిజినెస్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్, కడుబీసనహళ్లి, బెంగళూరు- 560103, కర్ణాటక, భారతదేశంలో తమ రిజిష్టర్డ్ కార్యాలయం గల వెర్సే ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ("వెర్సే" లేదా "మా" లేదా "మా" లేదా "జోష్") నిర్వహించే మా 'జోష్' వెబ్ సైట్ /మొబైల్ అప్లికేషన్ ("ప్లాట్ ఫాం") ను ఆదేశిస్తున్నాయి. "మీరు", "మీ యొక్క", "యూజర్" మరియు "యూజర్స్" పదజాలాన్ని సందర్భంతో కలిపి చదవాలి మరియు ఇది మిమ్మల్ని సూచిస్తుంది.

ఈ పత్రం సమాచారం సాంకేతికత చట్టం 2000 నియమాలకు అనుగుణంగా ప్రచురించబడి సమాచారం సాంకేతికత (రీజనబుల్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ మరియు ప్రొసీజర్స్ మరియు సెన్సిటివ్ పర్శనల్ డేటా లేదా ఇన్ఫర్మేషన్) నియమాలు, 2011 మరియు సమాచారం సాంకేతికత (ఇంటర్మీడియేటరి గైడ్ లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021తో సహా తత్సంబంధిత నియమాలతో పాటు చదవబడుతుంది.

ఏ. మీ ఆమోదం

ఈ ప్లాట్ ఫాం పై కంటెంట్ చూడటానికి లేదా పోస్ట్ చేయడానికి ముందు దయచేసి జాగ్రత్తగా మార్గదర్శకసూత్రాలు చదవండి. ఈ ప్లాట్ ఫాం పై ఏదైనా కంటెంట్ ను చూడటం లేదా పోస్ట్ చేయడం ద్వారా, ఈ మార్గదర్శకసూత్రాలు యొక్క నియమాలు, షరతులకు మీరు అంగీకరించారు.

ఈ మార్గదర్శకాలు సేవా నియమాలలో అంతర్భాగంగా ఉంటాయి. మీరు ప్లాట్ ఫాంను ఉపయోగించడం ఆరంభించినప్పుడు మీరు వాడకం, గోప్యత మరియు పాలసీ యొక్క నియమాలకు మరియు ఈ సమాజ మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి ఉండాలి.

ప్లాట్ ఫాం వివిధ ఆధారాలు నుండి కంటెంట్ మొత్తాన్ని సమన్వయం చేస్తుంది. వెర్సే ఒక మధ్యవర్తిగా కేవలం వివిధ రకాల కంటెంట్స్ ను పొందడానికి అవకాశం ఇస్తుంది. ఈ పాలసీ లక్ష్యం కోసం, వెర్సేకి సంబంధించిన ఏదైనా సూచనలో దాని అనుబంధ సంస్థలు, వ్యాపార భాగస్వాములు, భాగస్వామ్య కంపెనీ, మాతృ కంపెనీ మరియు సోదరి సంస్థలు భాగంగా ఉంటాయి.

ప్రపంచం మరింత అందుబాటులో ఉండటానికి మరియు కలపబడి ఉండటానికి ప్రజలకు శక్తిని ఇవ్వడమే మా మిషన్. తమ కథలు పంచుకోవడానికి, ఇతరుల కళ్ల ద్వారా ప్రపంచాన్ని చూడటానికి మరియు స్నేహితులు మరియు కారణాలతో కనక్ట్ అవడానికి ప్రజలు ప్రతిరోజూ మా ప్లాట్ ఫాంకి వస్తుంటారు. ప్లాట్ ఫాం పై జరిగే సంభాషణలు ఒక బిలియన్ ప్రజలు కంటే ఎక్కువమంది విభిన్నమైన ప్రజలను ప్రతిఫలింప చేస్తాయి.

మా ప్లాట్ ఫాంను ఉపయోగించేటప్పుడు మేము ప్రజలు సురక్షితమైన భావన కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. ఆ కారణంగా, మేము సమాజ మార్గదర్శక సూత్రాలను అభివృద్ధి చేసాము, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. ప్లాట్ ఫాం పై ఏ రకమైన కంటెంట్ అనుమతించబడుతుంది మరియు ఏ రకమైన కంటెంట్ గురించి మాకు ఫిర్యాదు చేయవచ్చు మరియు తొలగించబడవచ్చో అర్థం చేసుకోవడానికి ఈ పాలసీలు మీకు సహాయపడతాయి. మా అంతర్జాతీయ సమాజం యొక్క విభిన్నత వలన, మీకు భంగం కలిగించేది లేదా ఆమోదయోగ్యం కానిది మా సమాజ మార్గదర్శకసూత్రాలను ఉల్లంగించకపోవచ్చని దయచేసి దృష్టిలో పెట్టుకోండి.

ఐటీ చట్టం క్రింద ప్లాట్ ఫాంను ఒక మధ్యవర్తిగా వెర్సే నిర్వహిస్తోంది.

ఈ పాలసీ /ఒప్పందం ("పాలసీ") లక్ష్యం కోసం , కంటెంట్ అంటే ప్లాట్ ఫాం పై ప్రజలకు తెలియచేయబడిన, ప్రదర్శించబడిన, ప్రసారం చేయబడిన, ప్రచురించబడిన, హోస్ట్ చేయబడిన టెక్ట్స్, చిత్రాలు, ఆడియో, వీడియో సహా కానీ వీటికి మాత్రమే పరిమితం కాదని అర్థం. స్పష్టత కోసం, కంటెంట్ లో వ్యాఖ్యానాలు మరియు హైపర్ లింక్స్ కూడా ఉంటాయి.

మీరు ప్లాట్ ఫాంను ఉపయోగించినప్పుడు, మీరు ఈ పాలసీ నియమాలు, సేవా నియమాలు మరియు గోప్యతా పాలసీకి అంగీకరించారు. మీరు ఈ నియమాలలో వేటికైనా అంగీకరించకపోతే, దయచేసి ప్లాట్ ఫాం ఉపయోగించడం ఆపండి.

బి. ఈ ప్లాట్ ఫాం పై కంటెంట్

వెర్సే కేవలం ఒక మధ్యవర్తి మరియు టెక్నాలజీని కేటాయిస్తుంది మరియు సమాచారం సాంకేతిక చట్టం 2000 యొక్క నియమాలతో పాటు ఉన్న షరతుల ద్వారా గుర్తించబడింది. ప్లాట్ ఫాం పై పోస్ట్ చేయబడిన కంటెంట్ యూజర్స్ చే పోస్ట్ చేయబడింది మరియు కంటెండ్ ప్రొవైడర్స్ నుండి సంపాదించబడింది. వెర్సేకి కంటెంట్ కు సంబంధించి ఎలాంటి నియంత్రణ లేదు, మరియు కంటెంట్ యొక్క చెల్లుబాటు లేదా చట్టబద్ధత , సరిగ్గా ఉండటం గురించి హామీ ఇవ్వదు. వెర్సే అన్ని వారంటీలను స్పష్టంగా తిరస్కరిస్తోంది మరియు సివిల్ లేదా క్రిమినల్ చట్టం క్రింద ఏవైనా ఉల్లంఘనలకు బాధ్యతవహించదు.

ప్లాట్ ఫాం పై కంటెంట్ వెర్సే సొంతం కాదు కాబట్టి , ఇది ప్లాట్ ఫాం పై లభించే లేదా పోస్ట్ చేయబడిన ఏదైనా కంటెంట్ కోసం బాధ్యతవహించదు.

చదువు, వినోదం, విమర్శ లేదా సమాచారం వ్యాప్తి సహా చట్టబద్ధమైన మరియు వాణిజ్యేతర లక్ష్యాలు కోసం మాత్రమే మంచి విశ్వాసంతో మీరు కంటెంట్ పోస్ట్ చేయడానికి అంగీకరించారు.

అనధికార మార్గాలు ద్వారా అనగా ఆటోమేటెడ్ డివైజ్ , స్క్రిప్ట్, బాట్ , స్పైడర్, క్రాలర్ లేదా స్క్రాపర్ సహా , వీటికి మాత్రమే పరిమితం కాకుండా మీరు కంటెంట్ ను పొందకూడదు లేదా పోస్ట్ చేయకూడదు.

ప్లాట్ ఫాం పై చెడు ఉద్దేశాలతో లేదా అనధికార మార్గాలు ఉపయోగించి కంటెంట్ ను పోస్ట్ చేయవద్దు .

మీరు పోస్ట్ చేసిన కంటెంట్ చట్టబద్ధమైనదని మరియు వర్తించే చట్టాలు, నియమాలు, నిబంధనలు, పాలసీలు, మార్గదర్శకసూత్రాలు మరియు /లేదా కంటెంట్ ప్రచురించబడిన, ప్రజలకు తెలియచేయబడిన లేదా వెర్సే పంపిణీ చేసిన దేశాలలో కంటెంట్ కు వర్తించే నియమాలను ఉల్లంఘించలేదని మీరు అంగీకరించారు. ప్లాట్ ఫాం పై కంటెంట్ ను పోస్ట్ చేయడానికి మీకు అధికారం ఉందని మీరు నిర్థారించారు. ప్లాట్ ఫాం పై కంటెంట్ లేదా ఏదైనా సమాచారం ప్రచురించడానికి వెర్సేకు ఎలాంటి బాధ్యత లేదు మరియు తన స్వంత నిర్ణయాధికారం మేరకు యూజర్స్ కు తెలియచేసి లేదా తెలియజేయకుండా ఏదైనా కంటెంట్ ను తొలగించవచ్చు.

కంటెంట్ మరియు ప్రవర్తనా పాలసీలు మా యూజర్స్ కోసం సానుకూలమైన అనుభవాన్ని నిర్ధారించడంలో సహాయపడతాయి. కనిపించడానికి అర్హమవడానికి మరియు ప్లాట్ ఫాం పై ఉండటానికి మీ కంటెంట్ మా పాలసీలు ప్రకారం ఉత్తమమైన పద్ధతులను అనుసరించాలి మరియు కంటెంట్ ఇలా చేయరాదు :

1. ద్వేషపూరితమైన ప్రసంగం మరియు వివక్ష

ప్లాట్ ఫాంలో ఉన్న ఇతరులను గౌరవించాలి, మర్యాద చూపించాలి, సానుభూతి ప్రదర్శించాలి. చెల్లుబాటయ్యే మరియు మంచి ఉద్దేశ్యం గల , మంచి అనంగీకారం యొక్క వ్యక్తీకరణలను ప్లాట్ ఫాం పై మేము ప్రోత్సహిస్తాం. మేము ద్వేషపూరితమైన, వ్యక్తిగత దాడులు, సంబంధం లేని సంభాషణ లేదా నాగరికత లేని-అనంగీకారం అనగా వేరొక యూజర్ కు హాని కలిగించేది లేదా వారికి మానసికమైన ఒత్తిడి లేదా బాధను కలిగించేది మేము అనుమతించము. ద్వేషపూరితమైన లేదా వివక్షా సంభాషణలో హింసని ప్రోత్సహించడం , జాతి పై అభ్యంతరకరమైనవ్యాఖ్యానాలు చేయడం లేదా ఎవరిదైనా వారి దేశం, లింగం, లింగ గుర్తింపు, లైంగిక దృక్పథం, మతపరమైన నమ్మకాలు, అంగ వైకల్యాలు లేదా వ్యాధులు ఆధారంగా అవమానించడం వంటివి ఉదాహరణగా ఉన్నాయి. ఇతరులు కూడా అలాంటి కంటెంట్ ను పంచుకోవడాన్ని ప్రోత్సహించే కంటెంట్ ను మేము నిషేధిస్తాం. మీ ప్రొఫైల్ చిత్రం లేదా ప్రొఫైల్ హెడర్ లో ద్వేషపూరితమైన చిత్రాలు లేదా చిహ్నాలు ఉపయోగించడానికి మీరు అనుమతించబడరు.  మీరు ద్వేషించే ప్రవర్తనలో నిమగ్నమైనట్లుగా లేదా ఇతర యూజర్ (లకు) వేధింపును కలిగించేదిగా తగిన విధంగా అర్థం చేసుకునేదిగా లేదా ద్వేషాన్ని వ్యక్తం చేసేదిగా మీరు మీ యూజర్ నేమ్, డిస్ ప్లే పేరు లేదా ప్రొఫైల్ బయోను కూడా మార్చకూడదు.

నిర్దేశిత కంటెంట్ పోస్ట్ చేయబడకూడదు, అప్ లోడ్ చేయబడకూడదు, స్ట్రీమ్ చేయకూడదు లేదా తెలియచేయకూడదు:

  • కంటెంట్ లో పేర్లు, చిహ్నాలు, లోగోలు, మ్యాప్ లు, ఫ్లాగ్స్, నినాదాలు లేదా ద్వేషం మరియు వివక్షకు సంబంధించిన ఇతర వస్తువులు .
  • మతపరమైన ఆచరణలకు సంబంధించిన సంస్కరణ ఉపచారాలను ప్రోత్సహించే, మద్దతు చేసే లేదా ప్రకటించే కంటెంట్.
  • హింస, ద్వేషం, వేర్పాటు లేదా వివక్షను ప్రోత్సహించే కంటెంట్.
  • మతం, కులం, స్త్రీలను ద్వేషించడం, ఎల్.జి.బి.టి.క్యూ. లేదా ఇతర విషయాలు పై ద్వేషపూరితమైన సిద్ధాంతాన్ని మద్దతు చేసే కంటెంట్.

2.మతపరంగా నేరపూరితమైన కంటెంట్

ఇతరులు మీ వలే ఒకే రకమైన అభిప్రాయాలు లేదా నమ్మకాలను

తెలియచేసినా లేదా తెలియచేయకపోయినా సంబంధం లేకుండా ఇతరుల మతపరమైన నమ్మకం, విశ్వాసాలను మీరు ఎల్లప్పుడూ గౌరవించాలి. ఇతరుల సెంటిమెంట్స్ ను బాధించే లేదా తమ మతం లేదా సంప్రదాయాలకు అవమానం కలిగించే ఏదీ కూడా మీరు ప్రచురించరాదు.

3. ఉగ్రవాదం మరియు తీవ్రవాదం

ప్లాట్ ఫాం పై మీరు ఏదైనా ప్రమాదకరమైన కార్యకలాపాలను ప్రోత్సహించరాదు లేదా బెదిరించరాదు. ప్రత్యేకించి మీరు తప్పనిసరిగా తీవ్రవాదం, వేర్పాటు, వ్యక్తి లేదా ఆస్తి పై హింసాత్మకమైన చర్యలను ప్రేరేపించడానికి లేదా భారతదేశం ఐక్యత, సమైక్యత రక్షణ, భద్రత లేదా సౌభ్రాతృత్వాలకు హాని కలిగించడానికి , విదేశాలతో స్నేహపూర్వకమైన సంబంధాలు లేదా వేరొక దేశాన్ని అవమానించడానికి ప్లాట్ పాంను ఉపయోగించరాదు. తీవ్రవాది లేదా దేశ వ్యతిరేక సంస్థ తరపున చర్యలు తీసుకోవడానికి లేదా నియమాకం చేయడానికి మరియు సమాచారం వ్యాప్తి చేయడానికి లేదా అలాంటి సంస్థల లక్ష్యాలను అభివృద్ధి చేయడానికి యూజర్స్ ను ప్రోత్సహించే లేదా ప్రేరేపించే ఏదైనా కంటెంట్ ను మీరు పోస్ట్ చేయరాదు. చట్టబద్ధమైన ఆందోళనలు జరుగుతున్న సమయంలో హింసాత్మకమైన చర్యలను ఆరంభించడానికి లేదా హింసను కలిగించే తీవ్రవాదం మరియు కుట్ర నెట్ వర్క్స్ ను సృష్టించడానికి కూడా మీరు ప్లాట్ ఫాం పై ఆమోదం లేదా మద్దతును కూడా మీరు సంపాదించరాదు.

4. హింసాత్మకమైన మరియు గ్రాఫిక్ కంటెంట్

  • మనుషులు

వేరొక వ్యక్తికి వ్యతిరేకంగా శారీరక హాని కలిగించడానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏవైనా బెదిరింపులు చేయడానికి ప్లాట్ ఫాంను ఉపయోగించరాదు. దీనిలో దొంగతనం, విధ్వంసం, తప్పుగా నిర్బంధించడం, శారీరకంగా, మానసికంగా లేదా ఆర్థికంగా హాని చేయడం భాగంగా ఉన్నాయి. సామూహిక హత్య, హింసాత్మకమైన సంఘటనలు లేదా హింసలో నిర్దేశిత మార్గాలను సూచించే ప్రత్యేకించి దాడికి గురయ్యే సమాజాలు లేదా సమూహాలు ప్రాథమికంగా లక్ష్యంగా కలిగి ఉండే లేదా ఏవైనా అలాంటి చర్యలను వర్ణించే లేదా ప్రస్ఫుటంగా చూపించే కంటెంట్ ను పోస్ట్ చేయడానికి ప్లాట్ ఫాం తన యూజర్స్ కు అనుమతి ఇవ్వదు. ఏ వ్యక్తినైనా లేదా సమూహం యొక్క సెంటిమెంట్స్ కు శారీరక హాని లేదా బాధ కలిగించడాన్ని సంబరం చేసే సంఘటనలు సహా అయితే అందుకు మాత్రమే పరిమితం కాకుండా శారీరక హానిని కలిగించే హింసను ఏ విధంగా కూడా కీర్తించడానికి ప్లాట్ ఫాం అనుమతించదు. వేధించడం, గాయం చేయడం, మానసికంగా బాధపెట్టడం, మరణం, శారీరకంగా హాని కలిగించడం, అపహరణ, ఎత్తుకుపోవడం లేదా హింసకు సంబంధించిన ఇతర రూపాల కంటెంట్ ను మీరు పోస్ట్ చేయరాదు. సమస్యల గురించి చైతన్యం కలిగించడంలో ప్రజలకు సహాయపడే కొన్ని పరిమితులతో మేము కంటెంట్ ను అనుమతిస్తాం.

మీరు పోస్ట్ చేయకూడదు, తెలియచేయకూడదు, అప్ లోడ్ చేయకూడదు లేదా స్ట్రీమ్ చేయకూడదు:

  • వైద్య ఏర్పాట్లలో ఉన్నవి కాని ప్రజలు లేదా మృత దేహాలకు సంబంధించిన వీడియోలు.
  • పరస్పరం హింసను చూపించే వీడియోలు మరియు ఫోటోలు.
  • ఒక వ్యక్తి మరణించిన హింసను చూపించే కంటెంట్.

 జంతువులు

నిజమైన జంతువులను వధించడం లేదా విస్మయానికి గురయ్యే, హింసించి ఆనందిస్తున్న, ముక్కలు చేసిన, కాల్చిన, ఛిద్రం చేసిన జంతువులను అధికంగా చూపించడం లేదా జంతువులు పై కాఠిన్యం చూపించే ఏదైనా కంటెంట్ ను మీరు పోస్ట్ చేయరాదు.

మీరు పోస్ట్ చేయరాదు, తెలియచేయరాదు, అప్ లోడ్ చేయరాదు లేదా స్ట్రీమ్ చేయరాదు;

స్పష్టమైన తయారీ, ఆహారం వినియోగంచడం లేదా ఆహారం తయారీ లేకపోతే మనుష్యులు జంతువులను వధించే వీడియోలు.

  • ఆటవిక విధానంలో శరీరం పునరుత్పత్తి కాని విధంగా ఛిద్రమైన విధంగా జంతువులు మధ్య కోట్లాటలను చూపించే వీడియోలు లేదా చిత్రాలు.
  • జీవించి ఉన్న జంతువుల పై మనుష్యుల వేధింపు లేదా దుర్వినియోగం లేదా దూషణను చూపించే వీడియోలు లేదా చిత్రాలు.
  • కాలిన, ఛిద్రమైన, ముక్కలు చేయబడిన లేదా తగలబెట్టిన జంతువుల అవశేషాలు.

5. మైనర్ భద్రత

మైనర్స్ భద్రత, దీనిలో భాగంగా 18 ఏళ్ల లోపు ఏ వ్యక్తి గురించైనా ఇక్కడ జోష్ లో ప్రధానమైన విచారంగా ఉంది, ప్లాట్ ఫాం దీనిని కాపాడటానికి ఎంతగానో కట్టుబడింది. కాబట్టి, మైనర్స్ లేదా మైనర్ గా కనిపించే ఎవరినైనా నిమగ్నం చేసే ఏదైనా లైంగికంగా లేదా సూచిత కంటెంట్ ను జోష్ నిషేధిస్తుంది. దీనిలో మరియు ఏవైనా ఇతర కంటెంట్  పిల్లలతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం, పిల్లల్ని లైంగికంగా వేధించడం, లేదా వేరొక విధంగా మైనర్స్ ను లేదా మైనర్ గా కనిపించే ఎవరినైనా లైంగికపరమైన కార్యకలాపాల్లో నిమగ్నం చేయడాన్ని వర్ణించే, ప్రోత్సహించే లేదా ప్రోత్సహించే ఫాంటసీ కంటెంట్ (ఉదా కథలు, "లోలి"/ఏనిమీ కార్టూన్స్) సహా పిల్లల లైంగికపరమైన దూషణ , పిల్లల నీలి చిత్రాలు, ఊహా చిత్రాలు భాగంగా ఉన్నాయి. సందర్భాన్ని బట్టి, కొన్ని కేసులలో దీనిలో పూర్తిగా దుస్తులు ధరించిన మైనర్స్ గురించి వర్ణించడం మరియు బహిరంగంగా లైంగికపరమైన చర్యలలో నిమగ్నం కాని పిల్లలు గురించి వర్ణించడం భాగంగా ఉన్నాయి. లైంగికపరంగా సంతృప్తి కలిగించే లేదా స్పష్టపరిచే కంటెంట్ ను మేము మా ప్లాట్ ఫాం పై అనుమతించము, దీనిలో ఈ రకమైన స్వభావం కలిగిన యానిమేటెడ్ కంటెంట్ కూడా భాగంగా ఉంది. కొన్ని న్యాయ పరిధిలలో చట్టబద్ధమైన జరిమానాలను ప్రేరేపించడం మరియు ఏకాభిప్రాయం లేని చిత్రాలను (ఉదాహరణకు, ప్రతీకారం తీర్చుకునే అశ్లీల దృశ్యాలు) పంపించడం ద్వారా మా యూజర్స్ కు హాని కలిగించడం వంటి లైంగికపరమైన కంటెంట్ లో ఎన్నో నష్టాలు ఉన్నాయి. బహిరంగంగా లైంగికపరమైన కంటెంట్ కొన్ని సంస్కృతులలో నేరం కావచ్చు. విద్య, డాక్యుమెంటరీ, శాస్త్రీయమైన లేదా కళాత్మకమైన లక్ష్యాలు కోసం మేము నగ్నత్వం మరియు లైంగికపరంగా స్పష్టమైన కంటెంట్ ను మేము అనుమతిస్తాము. మైనర్ లేదా మైనర్ గా కనిపించే ఎవరినైనా నిమగ్నం చేసే కంటెంట్ గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే, పోస్ట్ చేయవద్దు.

నిర్దిష్టమైన కంటెంట్ ను పోస్ట్ చేయవద్దు, అందచేయవద్దు, అప్ లోడ్ చేయవద్దు లేదా స్ట్రీమ్ చేయవద్దు:

  • లైంగికపరమైన విధానంలో మైనర్స్ ఉన్న కంటెంట్ లేదా వేరొక విధంగా మైనర్ ను లైంగికత్వానికి గురి చేసే కంటెంట్.
  • మైనర్లతో నగ్నత్వం లేదా లైంగికపరమైన కార్యకలాపం సహా పిల్లలను దూషించే చిత్రాలను ప్రోత్సహించే కంటెంట్.
  • మైనర్ దుస్తులు విప్పుతున్నప్పుడు చూపించే కంటెంట్.

6. వయోజనుల నగ్నత్వం మరియు లైంగికపరమైన కంటెంట్

నగ్నత్వం, నీలి చిత్రాలు లేదా బహిరంగంగా లైంగికపరమైన కంటెంట్ కు సంబంధించిన కంటెంట్ ను జోష్ అనుమతించదు. ఏకాభిప్రాయం లేని లైంగికపరమైన చర్య లేదా ఏకాభిప్రాయం లేని ఏదైనా లైంగికపరమైన చర్యను తెలియచేయడం, సన్నిహితంగా ఉన్న చిత్రం లేదా వయోజనుల లైంగికపరమైన అభ్యర్థనను మద్దతు చేసే కంటెంట్ ను కూడా ప్లాట్ ఫాం అనుమతించదు. రొమ్ములను బహిరంగంగా చూపించడం, మర్మాంగాలు, గుదము లేదా పిరుదులు లేదా లైంగికపరమైన చర్యను ప్రదర్శించే లేదా సూచించే లేదా అనుకరించే ప్రవర్తన లక్ష్యంగా ఉన్న కంటెంట్ కూడా నగ్నత్వం మరియు లైంగికపరమైన కంటెంట్ లో భాగంగా ఉన్నాయి. విద్య, డాక్యుమెంటరీ, ప్రజా చైతన్యం లేదా కళాత్మకమైన లక్ష్యాలు కోసం పోస్ట్ చేసిన కంటెంట్ ను మేము అనుమతిస్తాం.

7. సైబర్ బెదిరింపు మరియు వేధింపు

అవమానించబడతామని, కించపరచబడటం, వేధింపు లేదా బెదిరింపు భయం లేకుండా యూజర్స్ తమ గురించి వ్యక్తీకరించడానికి సురక్షితంగా భావించాలి. దూషణ కంటెంట్ వలన వ్యక్తులు పై కలిగే మానసికమైన ఆపదను మేము ఎంతగానో అర్థం చేసుకున్నాము, మరియు మేము దూషణ కంటెంట్ లేదా ప్రవర్తనను మా ప్లాట్ ఫాం పై సహించము. ఒక వ్యక్తి వ్యక్తిగత కార్యకలాపాన్ని అవమానపరిచి లేదా తక్కువ చేసే లక్ష్యం గల కంటెంట్ ప్లాట్ ఫాం పై నుండి తొలగించబడుతుంది. వేరొక వ్యక్తిని వేధించే లక్ష్యం గల లేదా అవమానపరిచే లేదా ఎవరైనా వ్యక్తిని కించపరిచే ఉద్దేశ్యం గల ఏదైనా కంటెంట్ గురించి యూజర్స్ నివేదించాలి.

8. ఆత్మహత్య మరియు స్వీయ-హాని

ఆత్మహత్య, స్వీయ హాని లేదా ప్రమాదకరమైన కార్యకలాపాలలో పాల్గొనడాన్ని ప్రోత్సహించే కంటెంట్ ప్లాట్ ఫాం పై అనుమతించబడదు. స్వీయ హానిని వర్ణించే కంటెంట్, స్వీయ గాయం లేదా ఆత్మహత్యను ప్రేరేపించే కంటెంట్ మరియు ఏ విధంగా ఆత్మహత్య చేసుకోవాలో పేర్కొనే సూచనలు గురించి పోస్ట్స్ లేదా ఏదైనా మార్గంలో స్వయం హాని కలిగించుకునే కంటెంట్ నిషేధించబడింది. తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారికి మద్దతును అందించే ప్రమేయమున్న కంటెంట్ అనుమతించబడుతుంది.

9. గోప్యత పై దాడి

ఇతరుల గోప్యత పై యూజర్స్ గౌరవం చూపించాలని జోష్ ఆశిస్తుంది. వేరొక వ్యక్తికి చెందిన ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని లేదా వారి గోప్యతకు హాని కలిగించేది ప్రచురించడం, ఇవ్వడం లేదా ముద్రించడానికి ప్రోత్సహించడాన్ని మీరు నివారించాలి. సంప్రదించవలసిన సమాచారం, చిరునామా, ఆర్థిక సమాచారం, ఆధార్ నంబర్, పాస్ పోర్ట్ సమాచారం సహా ఎవరిదైనా వ్యక్తిగత డేటా లేదా సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించే కంటెంట్ లేదా అలాంటి సమాచారాన్ని వెల్లడించవలసిందిగా ఎవరినైనా బెదిరించడం లేదా ఉపయోగించడం అనుమతించబడదు లేదా కఠినంగా నిషేధించబడింది.

10. తప్పు సమాచారం మరియు నకిలీ వార్తలు

మోసం చేయడానికి, మోసంతో డబ్బు అపహరించడానికి లేదా ఖచ్చితంగా జరగని సంఘటనలు లేదా చర్యలు యొక్క ప్రాతినిధ్యాన్ని సృష్టించే మార్గాలు ద్వారా తప్పుదోవ పట్టించడానికి సవరించబడిన ఆడియో, వీడియో లేదా చిత్రాల కంటెంట్ ను మేము అనుమతించము. దీని ప్రకారం  అలాంటి కంటెంట్ సమూహాలు లేదా వ్యక్తులకు గణనీయమైన హాని కలిగించవచ్చు లేదా ఎన్నికలు లేదా పౌర ప్రక్రియలలో పాల్గొనడాన్ని లేదా విశ్వాసాన్ని గణనీయంగా బలహీనపరిచే విధంగా సహేతుకమైన వ్యక్తికి ప్రాథమికంగా భిన్నమైన అవగాహనను కలిగిస్తుంది లేదా అభిప్రాయాన్ని కలిగిస్తుంది. తమ ఫాలోయర్స్ లేదా వ్యూస్, వ్యాఖ్యానాలు, షేర్స్ ను పెంచడానికి లేదా ట్రాఫిక్ ను ఉత్పన్నం చేయడానికి యూజర్స్ కృత్రిమమైన లేదా సవరించబడే మార్గాలను ఉపయోగించడం మానివేయాలి.

11. గుర్తింపు దొంగతనం మరియు వేషం మార్పు

కంటెంట్ మూలం గురించి యూజర్స్ ను మోసం చేయడానికి లేదా తప్పుదోవ పట్టించడానికి వేరొక వ్యక్తి, బ్రాండ్ లేదా సంస్థగా వేషం మార్చవద్దు లేదా నటించవద్దు. మిమ్మల్ని మీరు స్వచ్ఛందంగా ధృవీకరించడానికి మరియు మీ ప్రొఫైల్ లో ఇవ్వబడిన అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నట్లుగా మరియు ఏ విధంగా కూడా తప్పు ప్రాతినిధ్యాన్ని రూపొందించబడని విధంగా ప్రోత్సహించబడతారు.

12. అసభ్యకరమైన భాష ">అత్యంత భయంకరమైన లేదా దిగ్భ్రాంతి కలిగించే ప్రత్యేకించి ఘోరమైన హింస లేదా బాధపడటాన్ని ప్రోత్సహించే లేదా ప్రశంసించే కంటెంట్ ను మేము అనుమతించము. కొన్ని పరిస్థితులు కోసం మేము మినహాయింపులు అనుమతిస్తాము, ఉదాహరణకు, సమస్యలు గురించి చైతన్యం కలిగించడానికి ఉద్దేశించబడిన కంటెంట్ లేదా వార్తా సమాచారం విలువ గలది. ప్రజల భద్రతకు హాని లేదా హింసను కలిగించే నిజమైన నష్టాన్ని మేము గుర్తించినప్పుడు, మేము అకౌంట్ నిషేధిస్తాం మరియు అవసరమైనప్పుడు , సక్రమంగా ఉన్నప్పుడు సంబంధిత చట్టబద్ధమైన అధికారులతో కలిసి పని చేస్తాము.

13. మోసపూరితమైన కార్యక్రమాలు

ధృవీకరించబడని లేదా తప్పు లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా పోస్ట్ చేయవద్దు లేదా ఇవ్వవద్దు, దీనిని వాస్తవమైనదిగా భావించవచ్చు. ఫోటోషాప్ చేయబడిన పిక్చర్స్ లేదా రూపం లేదా కంటెంట్ ను మార్చిన వీడియోలు సహా సవరించబడిన లేదా మార్చబడిన మీడియా కోసం మేము జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తాము. ప్రజలే-ప్రాధాన్యత గల ప్రక్రియలు పై ప్రభావం చూపించే కంటెంట్ ను మేము అనుమతించము. రాజకీయ ఎన్నికల ఫలితాలతో జోక్యం చేసుకునే ఏదైనా కంటెంట్ ను కూడా మేము అనుమతించము. సాధ్యమైనంత వరకు, మీరు ప్లాట్ ఫాం పై పోస్ట్ చేసిన కంటెంట్ వాస్తవంగా మరియు నమ్మకమైన మరియు ధృవీకరించబడిన ఆధారం నుండి సంపాదించినదై ఉండేలా నిర్ధారించాలి.

14. అనధికార కార్యకలాపాలు మరియు క్రమబద్ధీకరించబడిన వస్తువులు

కొన్ని క్రమబద్ధీకరించబడిన వస్తువులతో వ్యాపారం చేయడం, విక్రయించడం, ప్రోత్సహించడం మరియు ఉపయోగించడాన్ని, నేరపూరితమైన కార్యకలాపాలను వర్ణించడం లేదా ప్రోత్సహించడాన్ని మేము నిషేధిస్తాం. అత్యధిక ప్రాంతంలో అనధికారమైన లేదా ప్రపంచంలో నియంత్రించబడిన వస్తువులు లేదా కార్యకలాపాలకు సంబంధించిన కొంత కంటెంట్ ప్రశ్నిస్తున్న వస్తువులు లేదా కార్యకలాపాలు పోస్టింగ్ చేస్తున్న న్యాయ పరిధిలో చట్టబద్ధమైనా కూడా తొలగించబడుతుంది. విద్యా, శాస్త్రీయమైన, కళాత్మకమైన మరియు వార్తా సమాచారం వంటి ప్రజలకు విలువనిచ్చే కంటెంట్ కు మేము మినహాయింపులు అనుమతిస్తాం. ఆయుధాలు, పేలుడు సామగ్రి, అనధికార వస్తువులు లేదా సేవలు, నియంత్రించబడిన వస్తువులు, డ్రగ్స్, నియంత్రించబడిన పదార్థాలను ప్రోత్సహించే లేదా విక్రయించే ఏదైనా కంటెంట్ , లైంగికపరమైన సేవలను అభ్యర్థించడం లేదా విక్రయించడం ప్లాట్ ఫాం పై అనుమతించబడదు మరియు కఠినంగా నిషేధించబడింది.

పేకాట లేదా హవాలాకు సంబంధించిన లేదా ప్రోత్సహించే కంటెంట్ కఠినంగా నిషేధించబడింది.

కంప్యూటర్ ఆధారం పనితీరును నిరోధించడానికి లక్ష్యంగా గల కంప్యూటర్ వైరస్ లు, మాల్ వేర్ లేదా ఏదైనా కంప్యూటర్ కోడ్ రకం ఉన్న కంటెంట్ ప్లాట్ ఫాం పై అప్ లోడ్ చేయబడటానికి అనుమతించబడదు. మీరు పోస్ట్ చేసిన కంటెంట్ అనధికారంగా, అనైతికంగా లేదా నీతిరహితమైనదిగా ఉండరాదని దయచేసి నిర్ధారించండి.

15. మేథో సంపత్తి (కాపీరైట్ మరియు ట్రేడ్ మార్క్)ఉల్లంఘన

మీరు పోస్ట్ చేసిన కంటెంట్ లోని అన్ని మేథో సంపత్తి హక్కులు మీకు ఉంటాయని లేదా అలాంటి కంటెంట్ ను ప్లాట్ ఫాం పై పోస్ట్ చేయడానికి, ప్రదర్శించడానికి, పునరుత్పత్తి చేయడానికి, కాపీలు చేయడానికి, ప్రసారం చేయడానికి, ప్రజలకు కమ్యూనికేట్ చేయడానికి మీ వద్ద చెల్లుబాటయ్యే లైసెన్స్ ఉందని మీరు అంగీకరించారు మరియు నిర్ధారించారు, గుర్తించారు.

సాఫ్ట్ వేర్ , ఇంటర్ ఫేస్, వెబ్ పేజీలు, డేటా బేస్, పేరు మరియు లోగో సహా అయితే వాటికి మాత్రమే పరిమితం కాకుండా రిజిస్టర్ చేయబడిన లేదా రిజిస్టర్ చేయబడని ప్లాట్ ఫాంలో ఉన్న అన్ని మేథో సంపత్తి హక్కులు వెర్సేకు సంబంధించినవిగా మీరు అంగీకరించారు, నిర్థారించారు మరియు గుర్తించారు. ఇంతకు ముందు చెప్పిన మేథో సంపత్తి రకాలలో వేటికైనా ఏదైనా హక్కును మీరు క్లెయిమ్ చేయరు.

మీరు పోస్ట్ చేసిన కంటెంట్ మీకే సొంతం. ప్లాట్ ఫాంలో వెర్సేకు అన్ని హక్కులు సొంతం.

మీరు ప్లాట్ ఫాం పై కంటెంట్ ను పోస్ట్ చేసినప్పుడు, ఉపయోగించడానికి, వాణిజ్యపరంగా ఉపయోగించడానికి , కాషే, భద్రపరచడానికి, ప్రచురించడానికి, ప్రదర్శించడానికి, పంపిణీ చేయడానికి, మరియు మీరు పోస్ట్ చేసిన కంటెంట్ లో దాగున్న పనులు సహా అలాంటి కంటెంట్ ను భద్రపరచడానికి మీరు వర్సేకు ప్రత్యేకం కాని, శాశ్వతమైన, ప్రపంచవ్యాప్తంగా, బదిలీ చేయబడే, తిరుగులేని, రాయల్టీ-రహితమైన, అపరిమితమైన లైసెన్స్ ను మంజూరు చేసారు. మీరు పోస్ట్ చేసిన కంటెంట్ కు వర్తించే ఏదైనా లైసెన్స్ ఫీజు, రాయల్టీ లేదా ఏదైనా ఇతర పరిశీలనకు చెల్లించడానికి మీరు బాధ్యులని మీరు అంగీకరించారు, అర్థం చేసుకున్నారు మరియు నిర్ధారించారు.

ప్లాట్ ఫాం పై మీరు పోస్ట్ చేసిన కంటెంట్ ను ఉపయోగించడానికి మీరు వర్సేకు హక్కు ఇచ్చారు.

ఈ పాలసీలో స్పష్టంగా ఏర్పాటు చేసిన విధంగా కాకుండా, ఏదైనా కంటెంట్, సాఫ్ట్ వేర్, మెటీరియల్స్ లేదా సేవలను పూర్తిగా లేదా సగం భాగాన్ని మీరు కాపీ చేయరాదు, సవరించరాదు, ప్రచురించడం , ప్రసారం చేయడం, అప్ లోడ్ చేయడం, బదిలీ లేదా అమ్మకంలో పాల్గొనడం , పునరుత్పత్తి చేయడం (ఈ విభాగంలో అందించినవి మినహా), వాటి ఆధారంగా ఉత్పన్నమైన పనులను సృష్టించడం, పంపిణీ చేయడం, ప్రదర్శించడం, లేదా ఏ విధంగానైనా దోపిడీ చేయరాదు.

ప్లాట్ ఫాం పై పోస్ట్ చేసిన ఏదైనా కంటెంట్ ను అనధికార లక్ష్యాలు కోసం ఉపయోగించరాదు.

మీరు ఏదైనా కంటెంట్ ను ప్లాట్ ఫాం నుండి తొలగిస్తే లేదా మీరు ప్లాట్ ఫాంను ఉపయోగించడాన్ని రద్దు చేస్తే, వర్సే తన స్వంత నిర్ణయాధికారం మేరకు మరియు ఏదైనా చట్టబద్ధమైన లక్ష్యం కోసం మీ కంటెంట్ ను భద్రపరుస్తుంది మరియు ఉపయోగిస్తుంది. వర్సే మరియు దాని యూజర్స్ మీరు ఉపయోగించడాన్ని రద్దు చేసిన తేదీ తరువాత కూడా ఏదైనా మీ కంటెంట్ ను ఉపయోగించడాన్ని, భద్రపరచడాన్ని నిలిపి ఉంచుతారు మరియు కొనసాగిస్తారు.

మీరు ప్లాట్ ఫాం నుండి తొలగించిన తరువాత కూడా కంటెంట్ ను ఉపయోగించడానికి వర్సే తన హక్కును కలిగి ఉంటుంది.

సి. ప్రాతినిధ్యాలు మరియు వారంటీలు

మీరు పోస్ట్ చేసిన కంటెంట్ ఈ పాలసీలో ఉన్న ఏదైనా నియమాన్ని ఉల్లంఘించలేదని లేదా కంటెంట్ ను పోస్ట్ చేసే ప్రాంతంలో అమలులో ఉన్న చట్టాన్ని లేదా ప్రజలకు తెలియచేయబడిన, పునరుత్పత్తి చేయబడిన లేదా కాపీ చేయబడిన, ఉపయోగించబడిన, ప్రసారం చేయబడిన, ప్రచురించబడిన, ప్రదర్శించబడిన ప్రాంతంలో అమలులో ఉన్న ఏదైనా చట్టాన్ని కంటెంట్ ఉల్లంఘించలేదని మీరు ప్రాతినిధ్యంవహిస్తున్నారు, అంగీకరించారు మరియు హామీ ఇస్తున్నారు.

కంటెంట్ లో దాగున్న పనులు సహా కంటెంట్ ను ప్లాట్ ఫాం పై పోస్ట్ చేయడానికి మీ వద్ద చెల్లుబాటయ్యే లైసెన్స్ ఉందని లేదా మీకు సొంతంగా ఉందని మరియు ఈ పాలసీ ద్వారా మీ బాధ్యతలను నెరవేర్చడానికి మీరు మరింత ప్రాతినిధ్యంవహిస్తున్నారు, అంగీకరించారు మరియు హామీ ఇచ్చారు.

మీ పోస్ట్ చట్టబద్ధమైనదని మీరు నిర్థారించారు మరియు దానిని పోస్ట్ చేయడానికి మీకు హక్కు ఉంది.

ఈ పాలసీ ద్వారా వెర్సే ఎటువంటి హామీలు ఇవ్వదు. మరియు వెర్సే అన్ని హామీలు, వీటితో సహా అయితే వీటికి మాత్రమే పరిమితం కాకుండా వ్యక్తీకరించబడిన లేదా సూచించేవి స్పష్టంగా తిరస్కరించింది:

  • ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం వర్తకం, యోగ్యతలు యొక్క వ్యక్తీకరించబడే లేదా సూచించబడే వారంటీలు మరియు ప్లాట్ ఫాం (లు) లేదా ఏదైనా ఇతర అంశానికి సంబంధించిన ఉల్లంఘనలు కానివి;
  • ఏవైనా మరియు అన్ని కంటెంట్స్ కి సంబంధించిన హామీలు;
  • ఏదైనా ప్రకటన లభ్యతతో సహా అయితే దానికి మాత్రమే పరిమితం కాని ప్లాట్ ఫాం (లు), సేవలు, సాంకేతికత యొక్క పనితీరు లేదా నాణ్యతకు సంబంధించిన హామీలు; మరియు
  • ప్లాట్ ఫాం (లు ) మరియు /లేదా అది అందించే సేవలు అంతరాయం లేకుండా, సమయానుకూలంగా లేదా దోషరహితంగా ఉంటాయని హామీ ఇస్తుంది.

ప్లాట్ ఫాంకు సంబంధించి వెర్సే ఎలాంటి హామీలు ఇవ్వదు.

డి. నష్టపరిహారం

మీరు నష్టపరిహారం చెల్లిస్తారు మరియు వెర్సే మరియు దాని అనుబంధ సంస్థలు, వ్యాపార భాగస్వాములు మరియు వారి డైరక్టర్స్, అధికారులు, ఉద్యోగులను వ్యయాలు, న్యాయవాది ఫీజు సహా మీరు పోస్ట్ చేసిన కంటెంట్ కి సంబంధించి లేదా దాని వలన ఏదైనా మూడవ పక్షం ద్వారా, మీ వలన ఈ పాలసీ ఉల్లంఘనలో లేదా మీరు చేసిన ఏదైనా అనధికార పని వలన తలెత్తిన ఏదైనా క్లెయిమ్ లేదా డిమాండ్ నుండి హానిరహితంగా ఉంచుతారు.

మీరు ప్లాట్ ఫాం పై చేసిన ఏదైనా పని వలన వర్సే పై దావా వేసినట్లయితే అటువంటి ఖర్చులను మీరే భరించాలి.

చట్టం అనుమతించిన అత్యధిక మేరకు, వర్సే మరియు /లేదా దాని అనుబంధ సంస్థలు (ఏ) ప్లాట్ ఫాంను యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం కోసం మీ యాక్సెస్ చేయడానికి మీ అసమర్థత లేదా ఉపయోగించడం ; (బి) ఇతర యూజర్స్ లేదా మూడవ పక్షాలు యొక్క పరువు నష్టం, దూషితమైన లేదా అనధికార ప్రవర్తన సహా అయితే దీనికి మాత్రమే పరిమితం కాకుండా ప్లాట్ ఫాం పై ఏదైనా మూడవ పక్షం కంటెంట్ లేదా ఏదైనా ప్రవర్తన ; లేదా (సి) అనధికార యాక్సెస్, మీ కంటెంట్ లేదా ప్రసారాలు యొక్క వాడకం లేదా మార్పు నుండి తలెత్తిన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, లేదా డేటా యొక్క ఏదైనా నష్టం, వాడకం, మంచి ఉద్దేశం లేదా ఇతర కనిపించని నష్టాలు భరించడం, లేదా ఏవైనా లాభాలు లేదా ఆదాయాలు నష్టపోవడం, లేదా శిక్షాత్మకమైన నష్టాలు లేదా ఏదైనా పరోక్షమైన, అనుషంగికమైన, ప్రత్యేకమైన, పరిణామాత్మకమైన నష్టాలకు బాధ్యతవహించవు.

ఈ. మా బాధ్యత పరిమితం

బాధ్యత యొక్క ఈ పరిమితి మీరు మరియు వర్సెలు మధ్య జరిగిన బేరంలో భాగం మరియు బాధ్యతకు (ఉదా వారంటీ, నిర్లక్ష్యం, కాంట్రాక్ట్, చట్టం, తప్పు పని) సంబంధించిన అన్ని క్లెయిమ్స్ కు వర్తిస్తుంది మరియు ఏదైనా లాంటి నష్టం యొక్క సంభావ్యత గురించి వర్సే లేదా దాని అనుబంధ సంస్థలకు అటువంటి నష్టం జరిగే అవకాశం గురించి చెప్పబడినా కూడా , ఈ పరిష్కారాలు మరియు వాటి ప్రధానమైన ఉద్దేశ్యాలు విఫలమైనా కూడా .

ఎఫ్. నోటీసు మరియు ఫిర్యాదు పరిష్కారం వ్యవస్థలు

ప్లాట్ ఫాం ద్వారా పొందే కంటెంట్ లేదా ప్రకటనలకు వర్సే బాధ్యతవహించదని నోటీసు ప్రత్యేకంగా ఇవ్వబడింది. మూడవ పక్షం హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు క్లెయిమ్ చేయబడిన కంటెంట్ కు యాక్సెస్ తొలగించడానికి మరియు /లేదా నిలిపివేయడానికి మరియు / లేదా ఇతర మూడవ పక్షాల మేధో సంపత్తి లేదా ఇతర హక్కులను ఉల్లంఘించే ప్లాట్ ఫాం యొక్క యూజర్స్ అకౌంట్స్ ను రద్దు చేయడానికి వర్సే తన స్వంత నిర్ణయాధికారం మేరకు హక్కు ఉంది.

  • ఫిర్యాదు పరిష్కారం వ్యవస్థ

ఫిర్యాదులతో వ్యవహరించడానికి వర్సే ఈ క్రింది వ్యవస్థను అమలు చేసింది:

సేవా నియమాలు, గోప్యతా పాలసీ మరియు కమ్యూనిటీ మార్గదర్శక సూత్రాలు ఉల్లంఘనలకు సంబంధించిన విచారాలు లేదా ఫిర్యాదులు తప్పనిసరిగా "రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ " పరిష్కరించాలి. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ ను grievance.officer@myjosh.in ద్వారా లేదా ఈ క్రింది పట్టికలో వివరించిన విధంగా మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. వర్సే ఫిర్యాదును తొలగించడానికి అవసరమైన సమాచారాన్ని ఫిర్యాదు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

మీరు సంప్రదించవచ్చు:

పరిధి

పేరు/శీర్షిక

Email-Id

ఫిర్యాదు పరిష్కారం కోసం

గ్రీవెన్స్ అధికారి: శ్రీ నాగరాజ్

grievance.officer@myjosh.in

చట్టాన్ని అమలుచేసే సమన్వయం కోసం

నోడల్ అధికారి: శ్రీ. సునీల్ కుమార్ డీ

nodal.officer@myjosh.in

రెగ్యులేటరి అనుసరణ కోసం

కాంప్లియెన్స్ అధికారి

compliance.officer@myjosh.in

ప్లాట్ ఫాం పై ప్రచురించబడిన ప్రకటన లేదా కంటెంట్ ద్వారా బాధకు గురైన ఏ వ్యక్తియైనా /సంస్థయైనా అలాంటి కంటెంట్ లేదా ప్రకటన  పై ఫిర్యాదు నమోదు చేయవచ్చు. బాధిత వ్యక్తి /సంస్థ యొక్క చట్టబద్ధమైన వారసులు, ఏజెంట్ లేదా న్యాయవాది కూడా అలాంటి కంటెంట్ లేదా వ్యాసం పై ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఫిర్యాదు నేర పరిధిలోకి రాకపోతే, కంటెంట్ లేదా ప్రకటనతో బాధితుడు కాని వ్యక్తి లేదా ఆసక్తి లేని సంబంధం లేని వ్యక్తి /సంస్థ, కంటెంట్ లేదా ప్రకటన పై చెల్లుబాటయ్యే ఫిర్యాదును నమోదు చేయలేరు. మీరు బాధిత పార్టీ యొక్క ఏజెంట్ లేదా న్యాయవాది అయితే, మీరు డాక్యుమెంటరీ ప్రూఫ్ సమర్పించవలసిన అవసరం ఉంది, బాధిత పక్షం తరపున ఫిర్యాదు నమోదు చేయడానికి మీ హక్కును సమర్థించాలి. ప్రత్యామ్నాయంగా, మాకు ఇక్కడ రాయవచ్చు:

వర్సే ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్

11వ అంతస్తు, వింగ్ ఈ, హీలియోస్ బిజినెస్ పార్క్,

ఔటర్ రింగ్ రోడ్, కడుబీసనహళ్లి

బెంగళూరు- 560103, కర్ణాటక, భారతదేశం

ఫిర్యాదు లేదా మా ఉత్పత్తిని ఉపయోగించిన యూజర్ ఎదుర్కొనే ఇతర సమస్య ఈ క్రింది చిరునామాకు ఈమెయిల్ ద్వారా సమర్పించబడవచ్చు. ఫిర్యాదు ఇవి కేటాయించాలి: (i) సంబంధిత ఖాతాదారు యొక్క యూజర్ నేమ్ (ii) విచారం యొక్క నిర్దేశిత కంటెంట్ /వీడియో మరియు (iii) అలాంటి అభ్యర్థన తీసుకోవడానికి గల కారణం (లు).

ఫిర్యాదును తొలగించడానికి జోష్ కోసం అవసరమైన విధంగా అలాంటి సమాచారం ఫిర్యాదులో ఉండాలి. జోష్ కు ఇచ్చిన అన్ని నోటీసులు రాతపూర్వకంగా ఉంటాయి మరియు వ్యక్తిగతంగా అందచేసినా లేదా రిజిస్టర్డ్ మెయిల్ ద్వారా పంపించినా, వాపసు రసీదు అభ్యర్థించినా లేదా పై చిరునామాకు లేదా ఈమెయిల్ ద్వారా పంపబడినా తగిన విధంగా పంపించబడతాయి.

ఈ యూజర్ ఒప్పందం యొక్క నియమాలను నేను చదివాను మరియు అర్థం చేసుకున్నాను మరియు ఇందుమూలముగా, నేను ఇష్టపూర్వకంగా, బేషరతుగా దానికి కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నాను.

ఈ గోప్యతా పాలసీ గురించి మీకు ఏవైనా విచారాలు లేదా ఫిర్యాదులు ఉంటే, మీరు జోష్ గ్రీవెన్స్ అధికారిని ఈమెయిల్ లేదా మెయిల్ ద్వారా సంప్రదించవచ్చ. మీరు ఫిర్యాదులను "గోప్యతా ఫిర్యాదు" అంశంతో ఈమెయిల్ అడ్రస్ grievance.officer@myjosh.in కి పంపించవచ్చు. ఈమెయిల్ లేదా లేఖ రాయడం ద్వారా పైన చెప్పిన విధానాలకు కూడా మీరు గ్రీవెన్స్ అధికారిని సంప్రదించవచ్చు.

tower
inter circlw intercircle intercircle intercircle

Ohh Nooo!

There is no internet connection, please check your connection

TRY AGAIN

Ohh Nooo!

Landscape mode not supported, Please try Portrait.